News September 29, 2024

చంద్రబాబు, లోకేశ్ ఇతరుల సంతోషాన్ని ఓర్వలేరు: VSR

image

AP: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి Xలో సెటైర్లు వేశారు. ‘నారద ముని ఒక రోజు శ్రీకృష్ణుడిని అడిగాడు. ప్రభూ! చంద్రబాబు, ఆయన సుపుత్రుడు లోకేశ్ ఎల్లప్పుడు దుఃఖంలో ఎందుకుంటున్నారు అని? శ్రీకృష్ణుడు అద్భుత రీతిలో జవాబు ఇస్తూ, ప్రతి మనిషికి ఆనందాలు ఉంటాయి. కానీ, చంద్రబాబు, లోకేశ్ లాంటి వారు ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేక దుఃఖిస్తుంటారు’ అని VSR చంద్రబాబును ట్యాగ్ చేశారు.

News September 29, 2024

అది న్యాయానికి కొల‌మానం.. న‌స్ర‌ల్లా మృతిపై బైడెన్‌

image

హెజ్బొల్లా చీఫ్ న‌స్ర‌ల్లాను ఇజ్రాయెల్ హ‌త‌మార్చ‌డాన్ని అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ సమర్థించారు. ‘నాలుగు దశాబ్దాల తీవ్రవాద పాలనలో వందలాది మంది అమెరికన్ల మరణానికి నస్రల్లా, హెజ్బొల్లానే కారణం. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో అతని మరణం ఇజ్రాయెలీలు, లెబనీస్ పౌరులతో సహా వేలాది మంది అత‌ని బాధితులకు న్యాయం చేసే కొలమానం’ అని పేర్కొన్నారు.

News September 29, 2024

APPLY NOW.. 819 కానిస్టేబుల్ ఉద్యోగాలు

image

ITBPలో 819 కానిస్టేబుల్(కిచెన్ సర్వీసెస్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ గడువు అక్టోబర్ 1వ తేదీతో ముగియనుంది. టెన్త్‌తో పాటు ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్‌కు సంబంధించిన కోర్సు చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. 18 నుంచి 25 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేయవచ్చు. పేస్కేలు నెలకు రూ.21,700-రూ.69,100. దరఖాస్తు ఫీజు రూ.100. మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్, SC, STలకు ఫీజు లేదు.
వెబ్‌సైట్: <>itbpolice.nic.in<<>>

News September 29, 2024

IPL: బీసీసీఐ మరో కీలక నిర్ణయం?

image

IPL 2025 మెగా వేలానికి ముందు BCCI మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత ప్లేయర్ల కంటే విదేశీ ప్లేయర్ల ధర ఎక్కువగా ఉండకూడదనే రూల్ పెట్టినట్లు సమాచారం. ఈ మేరకు 2025 మెగా వేలంలో ఓ ఇండియన్ ప్లేయర్ రూ.18 కోట్ల ధర పలికితే 2026 వేలంలో ఓ విదేశీ ఆటగాడికి అంతకుమించి ధర పలకకూడదని తెలుస్తోంది. మరోవైపు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను 2027 వరకు కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

News September 29, 2024

దేవర కలెక్షన్ల సునామీ

image

జూ.ఎన్టీఆర్ దేవర మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలిరోజు రూ.172 కోట్లు వసూలు చేసిన ఈ సినిమాకు 2 రోజుల్లో రూ.243 కోట్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘దేవర కెరటం బాక్సాఫీసును ముంచెత్తింది. అన్ని ప్రాంతాలకు హెచ్చరికలు పంపింది’ అంటూ ఓ పోస్టర్‌ను పంచుకుంది. ఇవాళ సెలవు కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది.

News September 29, 2024

ఐమ్యాక్స్, జలవిహార్‌ను కూల్చాలి: దానం నాగేందర్

image

TG: హైడ్రాపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మురికవాడల జోలికి వెళ్లొద్దని హైడ్రాకు ముందే సూచించా. పేదల ఇళ్లు కూలగొట్టడం సమంజసం కాదు. కూలగొట్టడానికి ఐమ్యాక్స్, జలవిహార్ లాంటివి చాలా ఉన్నవి. మూసీ బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇళ్లు కూలగొట్టాల్సింది. ఇళ్లకు మార్కింగ్ చేయడం తొందరపాటు చర్య. ఈ అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తా’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News September 29, 2024

PLEASE CHECK.. ఈ లిస్టులో మీ పేరు ఉందా?

image

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ముసాయిదా జాబితాపై అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితాను వెబ్‌సైటులో వెల్లడించింది. దీని ఆధారంగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. పంచాయతీ ఆఫీసులు, మండల పరిషత్ కార్యాలయాల వద్ద వీటిని అందుబాటులో ఉంచారు. ఇక్కడ <>క్లిక్ <<>>చేసి జిల్లా, మండలం, గ్రామం పేరును ఎంచుకుని జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు.

News September 29, 2024

కన్సల్టేటివ్ ఫోరం ఛైర్మన్‌గా నారా లోకేశ్

image

AP: సీఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల కాలపరిమితితో పనిచేసే దీనికి ఛైర్మన్‌గా మంత్రి నారా లోకేశ్ వ్యవహరించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా ఇది పనిచేయనుంది. ప్రభుత్వ శాఖలను RTGS శాఖ సమన్వయం చేస్తుంది.

News September 29, 2024

విధుల బ‌హిష్క‌ర‌ణ‌పై నిర్ణ‌యిస్తాం: జూడాలు

image

సుప్రీంకోర్టులో సోమ‌వారం RG క‌ర్ ట్రైనీ డాక్ట‌ర్‌ హ‌త్యాచార కేసు విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో వైద్యుల భ‌ద్ర‌త‌పై రాష్ట్ర ప్ర‌భుత్వ నివేద‌న‌ను ప‌రిశీలించి పూర్తి స్థాయి విధుల బ‌హిష్క‌ర‌ణ‌పై నిర్ణ‌యిస్తామ‌ని జూనియ‌ర్ డాక్ట‌ర్లు పేర్కొన్నారు. కోల్‌కతాలోని సాగూర్ దత్తా అస్పత్రిలో రోగి మృతి చెందిన ఘటనలో వైద్య సిబ్బందిపై బంధువులు దాడి చేయడంతో మ‌రోసారి విధుల బ‌హిష్క‌ర‌ణ‌పై వైద్య సంఘాలు చ‌ర్చించాయి.

News September 29, 2024

IND Vs BAN: ఈరోజూ వర్షార్పణమేనా?

image

భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన రెండో టెస్ట్ ఇవాళ కూడా ఇంకా ప్రారంభం కాలేదు. వర్షం తగ్గినా ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మ్యాచ్ నిర్వహణ కష్టంగా మారింది. మధ్యాహ్నం 12 గంటలకు అంపైర్లు మరోసారి మైదానాన్ని పరిశీలించి, నిర్ణయం తీసుకోనున్నారు. ఈనెల 27న రెండో టెస్ట్ ప్రారంభం కాగా ఆరోజు కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వర్షం వల్ల నిన్నంతా తుడిచిపెట్టుకుపోయింది.