India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇండియన్ షేర్ మార్కెట్ లాభాల బాటలో దూసుకుపోతుంది. ఉదయం 518 పాయింట్లు లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ 939 పాయింట్లు పెరిగి 79,492 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 329 పాయింట్లు లాభపడి 24,158 వద్ద కొనసాగుతోంది. టాటా, ఐడియా, HDFC, ఏంజిల్ వన్ కంపెనీలు టాప్ గైనర్‌లుగా ఉన్నాయి.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి రేపు సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఈమేరకు ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు. రాజ్‌ను విచారించేందుకు సిట్ ఇప్పటికే నాలుగుసార్లు నోటీసులు ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. ఈక్రమంలోనే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణను న్యాయస్థానం వచ్చేవారానికి వాయిదా వేసింది.
సాధారణంగా ఓ గ్రామంలో ఒకరో, ఇద్దరో JEE మెయిన్స్‌లో ఉత్తీర్ణులవుతుంటారు. కానీ, బిహార్‌లోని పట్వటోలి అనే గ్రామంలో ఏకంగా 40 మంది మెయిన్స్ ఫలితాల్లో సత్తాచాటారు. ఇందులో గ్రామంలో ఉచితంగా కోచింగ్ ఇస్తోన్న ‘వృక్ష సంస్థాన్’ నుంచి 28 మంది ఉన్నారు. ఈ గ్రామంలో ఇంటికో ఇంజినీర్ ఉండటం విశేషం. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని, ప్రతిచోట ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసుకుంటే విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
TG: ఈఏపీసెట్ ఫలితాలను విద్యార్థుల ఫోన్ నంబర్లకే పంపాలని జేఎన్టీయూ అధికారులు నిర్ణయించారు. అప్లికేషన్ సమయంలో రిజిస్టర్ చేసుకున్న నంబర్‌కు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈనెల 29, 30 తేదీల్లో అగ్రికల్చర్&ఫార్మసీ, మే 2, 4 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. ఈసారి 3.05 లక్షల మంది విద్యార్థులు EAPCET రాయనున్నారు. పరీక్షల అనంతరం 10 రోజుల్లో ఫలితాలు వచ్చే అవకాశముంది.
TG: పెండింగ్‌లో ఉన్న ధాన్యం బోనస్ డబ్బులు త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌లో నిర్వహించిన రైతు మహోత్సవ సభలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కేంద్రం ప్రకటించిన పసుపు బోర్డు ఏమైందో స్థానిక బీజేపీ ఎంపీ అర్వింద్ చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి శాఖపై రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినా అదనంగా ఒక్క ఎకరానికి నీరు ఇవ్వలేదని విమర్శించారు.
TG: స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తే భారీగా డబ్బులు సంపాదించవచ్చని ఇన్‌ఫ్లుయెన్సర్లు చెప్పే మాటలను నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ‘ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌లలో కనిపించే వీడియోలు, స్క్రీన్ షాట్లు నమ్మి పెట్టుబడులు పెట్టకండి. ఫ్రీగా ట్రేడింగ్ క్లాసెస్ ఎందుకు చెప్తున్నారో ఆలోచించండి. ఎవరైనా లింక్ పంపించి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరితే తిరస్కరించండి’ అని పోలీసులు ట్వీట్‌లో పేర్కొన్నారు.
కేంద్రం NEET, NEP పేరుతో తమిళ విద్యావ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని తమిళనాడు Dy.CM ఉదయనిధి స్టాలిన్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావమే తమిళ భాషతో జరిగిందని చెన్నైలోని ఓ కళాశాలలో జరిగిన సభలో ప్రసంగించారు. 1965లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమంలో ఎంతోమంది నిస్వార్థంగా పోరాడి తమిళ భాషను రక్షించారని, ఇప్పుడు ఆ బాధ్యత తీసుకొని హిందీకి వ్యతిరేకంగా నిరసన చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
పోప్ ఫ్రాన్సిస్(88) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వాటికన్ సిటీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించిన ఆయన 2013 మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా నుంచి పోప్‌గా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు. ఫిబ్రవరిలో శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రిలో చేరి, ఆ తర్వాత కోలుకున్నారు. పోప్ మృతితో యావత్ క్రైస్తవ సమాజం శోకసంద్రంలో మునిగిపోయింది.
మార్కెట్లో నకిలీ రూ.500 నోట్లు చలామణి అవుతున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హెచ్చరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని రిజర్వ్(RESERVE) అనే చోట E అక్షరం బదులు A ముద్రించారని వెల్లడించింది. చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప ఈ రూ.500 నోటుపై ఈ తప్పును గమనించలేరని పేర్కొంది. ఈ విషయంపై బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలను అప్రమత్తం చేశామని వివరించింది.
SHAREiT
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తల్లి మాయె మస్క్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. తాజాగా ఆమె ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో కలిసి వెళ్లిన ఆమె అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. కాగా తాను రాసిన ‘ఎ ఉమెన్ మేక్స్ ఎ ప్లాన్’ పుస్తకాన్ని రాజ్‌కమల్ బుక్స్ హిందీలోకి అనువదించింది. ఆ పుస్తకం విడుదల కోసం ఆమె భారత్ వచ్చినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.