India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తాజాగా యుద్ధ విమాన పైలట్ శివాంగీ సింగ్‌తో దిగిన ఫొటో వైరల్ అవుతోంది. దీంతో అసలెవరీమె అంటూ చర్చ మొదలైంది. శివాంగీ వారణాసిలో పుట్టి పెరిగారు. చదువుకొనేటప్పుడే NCCలో చేరారు. 2016లో ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. 2017లో రెండో దశ యుద్ధ విమాన పైలట్లలో ఒకరిగా ఎంపికై మిగ్-21 బైసన్ యుద్ధ విమానాలు నడిపారు. అలా 2020లో రఫేల్ మొదటి మహిళా పైలెట్‌గా చరిత్ర సృష్టించారు.

దేశవ్యాప్తంగా ఇకపై పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు ఆయుర్వేదాన్ని బోధించనున్నారు. NEPలో భాగంగా సైన్సు సబ్జెక్టులో ఈ అంశాల్ని చేర్చాలని అధికారులు నిర్ణయించారు. 6-8వ తరగతి వరకు ఈ పాఠాలుంటాయి. ఆరోగ్యం, పోషకాహారం, పర్యావరణంపై భారతీయ దృక్కోణంతో అవగాహన కలిగించడమే లక్ష్యమని NCERT డైరక్టర్ దినేశ్ ప్రసాద్ తెలిపారు. స్కూల్ స్థాయి నుంచి ఆరంభమైన దీన్ని రానున్న కాలంలో డిగ్రీ కోర్సులకూ విస్తరించే అవకాశముంది.

1. బ్రహ్మ ఆవలింత నుంచి పుట్టిన వానరుడు ‘జాంబవంతుడు’.
2. ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు ఇచ్చిన గురుదక్షిణ ఏంటి?
3. కృష్ణుడి భార్య అయిన రుక్మిణికి తండ్రి పేరు ‘భీష్మకుడు’.
4. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి శివుని నుదుటి నుంచి జన్మించిన వీరుడు ‘వీరభద్రుడు’?
5. గరుత్మంతుడి తల్లి ‘వినత’.
<<-se>>#Ithihasaluquiz<<>>

శివభక్తులు తప్పక దర్శించాల్సిన జ్యోతిర్లింగ క్షేత్రం గుజరాత్‌లోని సోమనాథ ఆలయం. శివుడు సోమనాథుడిగా వెలసిన ఈ క్షేత్రాన్ని రావణుడు, కృష్ణుడు, భీముడు నిర్మించారని నమ్మకం. ఈ గుడి 16 సార్లు ధ్వంసమైనా భక్తుల అకుంఠిత దీక్షతో ప్రతిసారీ జీర్ణోద్ధారణ పొందింది. దండయాత్రల్లో పాషండులు ఇక్కడి సంపదను దోచికెళ్లినా భగవంతుడి అస్థిత్వాన్ని, భక్తుల విశ్వాసాన్ని చెరపలేకపోయారు.
☞ మరిన్ని ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి.<<>>

ముంబైలో ఆడిషన్స్ పేరుతో పిలిచి 20 మంది పిల్లలను బంధించిన నిందితుడు <<18151200>>రోహిత్<<>> ఆర్య హతమయ్యాడు. పిల్లలను రక్షించే క్రమంలో ముంబై పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. తీవ్రగాయాలపాలైన రోహిత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. చిన్నారులు సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

కర్నూలు బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు వి.కావేరి ట్రావెల్స్ యాజమాన్యం పరిహారం అందజేసింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున మొత్తం రూ.40 లక్షలను మంత్రి భరత్ సమక్షంలో అందజేసింది. మొత్తం ఈ బస్సు ప్రమాదంలో 19 మంది మరణించారు. అటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

మిగిలిన పశువుల కంటే చూడి పశువుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని బయటకు వదలకుండా కొట్టం దగ్గరే పరిమితమైన వ్యాయామం కల్పించాలి. శుభ్రమైన మేత, తాగునీరు అందించాలి. కొట్టంలో జారుడునేల లేకుండా చూడాలి. ఇతర పశువులతో పోట్లాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్కలు వీటి వెంటపడి పరిగెత్తించకుండా చూడాలి. కాలువలలో దించడం, వాలుగా ఉన్న ఎత్తయిన గట్లు ఎక్కించడం, ఎక్కువ దూరం నడిపించడం చేయకూడదు.

కొంతకాలంగా రోజులో రెండుసార్లు బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ <<18146766>>ఉదయం<<>> 24 క్యారెట్ల 10గ్రా.ల బంగారం ధర రూ.1,910 తగ్గగా ఇప్పుడు రూ.990 పెరిగి రూ.1,21,480కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా.ల గోల్డ్ రేట్ ఉదయంతో పోల్చితే రూ.900 ఎగబాకి రూ.1,11,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

TG: కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12.15గంటలకు రాజ్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే మంత్రులకు ఆహ్వాన లేఖలు అందినట్లు సమాచారం.

బిహార్‌లో ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ విడుదల చేసిన మ్యానిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోదీ సెటైర్లు వేశారు. ‘జంగిల్ రాజ్ నాయకులు ప్రజలను నిరంతరం మోసం చేస్తున్నారు. మ్యానిఫెస్టో పేరుతో ఆర్జేడీ, కాంగ్రెస్ తమ రేటు జాబితాను రివీల్ చేశాయి. వారి ప్రతి డిక్లరేషన్ వెనుక ప్రధాన ఉద్దేశం అవినీతి, దోపిడీ’ అని ఆరోపించారు. బిహార్‌ను RJD, కాంగ్రెస్ డెవలప్ చేయలేవని, గతంలో తమ పాలనలో ప్రజలను మోసం చేశాయని అన్నారు.
Sorry, no posts matched your criteria.