News May 31, 2024

USలో మనుషులకూ బర్డ్‌ఫ్లూ.. మూడో కేసు నమోదు

image

ఇన్నాళ్లూ పక్షులు, జంతువులకు పరిమితమైన బర్డ్‌ఫ్లూ USలో మనుషులకూ విస్తరిస్తోంది. తాజాగా మూడో కేసు నమోదైందని, అతనికి ఆవుల నుంచి సోకిందని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అతను దగ్గు, కళ్ల సమస్యలతో బాధపడుతున్నాడంది. ఇంట్లోనే ఉంచి యాంటీవైరల్ మెడిసిన్ oseltamivirతో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. H5N1 అనే వైరస్ కారణంగా బర్డ్‌ఫ్లూ సోకుతుంది. ప్రస్తుతం 50 జంతు జాతులకు విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది.

News May 31, 2024

దారుణం: తన ఫోన్ తీసుకున్నాడని భర్తకు ఎలక్ట్రిక్ షాక్

image

UPలోని మెయిన్‌పురీలో అమానవీయ ఘటన జరిగింది. నిత్యం మొబైల్‌తో గడుపుతున్న భార్య ఫోన్‌ను భర్త తీసుకోగా, ఆమె అతనికి కరెంట్ షాక్ ఇచ్చింది. తొలుత మత్తుమందు ఇచ్చి మంచానికి కట్టేసింది. తర్వాత ఎలక్ట్రిక్ షాక్ ఇస్తూ కొడుతూ రాక్షసత్వం ప్రదర్శించింది. తండ్రి ప్రదీప్‌సింగ్‌ను కాపాడటానికి ప్రయత్నించిన 14 ఏళ్ల కొడుకుపైనా చేయి చేసుకుంది. ఎలాగోలా తప్పించుకున్న అతను భార్య బేబీ యాదవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News May 31, 2024

గాజాలో యుద్ధం ఆపితేనే చర్చలు: హమాస్

image

గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం ఆపితేనే తాము చర్చలు జరుపుతామని హమాస్ తెలిపింది. లేదంటే తాము ఎలాంటి చర్చల్లో పాల్గొనబోమని తేల్చిచెప్పింది. కాల్పుల విరమణకు తాము సిద్ధమేనని ప్రకటించింది. మరోవైపు హమాస్‌ను పూర్తిగా అంతమొందించేవరకూ యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. బందీలను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తోంది. కాగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య సంధి కోసం ఈజిప్టు, ఖతర్, US తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదు.

News May 31, 2024

GREAT: ఒకే ప్రభుత్వ స్కూల్‌లో 25 మందికి 500పైన మార్కులు

image

AP: ఇటీవల విడుదలైన టెన్త్ ఫలితాల్లో కృష్ణా జిల్లాలోని పెనమలూరు ZP పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. 25 మంది స్టూడెంట్స్‌కు 500పైన మార్కులు వచ్చాయి. ‘అత్యధిక మార్కులు సాధించిన మా ఆణిముత్యాలు వీరే’ అంటూ విద్యార్థుల ఫొటోలతో HM చేయించిన ఫ్లెక్సీ ఆకట్టుకుంటోంది. ఓవరాల్‌గా పలువురికి తెలుగులో 99, హిందీలో 94, ఇంగ్లిష్‌లో 94, మ్యాథ్స్‌లో 100, సైన్స్‌లో 99, సోషల్‌లో 99 మార్కులు వచ్చాయి.

News May 31, 2024

AB వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత.. కాసేపట్లో పోస్టింగ్

image

AP: రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ IPS ఆఫీసర్ AB వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. కాసేపట్లో పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇవాళ ఉద్యోగ విరమణ చేయనున్న దృష్ట్యా ఆయనను సర్వీస్‌లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, ABVకి పోస్టింగ్ ఇవ్వాలన్న క్యాట్ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లగా.. తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

News May 31, 2024

ఉమ్మడి రాజధాని పొడిగింపు అంశాన్ని లేవనెత్తాలి: లక్ష్మీనారాయణ

image

జూన్ 2వ తేదీతో ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. ఈక్రమంలో తెలంగాణ & ఆంధ్రప్రదేశ్‌ల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను మరికొన్నేళ్లు పొడిగించాలని డిమాండ్ చేయాలని CBI మాజీ JD లక్ష్మీనారాయణ కోరారు. ఈ అంశాన్ని APలోని అన్ని రాజకీయ పార్టీలు లేవనెత్తాలని సూచించారు. AP పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 5 ప్రకారం దీనికి అవకాశం ఉందని తెలిపారు. జగన్, CBN, పవన్, షర్మిలను ట్యాగ్ చేస్తూ Xలో పోస్ట్ చేశారు.

News May 31, 2024

సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ‘ఆ ఒక్కటీ అడక్కు’

image

అల్లరి నరేశ్ హీరోగా నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఇవాళ్టి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మల్లి అంకం తెరకెక్కించిన ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించారు. వైవా హర్ష, అరియానా కీలక పాత్రలు పోషించారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. చిలక ప్రొడక్షన్స్ మూవీని నిర్మించింది.

News May 31, 2024

ఏసీకి పూజ చేసిన వ్యక్తి.. నెట్టింట విమర్శలు

image

ఎండవేడిమికి అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనాన్నిస్తోన్న ఏసీ (ఎయిర్ కండీషనర్)లను ఆరాధించడం ఎంతో అవసరమని ఓ వ్యక్తి పూజ చేసిన ఫొటో వైరలవుతోంది. ఏసీలకు హారతిచ్చిన ఘటనను కొందరు నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు. ఏసీలు అత్యధికంగా హీట్‌ను జెనరేట్ చేస్తాయని విమర్శిస్తున్నారు. చెట్లు మరింత చల్లదనాన్నిస్తాయని, ఉష్ణోగ్రతలు మరింత పెరగకముందే ప్రతి ఇంట్లో మొక్కలను పెంచుకోవడం మేలంటున్నారు.

News May 31, 2024

T20WC: 11 ఏళ్ల కరవు తీరుస్తారా?

image

టీమ్ ఇండియా ICC ట్రోఫీలు గెలవక 11 ఏళ్లు అవుతోంది. చివరిగా 2013లో ICC ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. ఆ తర్వాత 2023 వన్డే WC ఫైనల్లో ఓటమి పాలైంది. ప్రస్తుత భారత్ ఫామ్ చూస్తే T20 WCలో సెమీస్ చేరడం లాంఛనమే. సెమీస్‌లో గట్టి ప్రత్యర్థులపై భారత్ పోరాడాల్సి ఉంటుంది. రోహిత్, కోహ్లీ, సూర్య, పంత్ వంటి స్టార్లు ఉండటంతో అది సాధ్యమే. బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్ వంటి పేసర్లతో ఫైనల్ చేరడం పెద్ద కష్టమేమీ కాదు.

News May 31, 2024

మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా నాన్న: మహేశ్

image

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన్ను గుర్తుచేసుకుంటూ తనయుడు మహేశ్ బాబు సోషల్ మీడియాలో ఫొటోను పంచుకున్నారు. ‘హ్యాపీ బర్త్ డే నాన్నా. నిన్ను చాలా మిస్ అవుతున్నా. నా ప్రతి జ్ఞాపకంలో మీరెప్పటికీ జీవించి ఉంటారు’ అని పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో కృష్ణను చూస్తుంటే మహేశ్‌లానే ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2022 నవంబర్ 15న కృష్ణ తుదిశ్వాస విడిచారు.