India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కస్టమర్లను Blinkit మోసగిస్తోందని ఓ యూజర్ Redditలో పోస్టు పెట్టారు. తాను అరకిలో ద్రాక్షపళ్లను ఆర్డర్ చేస్తే కేవలం 370గ్రా. డెలివరీ చేసిందన్నారు. డౌటొచ్చి మరోసారి ఆర్డర్ చేస్తే మళ్లీ ప్యాకేజ్‌తో సహా 370గ్రా. తూకమే ఉందని పేర్కొన్నారు. ఇదో పెద్ద స్కామ్ అని, ఆర్డర్ చేసినవి కాకుండా నాణ్యత లేని పండ్లు, కూరగాయాలు పంపిస్తోందని ఆరోపించారు. తమకూ ఇలాగే జరిగిందని యూజర్లు రిప్లై ఇచ్చారు. మీకూ ఇలాగే జరిగిందా?

TG: అనని మాటలు అన్నట్లుగా చూపి జగదీశ్ రెడ్డిని అన్యాయంగా సస్పెండ్ చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ నుంచి బయటికి వచ్చి అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఏదైనా తప్పుగా మాట్లాడితే సభలో విచారం వ్యక్తం చేస్తామని చెప్పినప్పటికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. రేపు అన్ని నియోజకవర్గాల్లో INC దిష్టిబొమ్మలు దహనం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. మొత్తం ఐదు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ నామినేషన్ వేశారు. దీంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

వెన్నెముక గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ IPLలో ఆడనున్నట్లు తెలుస్తోంది. మెడికల్ టీమ్ నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు క్రిక్ఇన్ఫో తెలిపింది. ‘బౌలింగ్ చేయకుండా, ఫీల్డింగ్‌లో ఒత్తిడి పడకుండా చూడాలన్న వైద్యుల సూచన మేరకు మార్ష్ కేవలం బ్యాటర్‌గా, ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడే అవకాశం ఉంది’ అని పేర్కొంది. ఆయనను వేలంలో LSG దక్కించుకుంది.

దేశీయ స్టాక్ మార్కెట్ కంపెనీలు NSE, BSE శుక్రవారం పనిచేయవు. హోలీ పండగ సందర్భంగా రేపు మార్కెట్లకు సెలవు ఉంటుంది. అలాగే బ్రోకింగ్ కంపెనీలు బ్యాంకింగ్, ట్రేడింగ్ సెటిల్‌మెంట్లూ చేయవు. శుక్ర, శని, ఆది సెలవు కాబట్టి మార్కెట్లు తిరిగి MAR 17, సోమవారం నుంచి పనిచేస్తాయి. కాగా నేడు నిఫ్టీ 22,397 (-73), సెన్సెక్స్ 73,828 (-200) వద్ద ముగియడం తెలిసిందే.

ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన కుటుంబసభ్యుల కోసం నాణ్యమైన సమయం కేటాయిస్తున్నారు. భార్య రితిక, కూతురు సమైరా, కుమారుడు అహాన్‌తో కలిసి ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. అహాన్‌ను ఎత్తుకుని ఆయన లాలిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా హిట్‌మ్యాన్ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన 2027 వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్నారు.

TG: జగదీశ్ రెడ్డి <<15747375>>సస్పెన్షన్<<>> అంశంపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలను బహిష్కరించాలని ఆ పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. రేపు కేసీఆర్‌తో భేటీ అనంతరం దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు అసెంబ్లీలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆ పార్టీ నేతలు నిరసన చేపట్టారు.

ఎలాన్ మస్క్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ‘స్టార్‌లింక్’ త్వరలోనే ఇండియాలో లాంచ్ కానుంది. ఈక్రమంలో దీనితో టైఅప్ అయ్యేందుకు ఎయిర్‌టెల్, JIO సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే, దీని కనెక్షన్ పొందేందుకు భారీగా ఖర్చు చేయాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రూ.500కే నెల WIFI వస్తుండగా స్టార్‌లింక్ నెలకు రూ.8వేల నుంచి ₹41వేల వరకు ఛార్జ్ చేస్తుందని టాక్. కనెక్షన్ కోసమే ₹30వేల వరకూ చెల్లించాలని సమాచారం.

TG: పొరుగు రాష్ట్రం ఏపీలో అప్పులున్నా పింఛన్లు పెంచి అమలు చేస్తున్నారని BJLP నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కానీ ఇక్కడ పింఛన్ల ఊసు ఎత్తితే అప్పులు ఉన్నాయంటూ తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. ‘పింఛన్లపై సీఎంకు లేఖ రాసినా చర్యలు తీసుకోలేదు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం దారుణం. వందరోజుల్లోనే హామీలు అమలు చేస్తామన్నారు. కానీ ఆ దిశగా ప్రభుత్వం ముందుకు సాగడం లేదు’ అని విమర్శించారు.

తెలంగాణ అసెంబ్లీలో హైడ్రామా కొనసాగుతోంది. తనపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వెళ్లి బీఆర్ఎస్‌ఎల్పీలోని కేసీఆర్ ఛాంబర్‌లో కూర్చున్నారు. అయితే ఆయన వద్దకు వెళ్లిన మార్షల్స్ అసెంబ్లీ నుంచి బయటికి వెళ్లాలని సూచించారు. దీంతో జగదీశ్, కేటీఆర్, హరీశ్, తలసాని వారితో వాగ్వాదానికి దిగారు. ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో కూర్చుంటే అభ్యంతరమేంటని ప్రశ్నించారు.
Sorry, no posts matched your criteria.