News May 31, 2024

నేడు 145 మండలాల్లో వడగాలులు

image

AP: రాష్ట్రంలోని 145 మండలాల్లో నేడు వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్లూరి జిల్లా కూనవరం మండలంలో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. నిన్న ప్రకాశం జిల్లా పామూరులో 44.8°C, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.7°C ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. వడగాలులు వీచే మండలాల వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News May 31, 2024

హష్ మనీ కేసు.. ట్రంప్‌ను దోషిగా తేల్చిన కోర్టు

image

న్యూయార్క్ హష్ మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలారు. అడల్ట్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు అక్రమంగా డబ్బు చెల్లించి, ఆ చెల్లింపుల వివరాలను రికార్డుల్లో చూపించలేదని ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమేనని కోర్టు తేల్చింది. మొత్తం 34 నేరారోపణలపై ఆయనను దోషిగా ప్రకటించింది. జూలై 11న శిక్షను ఖరారు చేయనుంది. దీంతో నేరానికి పాల్పడిన తొలి యూఎస్ మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు.

News May 31, 2024

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్

image

ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్‌లో ‘ఫేవరెట్ చాట్స్ అండ్ గ్రూప్స్’ ఫీచర్ రానుంది. ఫీచర్‌లో భాగంగా యాప్‌లో ‘ఫేవరెట్స్’ అనే సెక్షన్‌ను తీసుకురానున్నారు. యూజర్లు తమకు ముఖ్యమైన చాట్‌లు, గ్రూపులను ఇందులో యాడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా వాటిని యాప్‌లో ఈజీగా కనుగొని, చాట్ చేసేందుకు వీలుంటుంది. ప్రస్తుతం కొద్దిమంది బీటా టెస్టర్లకు ఇది అందుబాటులో ఉంది. త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.

News May 31, 2024

సౌతాఫ్రికాతో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

image

సౌతాఫ్రికాతో జూన్ 13 నుంచి జరిగే ODI, టెస్ట్, T20 సిరీస్‌లకు భారత మహిళల <>జట్టును<<>> BCCI ప్రకటించింది.
ODI: హర్మన్‌(C), స్మృతి(VC), షఫాలీ, దీప్తి, జెమీమా*, రిచా, ఉమా చెత్రి, హేమలత, రాధా యాదవ్, శోభన, శ్రేయాంక, ఇషాక్, వస్త్రాకర్*, రేణుక, అరుంధతి, ప్రియ
T20: హర్మన్‌, స్మృతి, షఫాలీ, హేమలత, ఉమా, రిచా, జెమిమా*, సజన, దీప్తి, శ్రేయాంక, రాధ, అమంజోత్, శోభన, వస్త్రాకర్*, రేణుక, అరుంధతి.
స్టాండ్‌బై: సైకా ఇషాక్.

News May 31, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: మే 31, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 4:20 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:41 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:14 గంటలకు
అసర్: సాయంత్రం 4:49 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:47 గంటలకు
ఇష: రాత్రి 8.08 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News May 31, 2024

GREAT: పడి లేచిన కెరటం రిషభ్ పంత్!

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ పడి లేచిన కెరటంలా దూసుకెళ్తున్నారు. రోడ్డు ప్రమాదం బారిన పడి దాదాపు ఏడాదిన్నర తర్వాత క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఐపీఎల్‌లో ఢిల్లీ తరఫున అదరగొట్టారు. అదే సమయంలో టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టులోకి ఎంపికయ్యారు. దాదాపు 8 మంది వికెట్ కీపర్లు పోటీలో ఉన్నా సెలక్టర్లు పంత్ వైపు మొగ్గు చూపారు. దీంతో ఆయన 17 నెలల అనంతరం టీమ్ ఇండియా జెర్సీ ధరించారు.

News May 31, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News May 31, 2024

మే 31: చరిత్రలో ఈరోజు

image

1943: నటుడు ఘట్టమనేని కృష్ణ జననం
1964: స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు దువ్వూరి సుబ్బమ్మ మరణం
1985: సినీ రచయిత సముద్రాల రామానుజాచార్య మరణం
2022: సినీ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్(కేకే) మరణం
* ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

News May 31, 2024

రాష్ట్రంలో బీర్ల కొరత లేదు: ఎక్సైజ్ శాఖ

image

TG: రాష్ట్రంలో KF బ్రాండ్ కొరత తప్ప మిగతా అన్ని రకాల బీర్లు అందుబాటులో ఉన్నాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. బీరు తయారు చేసే కంపెనీలకు మూడో షిఫ్ట్ అనుమతించకపోవడం వల్లే కృత్రిమ కొరత ఏర్పడిందన్న వార్తల్ని ఖండించింది. కంపెనీలు 3 షిఫ్టుల్లో మొత్తం 4.98లక్షల కేసులు తయారు చేయాల్సి ఉందని, కానీ 2.51 లక్షల కేసులు మాత్రమే ఉత్పత్తి చేశాయని పేర్కొంది. బీరు నిల్వలకు కొరత లేకుండా చూస్తున్నామని వివరించింది.

News May 31, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.