India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విమానం బయల్దేరే ముందు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్ల గురించి ఫ్లైట్ క్రూ వివరిస్తారు. అలాగే AC బస్సుల్లోనూ ఎమర్జెన్సీ డోర్ల గురించి చెబితే కర్నూలు లాంటి ప్రమాదం జరిగినప్పుడు ఉపయోగమని పలువురు అభిప్రాయపడుతున్నారు. బస్సులో కింద సీట్లలోని వారు తప్పించుకోవడానికి కొంత ఛాన్స్ ఉన్నా, పైసీట్లలోని వారు డోర్ ద్వారా బయటకు రావడం కష్టం. అందుకే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

మహిళల్లో మధుమేహం వచ్చేముందు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు మధుమేహం హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీని కారణంగా పీరియడ్స్ గతి తప్పుతాయి. చర్మం ఎర్రగా మారి దురద రావడం, జననేంద్రియాలు పొడిబారడంతో పాటు నాడీ వ్యవస్థ దెబ్బతిని చేతులు, కాళ్ళు జలదరిచడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

భారత సరిహద్దుల్లో చైనా భారీ నిర్మాణాలు చేపడుతోంది. టిబెట్‌లోని పాంగాంగ్ లేక్ వద్ద ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ పనులు సాగుతున్నాయని India Today తెలిపింది. కమాండ్, కంట్రోల్ బిల్డింగ్స్, బారక్స్, వెహికల్స్ షెడ్స్ కడుతున్నట్లు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది. అక్కడ క్షిపణులను మోసుకెళ్లే, ప్రయోగించే TEL వాహనాలు ఉన్నాయని నిపుణులు అనుమానిస్తున్నారు. HQ-9 మిసైల్ వ్యవస్థలను దాచే అవకాశం ఉందంటున్నారు.

బస్సు <<18088805>>ప్రమాదాలకు<<>> ప్రధాన కారణం సేఫ్టీ రూల్స్ పాటించకపోవడం. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు అధికారులను ‘మేనేజ్’ చేసి బస్సులు తిప్పుతాయనేది బహిరంగ రహస్యమే. తీరా ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వాలు, అధికారులు ‘మళ్లీ జరగకుండా కఠిన చర్యలు చేపడతాం’ అని ఓ కామన్ డైలాగ్ చెప్పేస్తారు. మరి ఈ మరణాలకు బాధ్యత ఎవరు వహించాలి? బస్సు యాజమాన్యమా? ప్రభుత్వమా? అధికారులా? అన్నీ తెలిసి బస్సెక్కే ప్రయాణికులా? COMMENT

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌కు ఇకపై టెస్టింగ్ టైమ్. చాట్ GPT ఈమధ్యే అట్లాస్ Ai బ్రౌజర్ లాంఛ్ చేయగా మైక్రోసాఫ్ట్ తన కోపైలట్ సాఫ్ట్‌వేర్‌ను ఎడ్జ్ బ్రౌజర్లో ఇంటిగ్రేట్ చేస్తోంది. కాగా ఇప్పటికే జెమిని Aiని బ్రౌజర్లో గూగుల్ చేర్చి సెర్చ్ రిజల్ట్స్ చూపిస్తోంది. కానీ యూజర్లు ఇక్కడే కంటెంట్ పొంది సైట్లకు వెళ్లక యాడ్ రెవెన్యూపై ప్రభావం పడుతోందట. అటు పోటీ ఇటు ఆర్థిక పోట్లతో గూగుల్‌కు డెంట్ తప్పదు అన్పిస్తోంది.

పాక్‌కు నీళ్లు వెళ్లకుండా నియంత్రించాలని అఫ్గాన్ ప్లాన్ చేస్తోంది. కునార్ నదిపై వీలైనంత త్వరగా డ్యామ్ నిర్మించాలని తాలిబన్ సుప్రీంలీడర్ మౌలావీ హైబతుల్లా అఖుంద్జాదా ఆదేశాలిచ్చారు. విదేశీ కంపెనీల కోసం చూడకుండా దేశీయ కంపెనీలతోనే ఒప్పందం చేసుకోవాలని సూచించారు. 2 దేశాల మధ్య సరిహద్దు ఘర్షణల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత <<16207281>>సింధూ జలాల<<>> ఒప్పందాన్ని భారత్ నిలిపేయడం తెలిసిందే.

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ప్రస్తుతం అమలులో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తి వేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీరాజ్‌తో పాటు పురపాలక చట్టాలను కూడా సవరించనున్నారు. అంటే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోటీ చేసేందుకు వెసులుబాటు కల్పించనున్నారు. ఈ ఆర్డినెన్స్‌ను ఇవాళ ప్రభుత్వం గవర్నర్‌కు పంపనుంది.

వెస్ట్ బ్యాంక్ <<18087139>>స్వాధీనానికి <<>>ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుండటంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. గాజా డీల్‌ను ఆ దేశ PM నెతన్యాహు బలహీనపరిస్తే ట్రంప్ తీవ్ర చర్యలు తీసుకుంటారని ఓ US అధికారి హెచ్చరించారు. ‘ట్రంప్‌తో క్లిష్టమైన దౌత్య పరిస్థితులను నెతన్యాహు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఆయన గాజా డీల్‌ను నిర్వీర్యం చేస్తే ట్రంప్ తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉంది’ అని చెప్పారు.

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో 7 ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. LLB/LLM ఉత్తీర్ణులైనవారు నవంబర్ 14 నుంచి డిసెంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500. CLAT-2026లో అర్హత, డాక్యుమెంట్ వెరిఫికేషన్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

TG: రాబోయే 2 గంటల్లో నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఆ తర్వాత సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట్, రంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో వానలు పడతాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలు కురుస్తాయన్నారు.
Sorry, no posts matched your criteria.