News May 31, 2024

గొర్రెల పంపిణీ స్కీంలో ₹700 కోట్ల స్కామ్: ACB

image

TG: గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల స్కామ్ జరిగిందని ACB దర్యాప్తులో గుర్తించింది. ఇప్పటికే ఈ కేసులో 10 మంది అధికారులను అరెస్ట్ చేసిన ACB.. ఇవాళ <<13350744>>ఇద్దరు<<>> కీలక అధికారులను అరెస్ట్ చేసింది. స్కామ్‌లో ఉన్నతాధికారుల పాత్రపై పూర్తిస్థాయి విచారణ చేయనుంది. లబ్ధిదారులకు బదులు ప్రైవేట్ వ్యక్తుల(బ్రోకర్లు, అధికారుల) ఖాతాల్లోకి నగదు బదిలీ అయినట్లు ACB తేల్చింది. లబ్ధిదారుల ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది.

News May 31, 2024

రాజీనామాతో కేసీఆర్ బాటకే జై కొట్టారు: కేటీఆర్

image

TG: రాష్ట్ర సహకార బ్యాంకు పదవులకు రాజీనామా చేసిన రవీందర్‌రావు, మహేందర్‌రెడ్డిలను మాజీ మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ‘తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమంటూ, అవసరమైనప్పుడు పదవులను గడ్డిపరకలా వదిలివేయడం నేర్పిన కేసీఆర్ బాటలో.. పదవులకు రాజీనామా చేయడం అభినందనీయం. కాంగ్రెస్ పార్టీలో చేరి పదవులు కాపాడుకోవాలని ప్రలోభాలకు గురిచేసినా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ బాటకే జై కొట్టారు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

News May 31, 2024

రేపు చరణ్ చేతుల మీదుగా ‘మనమే’ ట్రైలర్ విడుదల

image

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘మనమే’. ఇప్పటికే పోస్టర్స్, ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాగా.. ట్రైలర్‌పై చిత్ర యూనిట్ అప్‌డేట్ ఇచ్చింది. రేపు ఉదయం 11.07 గంటలకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తారని ప్రకటించింది. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. జూన్ 7న మూవీ రిలీజ్ కానుంది.

News May 31, 2024

ఎగ్జిట్​ పోల్స్​ అంటే ఏంటి? ఎవరిస్తారు?

image

ఎన్నికల పోలింగ్ జరిగేటప్పుడు/పోలింగ్ పూర్తయ్యాక వివిధ ఏజెన్సీలు సర్వేలు చేస్తాయి. ప్రజల అభిప్రాయాలను సేకరించి ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది? ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది? ఏ పార్టీ ఓడిపోతుంది? అని అంచనా వేస్తాయి. AXIS MY INDIA, C-ఓటర్, చాణక్య, టైమ్స్ నౌ, ఇండియా టుడే, CNX, ABP తదితర సంస్థలు సర్వేలు నిర్వహించి ప్రాచుర్యం పొందాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులైన సందర్భాలూ ఉన్నాయి.

News May 31, 2024

ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రేపు అల్లూరి, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. అటు ఇవాళ పల్నాడు(D) వినుకొండలో 45.9 డిగ్రీలు, ప్రకాశం(D) పుల్లలచెరువులో 45.4, NTR(D) నందిగామలో 45.3, GNT(D) తుళ్లూరు, ఫిరంగిపురంలో 45 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News May 31, 2024

బర్డ్‌ఫ్లూ ముప్పు: రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం

image

పౌల్ట్రీ, పక్షుల అసాధారణ మరణాలు సంభవిస్తే వెంటనే తమకు తెలియజేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. AP(నెల్లూరు), MH(నాగ్‌పూర్), KL(అలప్పుజ, కొట్టాయం), JH(రాంచీ)లలో ఈ ఏడాది <<13347975>>బర్డ్ ఫ్లూ<<>> వ్యాప్తిని గుర్తించామని తెలిపింది. ఇది మనుషులకు సోకే అవకాశం ఉందని.. మందులు, PPE కిట్లు, మాస్కులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ఇన్‌ఫెక్షన్ సోకిన పక్షులను వధించే, పర్యవేక్షించే వారి నమూనాలను టెస్ట్ చేయాలంది.

News May 31, 2024

జడ్జిని ప్రజ్వల్ రేవణ్ణ ఏం కోరారంటే?

image

కస్టడీలో తనకు ఇంటి నుంచి భోజనం తెప్పించేలా అవకాశం కల్పించాలని, కేసుకు సంబంధించి మీడియా కవరేజీపై ఆంక్షలు విధించాలని ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జడ్జిని కోరారు. దీంతో పాటు బాత్రూమ్‌లు శుభ్రంగా లేవని, దుర్వాసన వస్తోందని వివరించారు. మహిళలపై అత్యాచారం, వీడియోల చిత్రీకరణ కేసులో ప్రజ్వల్‌ను కోర్టు కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే.

News May 31, 2024

ఆవు కళేబరం నుంచి ముగ్గురికి ఆంత్రాక్స్

image

ఒడిశాలో ‘ఆంత్రాక్స్’ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కోరాపుట్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులకు పాజిటివ్‌గా తేలడంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరింత మందికి వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఆంత్రాక్స్ సోకిన ఆవు కళేబరం నుంచి వారికి ఈ బ్యాక్టీరియా సోకినట్లు గుర్తించారు. ‘బాసిల్లస్ ఆంత్రాసిస్’ అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

News May 31, 2024

రేపు సా.6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్: ఈసీ

image

ఎగ్జిట్ పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126ఏ(1) ప్రకారం నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. కాగా రేపు ఏడో విడత పోలింగ్ జరగనుంది. దీంతో దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.

News May 31, 2024

లండన్ నుంచి బయల్దేరిన జగన్

image

AP CM జగన్ విదేశీ పర్యటన ముగిసింది. ఇప్పటికే ఆయన లండన్ నుంచి బయల్దేరారు. రేపు తెల్లవారుజామున 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోని నివాసానికి వెళ్తారు. రేపు మధ్యాహ్నం పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్‌ ఏర్పాట్లు, పోస్టల్ బ్యాలెట్ వివాదం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. జగన్ ఈనెల 17న విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.