News March 4, 2025

ఉద్యోగులను రోబోలనుకున్నారా?: అఖిలేశ్

image

యువత, ఉద్యోగులు వారానికి 70-90 గంటల పాటు <<15638083>>పనిచేయాలని <<>>కోరుతున్న పారిశ్రామికవేత్తలపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఉద్యోగులను రోబోలుగా భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. పనిలో నాణ్యత ముఖ్యమని పేర్కొన్నారు. ఎక్కువ గంటలు పనిచేయాలంటున్న వారు యువకులుగా ఉన్నప్పుడు అన్ని గంటలు పనిచేశారా? అని నిలదీశారు. పని గంటల పొడిగింపుతో కలిగే ఆర్థిక ప్రగతి సామాన్యులకు ఏం ఒరగబెడుతుందని ప్రశ్నించారు.

News March 4, 2025

PAYTMకు మరో షాక్

image

పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. రూ.611 కోట్లకు సంబంధించి ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు దర్యాప్తులో తేలడంతో ఈ నోటీసులు జారీ చేసింది. సింగపూర్‌లో పెట్టుబడులు పెట్టి, విదేశాల్లో సబ్సిడరీ ఏర్పాటు విషయాన్ని RBIకి పేటీఎం వెల్లడించలేదని ED నిర్ధారించింది. సంస్థ ఛైర్మన్ విజయ్ శేఖర్‌కూ నోటీసులు పంపింది. దీంతో సంస్థ షేర్లు 4శాతం పడిపోయాయి.

News March 4, 2025

ప్రమాదకరంగా ఫ్యాటీ లివర్.. ఇలా చేయాల్సిందే

image

చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందర్నీ పట్టి పీడిస్తున్న సమస్య కాలేయపు కొవ్వు(ఫ్యాటీ లివర్). ప్యాకేజ్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, మద్యపానం వంటి అలవాట్లు, అధిక బరువు వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంటుంది. జంక్ ఫుడ్, డ్రింక్స్‌ను దూరం పెట్టడం.. పోషకాహారం, వారానికి కనీసం 135 నిమిషాల వ్యాయామం దీనికి పరిష్కారాలని వైద్యులు చెబుతున్నారు. బరువు తగ్గడంతోపాటు గుడ్డు, చేపల్ని ఆహారంలో భాగం చేసుకోవాలంటున్నారు.

News March 4, 2025

రజినీపై విచారణ.. అనుమతి కోసం గవర్నర్‌కు లేఖ

image

AP: మాజీ మంత్రి విడుదల రజినీపై ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది. ఐపీఎస్ జాషువాతో కలిసి స్టోన్‌క్రషర్ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. విచారణకు అనుమతి కోసం గవర్నర్‌కు లేఖ రాసింది. గ్రీన్ సిగ్నల్ రాగానే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం కేసు నమోదు చేయనున్నారు.

News March 4, 2025

ట్రంప్ టారిఫ్ నిబంధనలు.. స్టాక్ మార్కెట్లలో కలకలం

image

మెక్సికో, కెనడాపై తాము విధించిన సుంకాల్లో ఎటువంటి మార్పూ ఉండదని, నేటి నుంచి అమల్లోకి వస్తాయని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు కుదుపులకు లోనయ్యాయి. ప్రధానంగా అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. ఇక భారత్‌లో నిఫ్టీ ఒకశాతం తక్కువగా మొదలయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ మార్కెట్ల ప్రభావం ఎలా ఉండనుందన్న కోణంలో మదుపర్లు ఆచితూచి అడుగేసే అవకాశం ఉంది.

News March 4, 2025

నేడూ పెన్షన్ల పంపిణీ

image

AP: పెన్షన్‌దారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ కారణాలతో ఈ నెల పెన్షన్ తీసుకోని వారికి ఇవాళ కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. అనంతపురం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, ఎన్టీఆర్, కర్నూలు, పల్నాడు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని లబ్ధిదారులకు ఈ అవకాశం ఉంటుందని తెలిపింది.

News March 4, 2025

వేలం తొలి రౌండ్‌లో అన్‌సోల్డ్.. ఇప్పుడు కెప్టెన్

image

IPL టీమ్ కేకేఆర్ తమ జట్టు కెప్టెన్‌గా అజింక్యా రహానేను నియమించింది. కాగా దుబాయ్‌లో జరిగిన మెగా వేలంలో రహానేను తొలుత ఎవరూ కొనుగోలు చేయలేదు. కనీస ధర రూ.కోటికి కూడా అతడిని సొంతం చేసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. రహానే నిదానమైన ఆట IPLకు సరిపోవడం లేదని ఎవరూ అతడిని కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. ఆ తర్వాత జరిగిన యాక్సలరేటెడ్ రౌండ్‌లో ఆయనను KKR రూ.1.50 కోట్లతో దక్కించుకుని కెప్టెన్సీ అప్పగించింది.

News March 4, 2025

ఇండియాలో మాత్రం బికినీ వేసుకోను: సోనాక్షి సిన్హా

image

ఇండియాలో తాను ఎట్టి పరిస్థితుల్లో బికినీ వేసుకోనని హీరోయిన్ సోనాక్షి సిన్హా అన్నారు. ఇక్కడ ఎవరు ఏ వైపు నుంచి ఫొటో తీస్తారో తెలియదని చెప్పారు. అందుకే వేరే దేశం వెళ్లినప్పుడు బికినీ వేసుకుని స్విమ్మింగ్ చేస్తానని పేర్కొన్నారు. దీనిపై కొందరు ఆమెకు సపోర్ట్‌గా నిలవగా ఆ ఫొటోలు నెట్టింట ఎందుకు షేర్ చేస్తున్నావు? అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

News March 4, 2025

భవన నిర్మాణదారులకు శుభవార్త

image

AP: ఐదంతస్తుల లోపు లేదా 18 మీటర్లలోపు భవన నిర్మాణ అనుమతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని ప్రభుత్వం వెల్లడించింది. టౌన్‌ప్లానింగ్ అధికారుల అనుమతి అవసరం లేదని తెలిపింది. రిజిస్టర్డ్ LPTలు, ఇంజినీర్ల సమక్షంలో సరైన పత్రాలు సమర్పించి అఫిడవిట్‌లు ఇవ్వాలంది. ఈ మేరకు APDPMS పోర్టల్‌లో ఆప్షన్ అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు.

News March 4, 2025

ఆధిక్యంలో పేరాబత్తుల రాజశేఖరం

image

AP: తూ.గో-ప.గో జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 28 టేబుళ్లలో జరుగుతున్న కౌంటింగ్‌లో నాల్గవ రౌండ్ పూర్తయ్యే నాటికి 1,02,236 ఓట్లు చెల్లుబాటు అయినట్లు గుర్తించారు. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 64,405 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులు 23,252 ఓట్లు పొందారు. 41,153 ఓట్ల మెజార్టీతో రాజశేఖరం ఉండగా, ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.