News March 9, 2025

విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్

image

TG: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ పేర్లను ప్రకటించింది. ఒక మహిళ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ అభ్యర్థికి అవకాశం కల్పించింది. నాలుగు స్థానాల్లో ఒకటి సీపీఐకి ఇచ్చిన సంగతి తెలిసిందే.

News March 9, 2025

ప్రయాగ్‌రాజ్‌లో నీరు చక్కగా ఉంది: కాలుష్య నియంత్రణ బోర్డు

image

కోటానుకోట్ల మంది ప్రయాగ్‌రాజ్ త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలాచరించారు. అక్కడి నీటి నాణ్యతపై కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తాజాగా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌కు నివేదిక సమర్పించింది. గంగ, యమునా నదుల నుంచి కుంభమేళా సమయంలో కలెక్ట్ చేసిన నమూనాలపై పరిశోధనలు జరిపామని, స్నానం చేసేందుకు అనువైనవిగానే ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. కుంభమేళా టైమ్‌లో సంగమం వద్ద నీటి నాణ్యతపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

News March 9, 2025

రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు: హరీశ్ రావు

image

TG: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో CM రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. బడి పిల్లల యూనిఫాం కుట్టేందుకు మహిళా సంఘాలకు రూ.75 చొప్పున ఇచ్చినట్లు పచ్చి అబద్ధం చెప్పారన్నారు. ప్రభుత్వం రూ.50 చొప్పున మాత్రమే ఇచ్చిందన్నారు. అలాగే, BRS రూ.50 ఇస్తే, రూ.25 ఇచ్చారని అసత్యాలు చెప్పారని మండిపడ్డారు. CM మాటలు వినలేక మహిళలు వెళ్లిపోతుంటే పోలీసులు ఆపారని ఎద్దేవా చేశారు.

News March 9, 2025

జడేజా రిటైర్మెంట్?

image

స్టార్ ఆల్‌రౌండర్ జడేజా CT ఫైనల్ తర్వాత రిటైర్ అవుతారని క్రికెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తాజా మ్యాచ్‌లో జడ్డూ స్పెల్ తర్వాత ఆయన్ను విరాట్ కౌగిలించుకొని ఎమోషనల్‌గా కనిపించారు. దీంతో ఇప్పటికే T20ల నుంచి తప్పుకున్న జడేజా వన్డే‌ల నుంచీ రిటైర్ అవుతారని తెలుస్తోంది. ఇటీవల అశ్విన్, స్మిత్‌ను హగ్ చేసుకున్న తర్వాత వారు రిటైర్ అయ్యారు. అలాగే జడేజా సైతం అస్త్ర సన్యాసం చేస్తారని ఫ్యాన్స్ పోల్చుతున్నారు.

News March 9, 2025

రేపు ఈ మండలాల్లో వడగాలులు

image

AP: రేపు పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు(D) చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, మారేడుమిల్లి, నెల్లిపాక, వైరామవరం
పార్వతీపురం మన్యం(D) గరుగుబిల్లి, గుమ్మ లక్ష్మిపురం, జియమ్మవలస, పార్వతీపురం, సీతంపేట, సీతానగరం, ఏలూరు (D) కుకునూర్, వేలేర్పాడు మండలాల్లో వడగాలులు ప్రభావం చూపుతాయని పేర్కొంది.

News March 9, 2025

ఏప్రిల్ 5 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

image

AP: ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట రామాలయం బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 5 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు CM చంద్రబాబు సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఏప్రిల్ 11న స్వామి వారి కళ్యాణం సందర్భంగా సీఎం ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని చెప్పారు. భోజన వసతి, ప్రసాద వితరణ ప్రతి భక్తునికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

News March 9, 2025

రేపు అమలక ఏకాదశి.. ఏం చేయాలంటే?

image

ఫాల్గుణ మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశి ‘అమలక ఏకాదశి’. అమలక అంటే ఉసిరికాయ అని అర్థం. ఈరోజున విష్ణుమూర్తి ఉసిరి చెట్టులో నివాసం ఉంటారని నమ్మకం. అందుకే ఉపవాసం ఉండి ఉసిరి చెట్టును పూజిస్తే పుణ్య ఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అన్నదానం, గోదానం, వస్త్రదానం, ఉసిరి, నల్ల నువ్వులు వంటివి దానం చేస్తే మంచిదని పేర్కొన్నారు. సాయంత్రం చంద్ర దర్శనం తర్వాత ఉపవాసాన్ని విరమించవచ్చు.

News March 9, 2025

4 క్యాచ్‌లు మిస్ చేసిన భారత్

image

CT ఫైనల్‌లో భారత ఫీల్డింగ్ పేలవంగా ఉంది. కివీస్ బ్యాటర్లు ఇచ్చిన 4 క్యాచ్‌లను వదిలేశారు. షమీ, అయ్యర్, రోహిత్, గిల్ క్యాచ్‌లను వదిలేయడంతో కివీస్ నెమ్మదిగా స్కోర్ పెంచుకుంటూ వెళ్తోంది. జట్టులో అద్భుతమైన క్యాచ్‌లు అందుకొనే ఫీల్డర్లు కూడా పేలవ ప్రదర్శన చేయడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. NZ స్కోర్ 37.5 ఓవర్లకు 165/5గా ఉంది.

News March 9, 2025

రోహిత్ రిటైర్మెంట్ వార్తలు.. గంగూలీ ఏమన్నారంటే?

image

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారని వస్తున్న వార్తలపై భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ స్పందించారు. ‘ఈ చర్చ అవసరం ఏముంది? కొద్ది నెలల క్రితమే అతడు దేశానికి వరల్డ్ కప్ అందించారు. బాగా ఆడుతున్నాడు. సెలక్టర్లు ఏమి ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు. 2027 వన్డే WCలోనూ రోహిత్ ఆడితే బాగుంటుంది. గత మ్యాచ్ ప్రదర్శనే రిపీట్ చేస్తే ఇవాళ కప్ మనదే’ అని వెల్లడించారు.

News March 9, 2025

శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక గిఫ్ట్

image

నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక బహుమతిని ఇచ్చారు. విశ్వంభర సెట్స్‌లో ఆయన్ను చూసేందుకు శ్రీలీల వెళ్లారు. ఈ సందర్భంగా కాసేపు మాట్లాడుకున్న అనంతరం ఆమెకు చిరు ఓ శంఖాన్ని బహుమతిగా ఇచ్చారు. బంగారు, వెండి పూతలో దుర్గాదేవి విగ్రహం ఆ శంఖంపై చెక్కి ఉంది. శ్రీలీల తన ఇన్‌స్టాలో ఈ విషయాన్ని షేర్ చేశారు.