News October 30, 2025

ప్రెగ్నెన్సీలో అయోడిన్ లోపంతో ఎన్నో సమస్యలు

image

థైరాయిడ్ పనితీరుకు, శారీరక, మానసిక అభివృద్ధికి అయోడిన్ ఎంతో ముఖ్యం. గర్భిణుల్లో అయోడిన్ లోపం ఉంటే పుట్టే పిల్లల్లో మానసిక, శారీరక అభివృద్ధి ఉండదు. అలాగే గర్భస్రావం, వికలాంగ శిశువు, మరుగుజ్జు, చెవి, కంటి సమస్యలు, నత్తి వంటివి వస్తాయంటున్నారు నిపుణులు. పాలు, పెరుగు, బ్రౌన్ రైస్, చేపలు, ఉప్పు, కాడ్ లివర్ ఆయిల్, మాంసం, గుడ్లు, ఆకుకూరలు, మిల్లెట్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

News October 30, 2025

శరీరానికి ఎంత అయోడిన్ అవసరమంటే

image

శరీరానికి చాలా తక్కువ పరిమాణంలో అయోడిన్ ఉంటే సరిపోతుంది. రోజుకు కేవలం 150mg తీసుకుంటే చాలు. పిల్లలకు 50mg, గర్భిణులకు 200mg అయోడిన్ సరిపోతుంది. ఒక వ్యక్తి జీవితకాలంలో కేవలం అర టీస్పూన్ అయోడిన్ మాత్రమే అవసరమవుతుంది. మన శరీరంలో 25mg అయోడిన్ ఉంటుంది. కాబట్టి అయోడిన్ అధికంగా ఉండే ఆహారాన్ని శరీరానికి అవసరమైనంత మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. అలాగని అతిగా తీసుకున్నా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

News October 30, 2025

KKR హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్

image

IPL: KKR హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్ నియమితులయ్యారు. జట్టుకు గత 3 సీజన్లుగా హెడ్ కోచ్‌గా ఉన్న చంద్రకాంత్ పండిట్‌ను ఈ ఏడాది JULYలో తొలగించిన విషయం తెలిసిందే. వారం క్రితమే కోచ్‌ పదవిపై నాయర్‌తో KKR సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. పండిట్‌ శిక్షణలో జట్టు 2024లో విజేతగా నిలిచినప్పుడు నాయర్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్నారు. అటు ఈ ఏడాది మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో UP వారియర్స్‌ జట్టుకు చీఫ్‌ కోచ్‌గా పనిచేశారు.

News October 30, 2025

భక్తిని పెంచే సాధనాలు ‘రుద్రాక్ష, విభూతి’

image

మానవుడు భగవంతునిపై భక్తిని పెంచుకోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. రుద్రాక్ష ధారణ ద్వారా ఓ వ్యక్తి నాలుగో వంతు భక్తిని పొందుతాడు. విభూతి ధారణ వల్ల సగ భాగం భక్తి లభిస్తుంది. ఇక మంత్ర జపం చేస్తే మూడు వంతుల భక్తిని సాధించవచ్చు. ఈ పనులన్నింటితో పాటు దేవుడిని పూజిస్తే ఆ వ్యక్తి పూర్ణ భక్తిని పొందుతాడు. పూర్ణ భక్తి లభించిన తర్వాత, దాని అంతిమ ఫలం జన్మ రాహిత్యమే. అంటే మోక్షం పొందడమే అన్నమాట. <<-se>>#SIVOHAM<<>>

News October 30, 2025

నీలి రంగులోకి మారిపోయిన కుక్కలు.. కారణం అదేనా?

image

ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ అణు విద్యుత్ ప్లాంట్‌ సమీపంలో కొన్ని వీధి కుక్కలు నీలి రంగులో ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. ఇవి 1986 నాటి అణు ప్రమాదం తర్వాత మిగిలిపోయిన పెంపుడు జంతువుల సంతతికి చెందిన శునకాలుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాపర్ సల్ఫేట్ వంటి పారిశ్రామిక రసాయనాల వల్లే ఇలా మారిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీని మూలాన్ని గుర్తించడానికి వాటి వెంట్రుకలు, రక్త నమూనాలను పరీక్షిస్తున్నారు.

News October 30, 2025

తుఫానుతో రూ.5,265 కోట్ల నష్టం: చంద్రబాబు

image

AP: ‘మొంథా’ తుఫాను వల్ల రాష్ట్రానికి రూ.5,265 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. అత్యధికంగా ఆర్‌అండ్‌బీకి రూ.2,079 కోట్లు, ఆక్వా రంగానికి రూ.1,270 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.829 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. అయితే ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదని వెల్లడించారు. ముందస్తు చర్యలతో నీటిపారుదల శాఖకు తక్కువ నష్టమే వాటిల్లిందని తెలిపారు.

News October 30, 2025

టెక్నాలజీ సాయంతో తుఫాన్ నష్టాన్ని తగ్గించాం: CBN

image

TG: మొంథా తుఫాన్ దాగుడుమూతలు ఆడిందని CM చంద్రబాబు అన్నారు. అనుకున్న చోట కాకుండా వేరే చోట వర్షాలు కురిశాయని సమీక్షలో చెప్పారు. టెక్నాలజీ సాయంతో తుఫాన్ నష్టాన్ని తగ్గించామన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివాలయాల వరకు సమాచారం సేకరించినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ శాటిలైట్ ఇమేజ్‌లతో పరిస్థితులను అంచనా వేసినట్లు వెల్లడించారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేశామని పేర్కొన్నారు.

News October 30, 2025

67 రకాల సామగ్రితో స్కూళ్లు, కాలేజీలకు స్పోర్ట్స్ కిట్లు

image

AP: క్రీడల్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు, జూ.కాలేజీలకు విద్యాశాఖ 67రకాల క్రీడా సామగ్రితో కూడిన కిట్లను అందిస్తోంది. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్, బేస్‌బాల్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, రగ్బీ, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ పరికరాలు ఇందులో ఉన్నాయి. క్లస్టర్ కాంప్లెక్స్‌ల నుంచి వీటిని అందుకోవాలని స్కూళ్లకు ఆదేశాలిచ్చింది.

News October 30, 2025

ICMRలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ICMRలో 15 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, MBA, PG డిప్లొమా, CA, ICWA, M.COM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులో తప్పుల సవరణ NOV 5 – 7వరకు చేసుకోవచ్చు. NOV 10న అడ్మిట్ కార్డులు విడుదల చేస్తారు. NOV 15న రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ తేదీని తర్వాత ప్రకటిస్తారు. వెబ్‌సైట్: www.icmr.gov.in/

News October 30, 2025

అపారనష్టం.. కేంద్రం జాతీయ విపత్తుగా పరిగణించాలి: పొన్నం

image

TG: భారీ వర్షాలతో పంటలకు అపారమైన నష్టం వాటిల్లిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్రం దీనిని జాతీయ విపత్తుగా పరిగణించి సాయం అందించాలని కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక రూపొందిస్తుందని, అవసరమైన సాయం అందజేస్తుందని తెలిపారు. మరోవైపు రాజకీయాలకు తావు లేకుండా బీజేపీ నేతలు పరిస్థితిని కేంద్రానికి వివరించాలని సూచించారు.