India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాకిస్థాన్‌తో సంధికి భారత్ సిద్ధంగానే ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘వారితో మంచి బంధం మాకూ ఇష్టమే కానీ ముందు వారు ఉగ్రవాదాన్ని ఆపాలి. అప్పుడు కచ్చితంగా సంబంధాలు పునరుద్ధరిస్తాం. స్నేహితుల్ని మార్చుకోగలం కానీ ఇరుగుపొరుగువారిని మార్చుకోలేం కదా. పాక్ ఉగ్రవాదం కారణంగా ముస్లింలే ఎక్కువగా చనిపోయారు’ అని పేర్కొన్నారు.
తాను అమెరికాలో ఒబామా, కమలా హారిస్‌తో భేటీ కానున్నానంటూ వచ్చిన వార్తల్ని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఖండించారు. ఆ పర్యటన పూర్తిగా తన వ్యక్తిగతమని స్పష్టతనిచ్చారు. ‘నా కుటుంబంతో కలిసి అమెరికా వెళ్తున్నాను. ఈ నెల 15 వరకు అక్కడే ఉంటాను. అక్కడి రాజకీయ ప్రముఖులతో భేటీ అవుతానన్న ప్రచారంలో మాత్రం నిజం లేదు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత పర్యటన. అంతే’ అని తెలిపారు.
బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. టీవీ నటుడు వికాస్ సేథి(48) గుండెపోటుతో మహారాష్ట్ర నాసిక్‌లో తుదిశ్వాస విడిచారు. హిందీలో ఎన్నో అద్భుతమైన సీరియళ్లలో కీలకపాత్రలు పోషించిన ఆయన పలు సినిమాల్లోనూ నటించారు. కహీ తో, దిల్ న జానే క్యోన్, ఉతరన్, సంస్కార్ లక్ష్మీ, ససురాల్ సిమర్ కా సీరియళ్లు, బాలీవుడ్ మూవీ ‘కభీ ఖుషీ కభీ గమ్’ , తెలుగులో హీరో రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో ధరమ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ బేగంపేట నుంచి బయల్దేరి 9.45 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి నుంచి కాకినాడ కలెక్టరేట్‌కు వెళ్లి ఏలేరు రిజర్వాయర్‌కు వరద ఉద్ధృతి, జిల్లాలో వరద ప్రభావంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
AP: వరద బాధితుల సహాయం కోసం CM రిలీఫ్ ఫండ్‌కు దానం చేసేందుకు దాతలు ముందుకొస్తున్నారు. AP పోలీస్ అధికారుల సంఘం రూ.11.12 కోట్లు, దీపక్ నెక్స్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత సుబ్రహ్మణ్యం రూ.కోటి, వాటర్ సప్లై కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రూ.10లక్షలు సహా మరికొందరు విజయవాడలో సీఎం చంద్రబాబును కలిసి విరాళాలు అందించారు. తోచిన సాయం చేసిన దాతలకు సీఎం కృతజ్ఞతలు తెలియజేశారు.
రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం అబుదాబి యువరాజు షేక్ ఖాలెద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్వాగతం పలికారు. ఖాలెద్ బిన్ రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సహకారంపై చర్చించనున్నారు. అనంతరం ఖాలెద్ బిన్ రాష్ట్రపతి ముర్మును మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఎల్లుండి ముంబైలో జరగనున్న బిజినెస్ ఫోరమ్‌లో ఆయన పాల్గొంటారు.
కర్ణాటక Dy.CM డీకే శివకుమార్ అమెరికా అధ్యక్ష ఎన్నికల డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌తో భేటీ కానున్నట్లు వార్తలొస్తున్నాయి. డెమోక్రటిక్ పార్టీ ఆహ్వానం మేరకు ఆయన తన కుటుంబంతో కలిసి ఇప్పటికే US బయల్దేరారు. ఆ ఈవెంట్‌లో కమలతో పాటు US మాజీ అధ్యక్షుడు ఒబామాతో విడివిడిగా సమావేశం అవుతారని సమాచారం. అయితే ‘నా పర్యటన ప్రత్యేకం ఏమీ కాదు’ అని US బయల్దేరే ముందు డీకే తెలిపారు.
AP: కాకినాడ జిల్లా అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్రమత్తం చేశారు. ఏలేరు రిజర్వాయర్‌కు భారీగా వరద వస్తుండటంతో కాకినాడ జిల్లా కలెక్టర్, అధికారులతో ఆయన సమీక్షించారు. ’24 TMCల కెపాసిటీ ఉన్న జలాశయంలో నీటిమట్టం 21 TMCలకు చేరింది. ఇవాళ రాత్రికి వరద మరింత పెరుగుతుంది. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి’ అని పవన్ ఆదేశించారు.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేపు ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ASF, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, MHBD జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ADB, జగిత్యాల, KRMR, పెద్దపల్లి, సూర్యాపేట, WGL, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
2014 నాటికి 143 మిలియన్ డాలర్లుగా ఉన్న క్రీడల బడ్జెట్‌ను బీజేపీ హయాంలో మూడింతలు పెంచి నేడు 470 మిలియన్ డాలర్లకు తీసుకొచ్చామని కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. అందుకే భారత్ ఆసియా క్రీడల్లో 117 పతకాలు, ఆసియా పారా గేమ్స్‌లో 111 మెడల్స్ గెలిచిందని పేర్కొన్నారు. గడచిన పదేళ్లలో క్రీడలకు సౌకర్యాల్ని, శిక్షణను, అవకాశాల్ని తమ సర్కారు గణనీయంగా మెరుగుపరిచిందని మంత్రి వివరించారు.
Sorry, no posts matched your criteria.