News May 31, 2024

తెలంగాణ ఐసెట్ హాల్‌టికెట్లు విడుదల

image

TG: MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ICET పరీక్ష జూన్ 5, 6 తేదీల్లో జరగనుంది. కాసేపటి క్రితం అధికారులు హాల్‌టికెట్లను విడుదల చేశారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్, DOB, క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ హాల్‌టికెట్ నంబర్లను ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులు పొందవచ్చు. హాల్‌టికెట్ల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. జూన్ 28న ఫలితాలు విడుదల కానున్నాయి.

News May 31, 2024

ఎగ్జిట్ పోల్ చర్చలకు కాంగ్రెస్ దూరం

image

ఎగ్జిట్ పోల్స్ వెలువడే వేళ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. TV ఛానల్స్‌లో జరిగే ఎగ్జిట్ పోల్ చర్చల్లో పాల్గొనకూడదని నిర్ణయించినట్లు AICC అధికార ప్రతినిధి పవన్ ఖేరా తెలిపారు. ‘ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. దానికి ముందు TRP కోసం ఊహాగానాలతో జరిగే చర్చల్లో కాంగ్రెస్ పాల్గొనదు. ఫలితాలు వెలువడే రోజు నుంచి పాల్గొంటాం’ అని ఆయన ట్వీట్ చేశారు.

News May 31, 2024

ప్రజ్వల్‌ తల్లికి ముందస్తు బెయిల్ నిరాకరణ

image

JD(S) సస్పెండెడ్ MP <<13350188>>ప్రజ్వల్ రేవణ్ణ<<>> తల్లి భవానీ రేవణ్ణకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కర్ణాటకలోని లోకల్ కోర్టు నిరాకరించింది. ప్రజ్వల్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాల్సిన ఓ బాధిత మహిళను కిడ్నాప్ చేసిన కేసులో భవానీకి SIT అధికారులు నోటీసులు పంపించారు. ముందస్తు బెయిల్ కోసం ఆమె కోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. ఈ కేసులో భాగంగా SIT అధికారులు ఆమెను రేపు ప్రశ్నించనున్నారు.

News May 31, 2024

చంద్రబాబును కలిసిన టీడీపీ నేతలు

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబును ఆ పార్టీకి చెందిన నేతలు చినరాజప్ప, అఖిలప్రియ, ప్రభాకర్, నాగుల్ మీరా, రామాంజనేయులు సహా పలువురు HYDలో కలిశారు. ఎన్నికలు జరిగిన తీరు, కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయనతో వారంతా చర్చించారు. రేపు బాబు అమరావతి వెళ్లే అవకాశం ఉంది.

News May 31, 2024

image

http://dynrjberp8k9n.cloudfront.net/cd-timer/exitpolls-cd-timer.html

News May 31, 2024

రేపు అకౌంట్లోకి పెన్షన్ డబ్బులు

image

AP: మే నెల పెన్షన్ డబ్బులను రేపటి నుంచి 2 విధానాల్లో పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 65.30 లక్షల మంది పెన్షనర్లలో 47.74 లక్షల మందికి DBT ద్వారా వారి అకౌంట్లలో జమ చేయనుంది. మిగతా 17.56 లక్షల మందికి డోర్ టు డోర్ ద్వారా సచివాలయ ఉద్యోగులు జూన్ 1 నుంచి 5వ తేదీలోగా పంపిణీ చేస్తారని పేర్కొంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా పెన్షన్లు అందించాలని కలెక్టర్లను ప్రభుత్వం కోరింది.

News May 31, 2024

జూన్ 5లోపు ఏపీలోకి రుతుపవనాలు: IMD

image

AP: నైరుతి రుతుపవనాలు జూన్ 5లోపు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని IMD వెల్లడించింది. ప్రీ మాన్‌సూన్ వల్ల APలో ప్రస్తుతం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది. 2-3 రోజులు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంది. ఇక కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని చెప్పింది.

News May 31, 2024

గర్ల్‌ఫ్రెండ్‌ని వెతికిపెట్టండి.. పోలీస్ రిప్లై ఇదే!

image

తనకు గర్ల్ ఫ్రెండ్‌ను వెతికిపెట్టాలని ఓ వ్యక్తి ఢిల్లీ పోలీసులను కోరారు. తాను సిగ్నల్ (సింగిల్‌ అనకుండా సిగ్నల్) అని, ఎప్పుడు దొరుకుతుందని పోలీసులను ప్రశ్నించాడు. తనకు గర్ల్ ఫ్రెండ్‌ని వెతికి పెట్టడంలో సహాయం చేయాలని కోరగా.. ఢిల్లీ పోలీసులు రిప్లై ఇచ్చారు. ‘ఆమె తప్పిపోతే తనని గుర్తించేందుకు హెల్ప్ చేస్తాం. ఒకవేళ మీరు సిగ్నలైతే గ్రీన్‌లో ఉండాలని కోరుకుంటాం’ అని సెటైరికల్ రిప్లై ఇచ్చారు.

News May 31, 2024

PMగా నా ఛాయిస్ రాహుల్‌.. ప్రియాంక పోటీ చేయాల్సింది: ఖర్గే

image

INDIA కూటమి అధికారంలోకి వస్తే PMగా తన ఛాయిస్ రాహుల్‌ గాంధీ అని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వెల్లడించారు. రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’తో మోదీని సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్నారు. అటు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రియాంకను ప్రోత్సహించానని, ఆమె పోటీ చేయాల్సిందని అభిప్రాయపడ్డారు. INDIA కూటమి తమ ప్రధాని అభ్యర్థిని ప్రకటించలేదని NDA విమర్శిస్తున్న నేపథ్యంలో ఖర్గే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

News May 31, 2024

పోస్టల్ బ్యాలెట్‌ వ్యవహారం.. వైసీపీ పిటిషన్‌పై తీర్పు వాయిదా

image

AP: పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ వేసిన <<13343011>>పిటిషన్‌పై<<>> తీర్పును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు సాయంత్రం 6 గంటలకు తీర్పు చెబుతామని పేర్కొంది. పోస్టల్ బ్యాలెట్‌ ఓటుపై సీల్ లేకున్నా చెల్లుతుందని ఈసీ చెప్పగా.. దాన్ని సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టుకు వెళ్లింది. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది తీర్పును వాయిదా వేసింది.