News April 21, 2025

రాజస్థాన్ రాయల్స్‌పై అంబటి రాయుడు తీవ్ర విమర్శలు

image

రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లోనూ విఫలం కావడంపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ప్రతి సీజన్లోనూ యువ ఆటగాళ్లపై RR పెట్టుబడి పెడుతోంది. IPL అంటే ఛారిటీయా? దాని వల్ల ఏం సాధించింది? పైగా అదేదో తమ బలంలా ఆ జట్టు యాజమాన్యం గొప్పగా చెప్పుకుంటోంది. టోర్నీ ఆడేది కప్పు గెలవడానికే గానీ కొత్త ఆటగాళ్లను తీసుకురావడానికి కాదు. అందుకే RR ట్రోఫీ గెలిచి 17 ఏళ్లయింది’ అని గుర్తుచేశారు.

News April 21, 2025

ప్రొడ్యూసర్ నన్ను అసభ్యంగా పిలిచాడు: విద్యాబాలన్

image

బాలీవుడ్ నటి విద్యాబాలన్ గతంలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘ఓ నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు. నా దగ్గరకు వచ్చి అసభ్యంగా పిలిచాడు. ఆ అవమానం తర్వాత 6 నెలలు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు. ఈ మాటలు నాపై నాకున్న నమ్మకాన్ని నాశనం చేశాయి. సినిమా కోసం బరువు పెరిగితే బాడీ షేమింగ్ చేసేవారు. నా కెరీర్‌లో ఇలాంటివి చాలానే ఉన్నాయి’ అని తెలిపారు.

News April 21, 2025

చెట్లకు చికిత్స అందిస్తున్నారు!

image

ఏంటి ఆశ్చర్యపోతున్నారా? మనుషులకు, జంతువులకు డాక్టర్లు ఉండటం చూశాం. కానీ, చెట్ల ఆరోగ్యం కోసం పంజాబ్‌కు చెందిన IRS అధికారి రోహిత్ మిశ్రా పాటుపడుతున్నారు. ఆయన ప్రపంచంలోనే మొదటి ట్రీ క్లినిక్‌ను స్థాపించగా దీనికి ప్రత్యేకమైన అంబులెన్స్ కూడా ఉంది. ఇందులోని రకరకాల ఆయుర్వేదిక్, ఆర్గానిక్ మందులు మొక్కలకు వచ్చే సమస్యలకు చెక్ పెడతాయని తెలిపారు. అడవిలోని వేలాది మొక్కలకు ఆయన పునర్జన్మనిచ్చారు.

News April 21, 2025

మళ్లీ కలవనున్న ఠాక్రే సోదరులు

image

హిందీ వ్యతిరేక ఉద్యమంతో మహారాష్ట్ర కజిన్స్ కలుస్తున్నారు. అన్నదమ్ముల పిల్లలైన ఉద్ధవ్ ఠాక్రే (శివసేన-UBT), రాజ్ ఠాక్రే (మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన) 20 ఏళ్లుగా సొంత పార్టీలు నడుపుతున్నారు. స్కూళ్లలో హిందీని తప్పక బోధించాలన్న MH ప్రభుత్వ నిర్ణయాన్ని ఇద్దరూ ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాలకై ఉద్ధవ్‌తోనూ కలిసి ఉద్యమిస్తానని MNS చీఫ్ ఇటీవల ప్రకటించగా మాజీ సీఎం కూడా ఓకే అన్నట్లు తాజాగా సిగ్నలిచ్చారు.

News April 21, 2025

రాజమౌళి రెమ్యునరేషన్ రూ.200 కోట్లు?

image

ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫిల్మ్ డైరెక్టర్ రాజమౌళి అని IMDb పేర్కొంది. పారితోషికం, ప్రాఫిట్ షేర్ (కలెక్షన్స్ బట్టి), మూవీ హక్కుల విక్రయం ద్వారా ఈ మేరకు పొందుతారని తెలిపింది. ఇది స్టార్ హీరోల రెమ్యునరేషన్ కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఇతర దర్శకుల్లో సందీప్ వంగా, ప్రశాంత్ నీల్ ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు, రాజ్ కుమార్ హిరానీ రూ.80 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్.

News April 21, 2025

కాసేపట్లో పిడుగులతో కూడిన వర్షం

image

TG: రాబోయే రెండు గంటల్లో హైదరాబాద్, ఆసిఫాబాద్, మెదక్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.

News April 21, 2025

భారతీయుల పట్ల పోప్‌కు ఉన్న ఆప్యాయతను మరచిపోం: పీఎం మోదీ

image

పోప్ ఫ్రాన్సిస్ మృ‌తి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. భారతీయుల పట్ల పోప్‌కు ఉన్న ఆప్యాయతను ఎన్నటికీ మరచిపోమని అన్నారు. ‘పోప్ ఫ్రాన్సిస్ మృతి చాలా బాధను కలిగించింది. ఈ కష్ట సమయంలో ప్రపంచ కాథలిక్ వర్గానికి నా ప్రగాఢ సంతాపం. జాలి, దయ, వినయం వంటి సుగుణాలకు ఓ ప్రతీకగా కోట్లాదిమంది హృదయాల్లో ఫ్రాన్సిస్ ఎప్పటికీ నిలిచి ఉంటారు’ అని పేర్కొన్నారు.

News April 21, 2025

ఇండియాలో 83% పన్నీర్ కల్తీనే.. ఇలా చెక్ చేయండి!

image

శాకాహార ప్రియులకు ఎంతో ఇష్టమైన ‘పన్నీర్’ ఇప్పుడు భారతదేశంలో అత్యంత కల్తీ ఆహార ఉత్పత్తిగా మారింది. ప్రస్తుతం 83% పన్నీర్ కల్తీ అని, అందులో 40శాతం వాటిని ఏ జంతువు తినకూడదని తాజా నివేదికలో వెల్లడైంది. ఈ క్రమంలో కల్తీ పన్నీర్‌ను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ఉడకబెట్టిన పన్నీర్‌పై రెండు చుక్కల అయోడిన్ డ్రాప్స్ వేయాలి. నీలి రంగులోకి మారితే అది ఫేక్. ఒరిజినల్‌ది తెలుపు లేదా లైట్ ఆరెంజ్‌లోకి మారుతుంది.

News April 21, 2025

మెడికల్ డ్రగ్స్ తీసుకొని ఇంటర్ విద్యార్థి మృతి

image

TG: హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ తీసుకొని ఇంటర్ విద్యార్థి మరణించాడు. సాహిల్ అనే వ్యక్తి నుంచి ముగ్గురు విద్యార్థులు మెడికల్ డ్రగ్స్ కొనుగోలు చేశారు. ఇంజక్షన్‌తో పాటు టాబ్లెట్లను ఒకే సమయంలో తీసుకోగా ఓ విద్యార్థి అక్కడికక్కడే చనిపోయాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రగ్స్ అమ్మిన సాహిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News April 21, 2025

ఆ పోస్టుకు సమంత లైక్.. విడాకుల కారణంపై చర్చ

image

‘భార్య అనారోగ్యానికి గురైతే భర్త ఆమెను వదిలేయడానికే మొగ్గుచూపుతాడు. కానీ భార్య మాత్రం భర్త ఆరోగ్యం బాగోలేకపోయినా అతడిని విడిచిపెట్టాలనుకోదు’ అనే ఓ ఇన్‌స్టా పోస్టుకు హీరోయిన్ సమంత లైక్ కొట్టారు. ఇది నెట్టింట చర్చకు దారితీసింది. సామ్ గతంలో మయోసైటిస్‌తో బాధపడిన విషయం తెలిసిందే. దీంతో ఆ వ్యాధే ఆమె విడాకులకు కారణమా? అని చర్చించుకుంటున్నారు. 2021లో చైతూ, సామ్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.