India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని దేవర్ చెప్పినట్లు ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్ పేర్కొన్నారు. తమిళనాడులోని పసుంపొన్‌లో స్వాతంత్ర్య సమరయోధుడు ముత్తురామలింగ దేవర్ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. “నేతాజీకి దేవర్ బలమైన మద్దతుదారుడు. ఆయన జీవితంలో అబద్ధం ఆడలేదు. ‘నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదు. నేను ఆయన్ను కలిశాను’ అని దేవర్ చెప్పారు. నేను అదే నమ్ముతాను” అని తెలిపారు.

TG: రాష్ట్ర మంత్రిగా అజహరుద్దీన్ ఇవాళ మ.12.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. DEC తర్వాత మరో ఇద్దరు క్యాబినెట్‌లో చేరుతారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. దీనిపై CM రేవంత్ రెడ్డి, అధిష్ఠానం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఇక మంత్రివర్గ విస్తరణను అడ్డుకునేందుకు BJP ప్రయత్నిస్తోందని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో BRSను గెలిపించడమే ఆ పార్టీ లక్ష్యమని మహేశ్ ఆరోపించారు.

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో ద్రాక్ష పండు సాయపడుతున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. లండన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనంలో ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్ అనే పాలీఫెనాల్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంతో పాటు అవి ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధించడంలో సహాయపడుతుందని గుర్తించారు.

ఉమెన్స్ ODI వరల్డ్ కప్ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన జెమీమా రోడ్రిగ్స్‌ను నెటిజన్లు గంభీర్‌తో పోలుస్తున్నారు. 2011 WC ఫైనల్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గంభీర్ 97 రన్స్ చేసి IND విజయంలో కీలక పాత్ర పోషించారు. నిన్నటి మ్యాచులో జెమీమా సైతం మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశారు. ఇద్దరి జెర్సీ నంబర్ ఒకటే కావడం(5), ఇద్దరి జెర్సీలకు మట్టి ఉండటంతో వారి ఫొటోలను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

హిందూ సంప్రదాయం ప్రకారం.. అసుర సంధ్యా వేళలో ‘చారణులు’ అనే దేవతలు ఆకాశంలో సంచరిస్తూ ఉంటారట. ఈ సమయంలో మనం ఏం మాట్లాడినా వారు ‘తథాస్తు’ అని దీవిస్తారని పండితులు చెబుతున్నారు. అందుకే సాయంకాలం చెడు మాటలు మాట్లాడొద్దని మన పెద్దలు చెబుతుంటారు. మట్లాడేటప్పుడు తొలుత మనం చెడు మాట పలికితే.. ఆ దేవతలు పూర్తి మాట వినకుండా ఆ మొదటి మాటకే ‘తథాస్తు’ అనేస్తారట. అందుకే సాయంత్రం వేళ మంచి మాత్రమే మాట్లాడాలి.

అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీలో 30 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్-B పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఐటీఐ, డిప్లొమా అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు రూ.750. వెబ్‌సైట్: https://www.prl.res.in/

➤ ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రాష్ట్రానికి రూ.150కోట్లు విడుదల చేసిన కేంద్రం
➤ SC, ST అట్రాసిటీ బాధితులకు రాయితీపై రుణాలు: మాల కార్పొరేషన్ ఛైర్మన్ విజయ్ కుమార్
➤ NOV 2 నుంచి లండన్ పర్యటనకు మంత్రి దుర్గేశ్.. అక్కడ జరిగే వరల్డ్ ట్రావెల్ మార్కెట్-2025లో పాల్గొననున్న మంత్రి
➤ రాష్ట్ర వ్యాప్తంగా 1,592 స్కూళ్లలో బాలికలకు కరాటేలో శిక్షణ.. 2025-26 అకడమిక్ ఇయర్‌లో 2 నెలల పాటు 20 తరగతుల నిర్వహణ

ఆలయాల్లో మూల విరాట్టు కింద రాగి రేకుపై యంత్రాలు, బీజాక్షరాలను ప్రతిష్ఠిస్తారు. రాగి మంచి విద్యుత్ వాహకం కావడంతో.. ఆ రేకుపై ఉన్న గీతలు, బీజాక్షరాల మధ్య శక్తి కేంద్రీకృతమవుతుంది. మంత్రాలతో కలిపి ప్రతిష్ఠించడం వల్ల చుట్టూ ఉన్న శక్తి కూడా ఆ కేంద్రంలోకి ఆకర్షితమవుతుంది. ఇలా ఏర్పడిన శక్తి క్షేత్రంలోకి మనం ప్రవేశించినప్పుడు, మన శరీరం దాన్ని గ్రహిస్తుంది. ఫలితంగా మనకు మానసిక బలం, ధైర్యం లభిస్తాయి.

SSCలో 7,565 ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఇంటర్ అర్హతగల 18-25ఏళ్ల వయసు గలవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, PE&MT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. మహిళలు, SC, ST, మాజీ సైనికులకు ఫీజు లేదు. డిసెంబర్ /జనవరిలో రాత పరీక్ష నిర్వహిస్తారు.

సెమీస్‌లో ఆసీస్‌పై గెలుపుతో హర్మన్ సేన నిన్న ఫైనల్‌లోకి అడుగు పెట్టి SAతో NOV 2న తలపడనున్న విషయం తెలిసిందే. 1973 నుంచి మహిళల వరల్డ్ కప్ జరుగుతుండగా కేవలం 3 జట్లే విజేతలుగా నిలిచాయి.
1973: ఇంగ్లండ్, 1978: ఆస్ట్రేలియా, 1982: ఆస్ట్రేలియా, 1988: ఆస్ట్రేలియా, 1993: ఇంగ్లండ్, 1997: ఆస్ట్రేలియా, 2000: న్యూజిలాండ్, 2005: ఆస్ట్రేలియా, 2009: ఇంగ్లండ్, 2013: ఆస్ట్రేలియా, 2017: ఇంగ్లండ్, 2022: ఆస్ట్రేలియా.
Sorry, no posts matched your criteria.