India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నేడు హరిహరులను కలిపి పూజిస్తే విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. ‘గురువారం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం. అలాగే ఈరోజు త్రయోదశి తిథి. ప్రదోష వ్రతం కూడా నిర్వహిస్తారు. శివారాధనకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఒకే రోజున అటు హరి, ఇటు హర.. ఇద్దరినీ పూజించే అరుదైన అవకాశం కలిగింది. భక్తులు ఈ శుభదినాన విష్ణు సహస్రనామ పారాయణతో పాటు శివాభిషేకం చేయడం అభీష్ట సిద్ధి పొందుతారు’ అని అంటున్నారు.

AP: నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ సోదరులపై సప్లిమెంటరీ-2 ఛార్జ్‌షీటును సిట్ దాఖలు చేసింది. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు ₹కోటికిపైగా ముడుపులు రమేశ్‌కు ఇచ్చారని సిట్ పేర్కొన్నట్లు తెలిసింది. 2021-23 మధ్య పలు విడతల్లో ఇచ్చారని సమాచారం. అద్దేపల్లి సోదరులు, రమేశ్ మధ్య 7వేల ఫోన్ కాల్స్ నమోదైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో 17 మంది నిందితులకు విజయవాడ కోర్టు ఈ నెల 12 వరకు రిమాండ్ పొడిగించింది.

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం యథాతథంగానే ఉంచింది. జనవరి-మార్చి త్రైమాసికానికి ఎలాంటి మార్పులు చేయలేదు. వరుసగా 8వ క్వార్టర్‌లోనూ వడ్డీ రేట్లను సవరించకపోవడం గమనార్హం. సుకన్య సమృద్ధి యోజన-8.2%, మూడేళ్ల టర్మ్ డిపాజిట్, PPF-7.1%, పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్-4%, కిసాన్ వికాస్ పాత్ర-7.5, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్-7.7, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్-7.4% వడ్డీ రేట్లు ప్రస్తుతమున్నాయి.

వాము (ఓమ) పంటను సాగు చేసేటప్పుడు మొక్కలు దగ్గర దగ్గరగా (ఒత్తుగా) ఉండాలి. అప్పుడే ఆ పంట దిగుబడి బాగుంటుంది. పాతర్లు (అంటే వరి నారు లేదా ఇతర కొన్ని రకాల పంటలు) నాటేటప్పుడు మొక్కల మధ్య తగినంత దూరం (పలచనగా) ఉండాలి. అప్పుడే ఆ మొక్కలకు గాలి, వెలుతురు సరిగా తగిలి ఆరోగ్యంగా పెరుగుతుంది. ఏ పంటకు ఎంత దూరం ఉండాలో తెలిపే వ్యవసాయ సూత్రాన్ని ఈ సామెత చెబుతుంది.

లక్ష్మీదేవి నివాసంగా భావించే వికసించే చెట్టు ఆకును, అలాగే శుభప్రదమైన బియ్యం గింజలను పర్సులో ఉంచుకోవడం వల్ల ధన వృద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. లక్ష్మీ స్వరూపమైన గవ్వలు, తామర గింజలను ఎర్రటి గుడ్డలో కట్టి పర్సు/బీరువాలో భద్రపరుచుకోవడం వల్ల డబ్బు నిలకడగా ఉంటుందని నమ్మకం. గోసేవ చేస్తే దైవానుగ్రహం లభించి ఏడాది పొడవునా మీ ఇంట్లో దారిద్ర్యం తొలగి సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని ప్రగాఢ విశ్వాసం.

TG: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలును డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పేపర్ దరఖాస్తులకు బదులుగా అప్లికేషన్లను ఆన్‌లైన్‌లోనే స్వీకరించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. పథకాల కోసం పేపర్లు పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగే అవస్థలు లేకుండా పారదర్శకమైన ఆన్‌లైన్ విధానం తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. దీంతో మధ్యవర్తుల ప్రమేయం ఉండదని, నేరుగా లబ్ధిదారులకు స్కీమ్స్ అందుతాయని అనుకుంటున్నట్లు సమాచారం.

JAN 1, JAN 30 – ప్రదోష వ్రతం,
JAN 3 – పుష్య పూర్ణిమ,
JAN 6 – సంకటహర చతుర్థి,
JAN 14 – భోగి, షట్టిల ఏకాదశి,
JAN 15 – మకర సంక్రాంతి,
JAN 16 – కనుమ, ప్రదోష వ్రతం, మాస శివరాత్రి,
JAN 17- ముక్కనుమ, JAN 18 – పుష్య అమావాస్య,
JAN 23 – వసంత పంచమి, JAN 25 – రథసప్తమి,
JAN 26 – భీష్మ అష్టమి, JAN 29 – జయ ఏకాదశి.

AP: విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ పనులు మార్చి నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. గూగుల్‌కు జనవరి 10వ తేదీ కల్లా తర్లువాడలో 308 ఎకరాలను అప్పగిస్తామని చెప్పారు. జనవరి మూడో వారంలో టీసీఎస్ క్యాంపస్ ప్రారంభం అవుతుందని వివరించారు. అడవివరంలో సింహాచలం దేవస్థానం భూముల కేటాయింపు ఫైలు ప్రభుత్వం వద్ద ఉందని వెల్లడించారు.

ద్వారపాలకుల అనుమతితో లోపలికి వెళ్లిన గోపికలు మొదట నందగోపుడిని, ఆపై యశోదమ్మను ‘మేలుకో’ అని వేడుకున్నారు. లోకాలను కొలిచిన త్రివిక్రమ స్వరూపుడైన కృష్ణుడిని నిద్రలేవమని ప్రార్థించారు. ఆపై బలరాముడిని నిద్రలేపడం మరచినందుకు చింతిస్తూ ‘బంగారు కడియాలు ధరించిన బలరామా! నీవు, నీ తమ్ముడు కృష్ణుడు వెంటనే మేల్కొనండి’ అని వేడుకున్నారు. ఇలా వరుసగా అందరినీ ప్రార్థిస్తూ, వారి కృప కోసం వేచి చూస్తున్నారు. <<-se>>#DHANURMASAM<<>>

ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధంలో గెలిచేది తామేనని దేశం భావిస్తోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఉక్రెయిన్‌తో పోరాడుతున్న హీరోలను(సైనికులు) సపోర్ట్ ప్రజలను చేయాలని కోరారు. ‘మేం మీపై, మన విజయంపై నమ్మకం ఉంచుతున్నాం’ అని సోల్జర్లను ఉద్దేశించి న్యూఇయర్ ప్రసంగంలో అన్నారు. తన నివాసంపై ఉక్రెయిన్ <<18728652>>డ్రోన్ దాడి<<>> గురించి ఆయన ప్రస్తావించలేదు. పుతిన్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 31తో 26 ఏళ్లు పూర్తయ్యాయి.
Sorry, no posts matched your criteria.