News September 29, 2024

బ్యాడ్‌న్యూస్.. పెరిగిన చికెన్ ధర

image

నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధర మళ్లీ పెరుగుతోంది. ఈనెల మొదట్లో కేజీ చికెన్ స్కిన్‌లెస్ రేట్ రూ.160-180 మధ్య పలికింది. 2 వారాల కిందట అది రూ.200 దాటగా గత వారం రూ.236కు చేరింది. ప్రస్తుతం కేజీ చికెన్ స్కిన్‌లెస్ రేట్ రూ.243గా ఉంది. దసరా పండుగ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి చికెన్ రేట్ మీ ప్రాంతంలో ఎంత ఉంది?

News September 29, 2024

ఇజ్రాయెల్ లెక్క సరి చేసింది: నెతన్యాహు

image

హెజ్బొల్లా చీఫ్ న‌స్ర‌ల్లా మ‌ర‌ణంతో ఇజ్రాయెల్ ‘లెక్క సరి’ చేసింద‌ని ఆ దేశ ప్రధాని నెత‌న్యాహు పేర్కొన్నారు. న‌స్ర‌ల్లా మ‌ర‌ణం అనంతరం ఆయ‌న మొద‌టిసారి ప్ర‌క‌టన ఇచ్చారు. ఎంద‌రో ఇజ్రాయెలీలు, అమెరిక‌న్లు, ఫ్రెంచ్ పౌరుల హ‌త్య‌ల‌కు కార‌ణ‌మైన సామూహిక హంత‌కుడిని అంతం చేసి ఇజ్రాయెల్ లెక్క సరి చేసిందన్నారు. తమ లక్ష్య సాధనకు న‌స్ర‌ల్లా మరణం అవసరమని పేర్కొన్న నెతన్యాహు ఇదొక చారిత్రక మ‌లుపుగా అభివ‌ర్ణించారు.

News September 29, 2024

‘సత్యం సుందరం’ వచ్చేది ఈ ఓటీటీలోనే

image

అరవింద్ స్వామి, కార్తీ నటించిన ‘సత్యం సుందరం’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ’96’ మూవీ ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కొన్ని వారాల తర్వాత అందులో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందించగా, సూర్య-జ్యోతిక నిర్మించారు.

News September 29, 2024

IPL: అలాంటి ప్లేయర్లపై రెండేళ్ల నిషేధం

image

ఐపీఎల్ వేలం కోసం రిజస్టర్ చేసుకుని, సెలక్ట్ అయిన ప్లేయర్లు కచ్చితంగా టోర్నీలో ఆడాలని <<14222929>>ఐపీఎల్<<>> గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది. సీజన్ ప్రారంభానికి ముందు అందుబాటులో లేకుండా టోర్నీ నుంచి తప్పుకుంటే ఆ ఆటగాళ్లపై రెండు సీజన్ల పాటు నిషేధం విధించనున్నట్లు పేర్కొంది. అలాగే ఓవర్సీస్ ప్లేయర్లు బిగ్ ఆక్షన్ కోసం తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని, లేదంటే వచ్చే ఏడాది వేలానికి వారు అర్హులు కారని తెలిపింది.

News September 29, 2024

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై కేసు

image

TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో కేసు నమోదయింది. కూకట్‌పల్లిలో బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకోగా, అధికారులు ఇళ్లు కూల్చేస్తారన్న భయంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు NHRCకి ఫిర్యాదు చేశారు. దీంతో 16063/IN/224 కింద రంగనాథ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు NHRC తెలిపింది. కాగా బుచ్చమ్మ మరణానికి, హైడ్రాకు సంబంధం లేదని రంగనాథ్ ఇప్పటికే ప్రకటించారు.

News September 29, 2024

నేడు 35 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

image

TG: రాష్ట్రంలోని ఆరు డిపోల నుంచి (KNR 2, WGL, NZB, NLG, సూర్యాపేట, HYD2) RTC ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను నడపనుంది. తొలుత ఇవాళ కరీంనగర్-2 డిపో నుంచి 35 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. వీటిని మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, RTC MD సజ్జనార్ ప్రారంభిస్తారు. కరీంనగర్ నుంచి JBS, మంథని, GDK, JGL, సిరిసిల్ల, కామారెడ్డికి నాన్ స్టాప్ పద్దతిలో ఇవి నడవనున్నాయి.

News September 29, 2024

నటి కుష్బూ ట్వీట్.. థాంక్స్ చెప్పిన ఎన్టీఆర్

image

తాను లండన్‌లో ‘దేవర’ సినిమా చూసినట్లు సీనియర్ నటి కుష్బూ ట్వీట్ చేశారు. ‘ఇతనే నా హీరో. సూపర్బ్ మాస్. దీనిని నేను ఎలా మిస్ అవుతాను? దేవరగా అతను ప్రపంచాన్ని ఆశ్చర్యపరచడం చూస్తున్నాను’ అని పేర్కొన్నారు. దీనికి Jr.NTR ‘థాంక్యూ మేడమ్. మీకు నచ్చినందుకు సంతోషం’ అని రిప్లై ఇచ్చారు. తారక్ తన ఫేవరెట్ యాక్టర్ అని కుష్బూ గతంలో చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు.

News September 29, 2024

తిరుమలలో చిరుత కలకలం

image

AP: తిరుమలలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్టు దగ్గర చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. సెక్యూరిటీ గార్డులు టీటీడీ అటవీ అధికారులకు సమాచారం అందించారు. కాగా గతంలోనూ తిరుమలలో సంచరించిన చిరుత ఓ చిన్నారిని చంపిన విషయం తెలిసిందే.

News September 29, 2024

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలో ఇవాళ HYD, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. అటు APలోని మన్యం, అల్లూరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని APSDMA వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, ఉ.గో, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, YSR, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయంది.

News September 29, 2024

AP TET: 94.30% హాల్ టికెట్లు డౌన్ లోడ్

image

AP: అక్టోబర్ 3 నుంచి 21 వరకు జరిగే TET-2024(జులై)కు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 94.30% మంది హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. హాల్ టికెట్లలో తప్పులుంటే పరీక్షా కేంద్రాల వద్ద ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపించి నామినల్ రోల్స్‌లో సరిచేసుకోవాలని సూచించింది. వివరాలకు 9398810958, 6281704160, 8121947387 నంబర్లలో సంప్రదించాలని తెలిపింది.