India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు చీఫ్ సైంటిస్టు కేథరిన్ కాల్విన్ సహా మరికొందరిపై NASA వేటువేసింది. వాతావరణ మార్పుల పరిశోధన విభాగంలో ఆమె కీలకంగా పనిచేస్తున్నారు. పారిస్ క్లైమేట్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడంతో ఈ కోతలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు 23 మందిని తొలగించగా మున్ముందు మరింత మందిపై వేటు పడుతుందని NASA పేర్కొంది. MAR 10న కొందరు ఉద్యోగులకు దీనిపై నోటిఫికేషన్ రావడం గమనార్హం.

AP: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్ట్ వ్యవహారంలో విచారణకు రావాలని ఆయనకు సీఐడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్రమంగా పోర్ట్ వాటాలు బదిలీ చేయించుకున్నారని VSRపై కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

TG: రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బడ్జెట్ సమావేశాల ప్రసంగంలో అన్నారు. ‘రూ.25వేల కోట్ల రుణమాఫీ చేశాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. వరి రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. సంక్షేమం, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం’ అని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో పథకాలేవీ పూర్తిగా అమలు కావడంలేదని BRS MLAలు నినాదాలు చేశారు.

AP: కూతురిపై లైంగిక దాడికి పాల్పడుతున్న తండ్రిపై రాజమండ్రి 3టౌన్ PSలో పోక్సో కేసు నమోదైంది. 8వ తరగతి చదువుతున్న బాలిక(15) మంగళవారం డల్‌గా ఉండటంతో టీచర్ ఓదార్చుతూ ఏమైందని అడిగారు. దీంతో తండ్రి రాక్షసకాండను ఆమె బయటపెట్టారు. కాగా, విభేదాలతో బాధితురాలి తండ్రి వద్ద నుంచి తల్లి తన ముగ్గురు కుమార్తెలతో 8ఏళ్ల కిందట పుట్టింటికి వెళ్లింది. 3ఏళ్లుగా పెద్ద కుమార్తె తండ్రి వద్ద ఉంటుండగా ఈ అఘాయిత్యం జరిగింది.

TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఇవాళ్టి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగం సందర్భంగా కేసీఆర్ సభకు వచ్చారు. దీంతో అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రావడం ఇది రెండోసారి.

AP: YSR ఆశయాల సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన YCPని భుజాలపై మోస్తున్న కార్యకర్తలు, అభిమానులకు YS జగన్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘నా ఒక్కడితో మొదలైన YCP శక్తిమంతమైన పార్టీగా 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సుదీర్ఘ కాలంలో పార్టీ నిరంతరం ప్రజలతోనే ఉంది. ప్రజల జీవన ప్రమాణాలు పెంచి, దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్-1గా నిలపడమే లక్ష్యం’ అని ట్వీట్ చేశారు.

భారత్‌కు అనుకూలమయ్యేలా ICC నిర్ణయాలు ఉంటున్నాయని WI లెజెండరీ క్రికెటర్ ఆండీ రాబర్ట్స్ అన్నారు. CTలో IND మ్యాచులన్నీ ఒకే వేదికపై నిర్వహించడాన్ని తప్పుబట్టారు. ‘గత T20 WCలోనూ INDకి ఫేవర్‌గా నడుచుకున్నారు. సెమీస్ వెన్యూ వారికి ముందే తెలిసింది. నా దృష్టిలో ICC అంటే ఇండియన్ క్రికెట్ బోర్డు. క్రికెట్‌లో నో బాల్స్, వైడ్లు ఉండకూడదని ఇండియా కోరితే ICC ఆ రూల్‌ను కూడా తీసుకొస్తుంది’ అంటూ విమర్శించారు.

భారత టెలికం పరిశ్రమలో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దేశంలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని రిలయన్స్ జియో ప్రకటించింది. స్టార్‌లింక్ ఒప్పందంపై <<15725079>>ఎయిర్‌టెల్<<>> ప్రకటన విడుదల చేసిన మరునాడే జియో ఇలా చేయడం గమనార్హం. తమ రిటైల్ స్టోర్లలో స్టార్‌లింక్ పరికరాలు విక్రయిస్తామని, యాక్టివేషన్, ఇన్‌స్టలేషన్ సేవలు అందిస్తామని తెలిపింది.

అలనాటి అందాల తార సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత ఆమెను హత్య చేశారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘శంషాబాద్‌లోని జల్‌పల్లిలో ఆరెకరాల భూమిని విక్రయించేందుకు సౌందర్య, ఆమె సోదరుడు నిరాకరించడం పెద్ద వివాదమైంది. ఇదే హత్యకు దారి తీసింది. సౌందర్య హెలికాప్టర్ ప్రమాదం తర్వాత మోహన్‌బాబు ఈ భూమిని స్వాధీనం చేసుకున్నారు’ అని ఆయన తెలిపారు.

AP: నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్లపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడంతో ఆ పార్టీ సభ్యులు మండలిలో నిరసనకు దిగారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. బాబు ష్యూరిటీ మోసానికి గ్యారంటీ అంటూ విమర్శలు చేశారు. పోడియం వద్దకు వెళ్లి వైసీపీ సభ్యులు ఆందోళన చేయడంతో మండలిని స్పీకర్ వాయిదా వేశారు.
Sorry, no posts matched your criteria.