News October 31, 2025

వర్డ్ ఆఫ్ ది ఇయర్ తెలుసా?

image

ఈ ఏడాదికి ‘67‌’ను వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రముఖ ఆన్‌లైన్ డిక్షనరీ వెబ్‌సైట్ డిక్షనరీ.కామ్ ప్రకటించింది. నంబర్‌ను పదంగా పేర్కొనడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి అర్థం లేదని, నిర్వచించలేమని వెబ్‌సైట్ స్పష్టం చేసింది. అమెరికన్ ర్యాపర్ స్క్రిల్లా డ్రిల్ <>సాంగ్<<>> ‘Doot Doot (6 7)’ నుంచి ఇది పుట్టిందని, టీనేజర్స్, జెన్ఆల్ఫా(2010-25 మధ్యలో పుట్టినవారు) దీనిని ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. మీరూ ఉపయోగించారా?

News October 30, 2025

ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8.30 గంటలలోపు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30-40కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News October 30, 2025

అమల్లోకి రాని 8.82 లక్షల కోర్టు తీర్పులు

image

కోర్టులు వరమిచ్చినా అధికారులు కరుణించలేదన్నట్లు మారింది దేశంలో తీర్పుల అమలు. న్యాయం కోసం దాఖలైన కేసులు 5CRకు పైగా ఉండగా తీర్పులు వచ్చినా అమలు కోసం ఎదురుచూస్తున్న వారు 8.82 లక్షల మంది ఉన్నారు. జిల్లా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న ఈ కేసుల్లో 39% MHలో ఉన్నాయి. TN 86148, KL 82997, AP 68137,MP 52219 కేసులున్నాయి. ఈ తీర్పులను ఆరునెలల్లో అమలయ్యేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని SC అన్ని HCలను ఆదేశించింది.

News October 30, 2025

నకిలీ మద్యం కేసు: ముగిసిన నిందితుల కస్టడీ

image

AP: నకిలీ మద్యం కేసులో జనార్దన్, జగన్మోహనరావు కస్టడీ ముగియగా VJA కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరి స్టేట్‌మెంట్లను అధికారులు న్యాయస్థానానికి సమర్పించారు. జోగి రమేశ్ చెబితేనే నకిలీ మద్యం తయారు చేశానని జనార్దన్ రావు చెప్పగా ఆ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఆడియో, వీడియో సైతం కోర్టుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరినీ 7 రోజుల పాటు ఎక్సైజ్, సిట్ అధికారులు ప్రశ్నించారు.

News October 30, 2025

సెంచరీ భాగస్వామ్యం.. ఉత్కంఠగా మ్యాచ్

image

WWCలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో టీమ్‌ఇండియా బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్(81*), హర్మన్ ప్రీత్(66*) అర్ధసెంచరీలు చేశారు. 59 పరుగులకే ఓపెనర్లు ఔటవ్వగా వీరిద్దరు సెంచరీ భాగస్వామ్యంతో జట్టును పటిష్ఠ స్థితిలోకి చేర్చారు. ప్రస్తుతం భారత్ స్కోరు 198/2. విజయానికి ఇంకా 19 ఓవర్లలో 141 పరుగులు చేయాల్సి ఉంది. ఎలాగైనా ఈ మ్యాచులో భారత్ గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News October 30, 2025

ముంబై కిడ్నాప్.. ఆ 35 నిమిషాలు ఏం జరిగింది?

image

ముంబై <<18151381>>కిడ్నాప్‌ <<>>ఘటనలో క్విక్ రియాక్షన్ టీమ్ 35 నిమిషాల ఆపరేషన్ నిర్వహించింది. 8మంది కమాండర్ల టీమ్ బాత్రూమ్ ద్వారా స్టూడియోలోకి వెళ్లింది. తొలుత నిందితుడు రోహిత్‌తో చర్చలు జరిపింది. కానీ లోపలికొస్తే షూట్ చేస్తానని, గదిని తగలబెడతానని అతడు బెదిరించాడు. తర్వాత ఫైరింగ్ స్టార్ట్ చేయడంతో రోహిత్‌పై లీడ్ కమాండో కాల్పులు జరిపి గాయపరిచారు. అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించగా అక్కడ రోహిత్‌ చనిపోయాడు.

News October 30, 2025

ఇదేందయ్యా ఇదీ.. బంగారు నగలు ధరిస్తే రూ.50వేలు ఫైన్

image

మన దేశంలో బంగారు ఆభరణాలు ధరించడమంటే ఇష్టపడని వారుండరు. కానీ ఉత్తరాఖండ్‌లోని జౌన్సర్-బావర్ ప్రాంతంలో ఉన్న కంధర్ గ్రామ నివాసితులు వింత నిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా అసమానతలు తగ్గించేందుకు ఒంటినిండా నగలు ధరిస్తే రూ.50వేలు జరిమానా విధించాలని గ్రామపెద్దలు నిర్ణయించారు. మహిళలు సైతం దీనికి అంగీకారం తెలిపారు. శుభకార్యాల్లో చెవిపోగులు, ముక్కుపుడక, మంగళసూత్రం మాత్రమే ధరించాలనే నిబంధన విధించారు.

News October 30, 2025

IPL: ముంబైని రోహిత్ వీడతారా? క్లారిటీ

image

రాబోయే IPL సీజన్‌లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌(MI)ను వీడతారనే ఊహాగానాలకు బ్రేక్ పడింది. హిట్‌మ్యాన్ MIని వీడతారనే ప్రచారాన్ని తోసిపుచ్చుతూ ఆ ఫ్రాంచైజీ ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘సూర్యుడు తిరిగి ఉదయిస్తాడు’ అనే క్యాప్షన్‌తో రోహిత్ ఫొటోను షేర్ చేసింది. ఈ ట్వీట్‌తో ముంబై జట్టులో రోహిత్ కొనసాగింపుపై క్లారిటీ వచ్చినట్లైంది. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

News October 30, 2025

JIO యూజర్లకు ₹35,100 విలువైన గూగుల్ AI సేవలు ఫ్రీ!

image

JIO & GOOGLE భాగస్వామ్యంతో జియో యూజర్లకు 18 నెలల పాటు ఉచితంగా (₹35,100 విలువైన) గూగుల్ AI Pro సేవలు లభించనున్నాయి. ఈ ప్లాన్‌లో Gemini 2.5 Pro, ఇమేజ్-వీడియో క్రియేషన్ టూల్స్, నోట్‌బుక్ LM & 2TB క్లౌడ్ స్టోరేజ్ లభిస్తాయి. ఈ సేవలను తొలుత 18-25 ఏళ్ల Jio 5G యూజర్లకు అందించి.. ఆ తర్వాత అందరికీ విస్తరించనున్నారు. ‘AI సేవలను ప్రతి భారతీయుడికి అందించడమే లక్ష్యం’ అని ఇరు సంస్థలు తెలిపాయి.

News October 30, 2025

ALERT.. పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని వెల్లడించింది. మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద ఇవాళ 6.30pmకు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5.67 లక్షల క్యూసెక్కులు కొనసాగుతుండగా రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.