News April 21, 2025

BE READY: రేపు మ.12 గంటలకు..

image

TG: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రేపు మ.12 గం.కు విడుదల కాబోతున్నాయి. మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. దాదాపు 9.5లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. Way2News యాప్ ద్వారా ఎలాంటి యాడ్స్ లేకుండా వేగంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. కేవలం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. మార్క్స్ లిస్టును ఈజీగా మీ సన్నిహితులకు షేర్ చేయొచ్చు.
*విద్యార్థులకు Way2News తరఫున BEST OF LUCK

News April 21, 2025

ఈ ఏడాది చివరికల్లా డయాఫ్రమ్ వాల్ పూర్తి: నిమ్మల

image

AP: పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రెండు కట్టర్లు, రెండు గ్రాబర్లతో 202 మీటర్లకు పైగా నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. ఈ నెల 30 నాటికి మూడో కట్టర్ కూడా అందుబాటులోకి వస్తుందని, ఈ ఏడాది చివరికల్లా వాల్ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని వివరించారు.

News April 21, 2025

బీటెక్, MBA చేసినా నిరుద్యోగులుగానే!

image

భారతదేశంలో గ్రాడ్యుయేట్ల పరిస్థితిపై ‘అన్‌స్టాప్’ నివేదిక విడుదల చేసింది. దాదాపు 83% మంది ఇంజినీరింగ్ విద్యార్థులు, 50శాతం మంది MBA గ్రాడ్యుయేట్లు ఎలాంటి ఉద్యోగం, ఇంటర్న్‌షిప్ పొందలేదని తెలిపింది. 2024లో ఇంటర్న్‌షిప్ పొందిన వారిలోనూ నలుగురిలో ఒకరిని ఫ్రీగా పనిచేయించుకున్నట్లు పేర్కొంది. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే విధంగా విద్యా సంస్థలు కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

News April 21, 2025

త్వరలో తులం బంగారం రూ.1.25 లక్షలు?

image

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కారణంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ యుద్ధం మరింత తీవ్రమైతే 2025 చివరినాటికి బంగారం ధర ఔన్స్‌కు $4500కి చేరుకోవచ్చని ప్రముఖ ట్రేడ్ దిగ్గజం ‘గోల్డ్‌మన్ సాచ్స్’ పేర్కొంది. ఔన్స్ ధర $4500 అయితే భారత మార్కెట్లో 10 గ్రాముల బంగారం రూ.1.25 లక్షలకు చేరుకుంటుంది. కాగా, ఇవాళ తొలిసారి బంగారం రూ.లక్షను టచ్ చేసిన విషయం తెలిసిందే. SHARE IT

News April 21, 2025

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు షాక్

image

వరుస ఓటములతో ఇబ్బందుల్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ ఈనెల 24న RCBతో జరిగే మ్యాచుకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన గాయం నుంచి కోలుకుంటున్నారని, జట్టుతో బెంగళూరుకు వెళ్లకుండా జైపూర్‌లోని హోమ్ బేస్‌లో ఉంటారని RR ధ్రువీకరించింది. భవిష్యత్తు మ్యాచుల్లో ఆడతారా? లేదా? అన్నది సంజూ కోలుకోవడంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.

News April 21, 2025

నక్సలిజం అంతమయ్యే వరకూ దాడులు ఆపం: అమిత్ షా

image

నక్సలిజాన్ని తుదముట్టించేంత వరకూ భద్రతా బలగాల దాడులు కొనసాగుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ఝార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో రూ.కోటి రివార్డున్న వివేక్ అనే మావోయిస్టుతో పాటు మరో ఇద్దరు అగ్రనేతలు మృతి చెందారని తెలిపారు. నక్సల్స్ ఏరివేతలో భద్రతా బలగాలు విజయం సాధించాయన్నారు. కాగా 2026 మార్చి 31 కల్లా నక్సల్ రహిత దేశంగా భారత్‌ నిలుస్తుందని అమిత్‌షా ప్రకటించిన సంగతి తెలిసిందే.

News April 21, 2025

‘లగచర్ల’లో మేం చెబుతున్న విషయాన్నే NHRC బయటపెట్టింది: కేటీఆర్

image

TG: లగచర్ల ఘటనలో ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లుగా జాతీయ మానవ హక్కుల సంఘం నివేదిక ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ఇంతకాలంగా మేం చెబుతున్నదీ అదే. లగచర్లలో రైతులు, మహిళల పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. మానవ హక్కుల హననానికి పాల్పడ్డారు. ఆ విషయాన్నే నివేదిక ఖరారు చేసింది. సర్కారుపై పోరాడిన గిరిజనులందరికీ అభినందనలు’ అని తెలిపారు.

News April 21, 2025

తులం బంగారం @రూ.1,00,000

image

బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. భారత లైవ్ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.లక్షను తాకినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అయితే, హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.99,860గా ఉన్నట్లు తెలిపారు. రేపటి వరకు రూ.లక్ష దాటే అవకాశం ఉందని వెల్లడించారు. అటు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఔన్స్ బంగారం ధర $3404 దాటినట్లు వెల్లడించారు. దీనికి అమెరికా- చైనా టారిఫ్ యుద్ధమే కారణమంటున్నారు.

News April 21, 2025

పోప్ ఫ్రాన్సిస్ మృతిపై బాబు, జగన్ దిగ్భ్రాంతి

image

AP: పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల CM చంద్రబాబు, మాజీ CM జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘పోప్ ఫ్రాన్సిస్ తన శాంతి సందేశాలతో కోట్లాది మందిలో స్ఫూర్తిని నింపారు. రాష్ట్ర ప్రజల తరఫున ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నా’ అని CBN పోస్ట్ చేశారు. ‘పోప్ ఫ్రాన్సిస్ నిజమైన మానవతావాది, ప్రపంచ శాంతికి గొంతుక వంటి వారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను’ అని జగన్ ట్వీట్ చేశారు.

News April 21, 2025

గిల్ గొప్ప కెప్టెన్ అవుతాడు: రషీద్ ఖాన్

image

GT కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై ఆ టీమ్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. బ్యాటర్‌గానే కాదు లీడర్‌గానూ అతడికి మంచి ఫ్యూచర్ ఉందన్నారు. వరల్డ్ కప్‌కు మించిన ప్రెజర్ IPLలో ఉంటుందని, ఎంత ఒత్తిడిలోనైనా గిల్ సరైన నిర్ణయాలు తీసుకుంటాడని కొనియాడారు. టీమ్‌ను సమన్వయపరుస్తూ గిల్ ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడని వ్యాఖ్యానించారు. ఇవాళ ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKRతో GT తలపడనుంది.