News September 29, 2024

AP TET: 94.30% హాల్ టికెట్లు డౌన్ లోడ్

image

AP: అక్టోబర్ 3 నుంచి 21 వరకు జరిగే TET-2024(జులై)కు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 94.30% మంది హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. హాల్ టికెట్లలో తప్పులుంటే పరీక్షా కేంద్రాల వద్ద ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపించి నామినల్ రోల్స్‌లో సరిచేసుకోవాలని సూచించింది. వివరాలకు 9398810958, 6281704160, 8121947387 నంబర్లలో సంప్రదించాలని తెలిపింది.

News September 29, 2024

దసరా నుంచి ఇంటింటికి కార్గో సేవలు!

image

TG: దసరా నుంచి ఇంటింటికి కార్గో సేవలు అందించాలని RTC నిర్ణయించింది. వినియోగదారులు ఆన్‌లైన్‌లో బుక్ చేయగానే సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి వస్తువులను తీసుకెళ్లి ఇచ్చిన అడ్రస్‌లో డెలివరీ చేస్తారు. ఆర్డర్ పరిమాణాన్ని బట్టి 2/3/4 వీలర్ ఉపయోగిస్తారు. తొలుత దీనిని HYDలో, ఆ తర్వాత ఇతర జిల్లాల్లో అమలు చేయనున్నారు. ప్రస్తుతం కార్గో సేవలు ఒక బస్ స్టేషన్ నుంచి మరో బస్ స్టేషన్ వరకు మాత్రమే కొనసాగుతున్నాయి.

News September 29, 2024

రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటున్నారా?

image

రోజంతా ఎనర్జీగా ఉండాలంటే ఫైబర్ రిచ్ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పెసరదోశ ఆరోగ్యకరమైన, పోషక అల్పాహారం. అలాగే కూరగాయలు, మొలకెత్తిన పప్పులు, కాయధాన్యాలతో కూడిన అల్పాహారం తీసుకుంటే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. గోధుమ పిండి దోశలో కూడా ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. పోహా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గుడ్లు, యోగర్ట్, మిల్క్ షేక్స్ మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచేలా చూస్తాయి.

News September 29, 2024

‘భాగమతి-2’ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా?

image

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో జి.అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భాగమతి’ సినిమా 2018లో రిలీజై హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. త్వరలో దీనికి సీక్వెల్ రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని డైరెక్టర్ అశోక్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందులో అనుష్క మరింత పవర్ ఫుల్‌గా కనిపిస్తారని పేర్కొన్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న ఈ మూవీ షూటింగ్ 2025 ప్రారంభంలో మొదలు కానున్నట్లు సమాచారం.

News September 29, 2024

IPL: ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ కొనసాగింపు

image

ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ 2027 వరకు కొనసాగుతుందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. 2027 సీజన్ అయ్యాక ఆ తర్వాత కొనసాగించాలా? లేదా? అనేది నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. ఈ రూల్‌ను తొలిసారి 2023 సీజన్‌లో అమలు చేశారు. దీని ప్రకారం మ్యాచ్ మధ్యలో ప్లేయింగ్ 11లో ఉన్న ఓ ప్లేయర్‌ను మరో ఆటగాడితో రీప్లేస్ చేసి ఆడించవచ్చు.

News September 29, 2024

పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన ఖరారు

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్టోబర్ 3న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అక్టోబర్ 2న సా.4గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సా.5కి అలిపిరికి, అక్కడి నుంచి కాలినడకన బయల్దేరి రా.9కి తిరుమల చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి 3వ తేదీన ఉదయం స్వామి వారిని దర్శించుకుంటారు. సాయంత్రం తిరుపతిలో జరిగే వారాహి సభలో పాల్గొంటారు.

News September 29, 2024

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే?

image

* వాకింగ్, రన్నింగ్, యోగ వంటి వ్యాయామాలు చేయాలి.
* అతిగా వేయించిన ఆహారాలు (డీప్ ఫ్రైడ్ ఫుడ్స్) తీసుకోవద్దు.
* కొలెస్టరాల్, బ్లడ్ గ్లూకోస్, బ్లడ్ ప్రెషర్ తరచుగా చెక్ చేసుకుంటూ, నియంత్రణలో ఉంచుకోవాలి.
* ధూమపానం, మద్యపానం చేయవద్దు
* అధిక ఒత్తిడి కూడా గుండె జబ్బులకు దారితీస్తుంది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం మంచిది.

News September 29, 2024

నేడు ప్రపంచ హృదయ దినోత్సవం

image

గుండె జబ్బులు, అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ఏటా సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవాన్ని WHO, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 1946లో జెనీవాలో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంస్థ ఏర్పాటయింది. 1999లో తొలిసారిగా వరల్డ్ హార్ట్ డే నిర్వహించారు. అలా 2000 నుంచి 2010 వరకు సెప్టెంబరులో చివరి ఆదివారం నిర్వహిస్తూ వచ్చారు. 2011 నుంచి SEP 29న జరుపుతున్నారు.

News September 29, 2024

సంపద సృష్టి లేదు.. అంతా దోపిడీనే: VSR

image

AP: కూటమి ప్రభుత్వంలో సంపద సృష్టి లేదని, అంతా దోపిడీయేనని MP విజయసాయిరెడ్డి అన్నారు. ‘మళ్లీ ₹3000కోట్ల అప్పు. ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది? ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం దాదాపు ₹50,000crపైగా అప్పు తెచ్చింది. చంద్రబాబు CM అయ్యే నాటికి ఖజానాలో ₹7000cr ఉన్నాయి. కేంద్రం నుంచి వచ్చిన డబ్బు కూడా ఉంది. కానీ జగన్ అమలు చేసిన 38 సంక్షేమ పథకాల్లో ఒక్కటి కూడా CBN కొనసాగించట్లేదు’ అని ట్వీట్ చేశారు.

News September 29, 2024

ఇది మరో రాజకీయ హత్య: ర‌ష్యా

image

హెజ్బొల్లా చీఫ్ హ‌స‌న్ న‌స్ర‌ల్లా హత్యను ర‌ష్యా ఖండించింది. ఈ చ‌ర్య లెబ‌నాన్ స‌హా Middle Eastలో ప‌రిస్థితుల్ని మ‌రింత ఉద్రిక్తంగా మారుస్తుంద‌ని హెచ్చ‌రించింది. లెబ‌నాన్‌పై దాడుల‌ను ఆపాల‌ని కోరింది. దీన్ని మ‌రో రాజ‌కీయ హ‌త్య‌గా రష్యా అభివ‌ర్ణించింది. నస్రల్లా హత్య నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారు. లెబనాన్‌కు సాయంగా ఇరాన్ బలగాలు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.