India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: హైదరాబాద్‌లో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. మరో 2 గంటల పాటు వర్షం కొనసాగే ఆస్కారం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. అటు నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, జనగామ, యాదాద్రి జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. మీ ఏరియాలో వెదర్ ఎలా ఉంది.
AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC స్థానాల ఉప ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉ.7 గంటల నుంచి సా.5 వరకు పోలింగ్ జరగనుంది. పులివెందులలో 10,601 మంది ఓటర్ల కొరకు 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టలో 24,606 మంది ఓటర్ల కోసం 30 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. రెండు మండలాల్లో 1400 మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు. నిన్న సాయంత్రమే స్థానికేతరులను గుర్తించి పంపేశారు.
TG: 2024 మార్చి 31నాటికి తెలంగాణ ప్రభుత్వ అప్పులు రూ.3,50,520.39 కోట్లని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. MP రఘునందన్‌రావు ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. పదేళ్లలో BRS ప్రభుత్వం రూ.3,14,545 కోట్లు అప్పు చేసినట్లు తేల్చింది. 2014-15లో రాష్ట్ర అప్పులు రూ.69,603.87 కోట్లు, ఆస్తులు రూ.83,142.68 కోట్లుగా ఉన్నాయి. 2023-2024నాటికి అప్పులు రూ.3,50,520.39 కోట్లు, ఆస్తులు రూ.4,15,099.69 కోట్లకు పెరిగాయి.
మనిషి జీవితాన్ని, ప్రశాంతతను.. కోపం, దురాశ రెండూ సర్వ నాశనం చేస్తాయని చాణక్య నీతి చెబుతోంది. రోజూ కోపంగా ఉండేవాళ్లు బతికుండగానే నరకాన్ని అనుభవిస్తుంటారని దీని సారాంశం. అలాగే మీకు దురాశ ఉంటే జీవితం సర్వనాశనం అవుతుందని చాణక్య నీతిలో చెప్పారు. లైఫ్‌లో ఏది సాధించాలన్నా కోపం, దురాశను వదిలి జ్ఞానంవైపు అడుగులు వేయాలని వివరించారు. జ్ఞానంతోనే ఏదైనా సాధించగలరని పేర్కొన్నారు. <<-se>>#Chankyaneeti<<>>
AP: రాజముద్రతో కొత్త పట్టాదారు పుస్తకాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆగస్టు 15-31 వరకు తొలి విడతగా కొత్త పాస్ బుక్స్‌ను కొందరు రైతులకు అందిస్తారని తెలుస్తోంది. గత ప్రభుత్వం పాస్‌బుక్స్‌పై అప్పటి సీఎం జగన్ ఫొటో ముద్రించిన విషయం తెలిసిందే. వాటిని మార్చి రాజముద్రతో కొత్త పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. విడతల వారీగా 20 లక్షల మందికిపైగా ఈ కొత్త పాస్ బుక్స్ అందించనున్నారు.
6,115 రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు ఉచితంగా హైస్పీడ్ వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఓ MP ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కాచిగూడ, సికింద్రాబాద్ వంటి స్టేషన్లలోనూ ఈ సౌకర్యం ఉంది. కనెక్ట్ చేసుకునేందుకు మీ ఫోన్‌లో వైఫై ఆన్ చేయాలి. RailWire Wi-Fiని సెలక్ట్ చేయాలి. మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే.. OTP వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే వైఫై కనెక్ట్ అవుతుంది.
ఇవాళ ఆమోదం <<17375107>>పొందిన<<>> ఇన్‌కమ్ టాక్స్ బిల్లు-2025లో కొన్ని పదాలను మార్చారు. పాత బిల్లులో ‘క్రితం సంవత్సరం, అసెస్‌మెంట్ ఇయర్’ అనే పదాల స్థానంలో ‘టాక్స్ ఇయర్’ అని రీప్లేస్ చేశారు. కొత్త పన్నులు, శ్లాబులు, ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీలు, రేట్లనేమీ మార్చలేదు. స్టాండర్డ్ డిడక్షన్, గ్రాడ్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ తదితర సెక్షన్లు, నిబంధనలను ఒక పట్టిక రూపంలోకి తీసుకొచ్చారు. బిల్లు కోసం ఇక్కడ <
AP: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్4 సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. నిన్న మొదటి మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్‌పై అమరావతి రాయల్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. రెండో మ్యాచ్‌లో సింహాద్రి వైజాగ్ లైన్స్‌పై కాకినాడ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇవాళ మధ్యాహ్నం 1.30 గం.కు భీమవరం బుల్స్, అమరావతి రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. సా.6.30గం.కు విజయవాడ సన్ షైనర్స్, సింహాద్రి వైజాగ్ లైన్స్ తలపడనున్నాయి.
ఇండియా సరిహద్దు సమీపంలో చైనా రైల్వేలైన్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో కొంత భాగం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(LAC) సమీపంలో ఉంటుందని చెప్తున్నారు. టిబెట్‌ను షిన్‌జాంగ్ ప్రావిన్సుతో కలపనున్నారు. రూ.1.15 లక్షల కోట్ల క్యాపిటల్‌తో ‘ది షిన్‌జాంగ్-టిబెట్ రైల్వే కంపెనీ’ని రిజిస్టర్ చేశారని చైనా మీడియాలో వార్తలొచ్చాయి. LAC సమీపంలో కాబట్టి రక్షణపరంగా భారత్ ఆందోళన చెందాల్సిన అవసరముంది.
తాము ఓకే చేసిన స్క్రిప్టు మూవీ పూర్తయ్యేలోగా మారిపోతూ ఉంటుందని హీరోయిన్ అనుపమ పేర్కొన్నారు. ‘పరదా’ మూవీ ప్రమోషన్స్‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కథ మాత్రమే కాదు పాత్రల విషయంలోనూ ఇలాంటి మార్పులు ఉంటూనే ఉంటాయి. అవన్నీ తెలియక ప్రేక్షకులు ఇలాంటి చెత్త సినిమాలు ఎందుకు చేస్తారు? అని ప్రశ్నిస్తూ ఉంటారు’ అని వ్యాఖ్యానించారు. ‘జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ’ చిత్రం గురించే ఇలా స్పందించినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.