News September 7, 2024

తెలంగాణలో IPSల బదిలీలు

image

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. HYD సీపీగా సీవీ ఆనంద్, విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్, ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.

News September 7, 2024

అత్యధిక సంపాదనలో విరాట్ స్థానం ఎంతంటే…

image

గడచిన ఏడాది కాలంలో ప్రపంచంలో అత్యధిక సంపాదన కలిగిన క్రీడాకారుల జాబితాలో టీమ్ ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ 9వ స్థానంలో నిలిచారు. స్టాటిస్టా నివేదిక ప్రకారం.. కోహ్లీ రూ.847 కోట్లు ఆర్జించారు. క్రిస్టియానో రొనాల్డో రూ. 2081కోట్లతో జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. 2వ స్థానంలో స్పానిష్ గోల్ఫ్ ప్లేయర్ జోన్ రహ్మ్(రూ.1712 కోట్లు), 3వ స్థానంలో మెస్సీ(రూ.1074 కోట్లు) ఉన్నారు.

News September 7, 2024

FLASH: తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.440 తగ్గి రూ.72,870కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గడంతో రూ.66,800 పలుకుతోంది. సిల్వర్ రేట్ కేజీపై రూ.2,500 తగ్గి రూ.89,500గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News September 7, 2024

సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ కళ్యాణ్

image

AP: వరద సహాయక చర్యల కోసం సీఎం సహాయనిధికి రూ.కోటిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్‌ను విజయవాడ కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబుకు అందించారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్యంపై సీఎం ఆరా తీశారు. అంతకుముందు కలెక్టరేట్ ప్రాంగంణంలో ఏర్పాటుచేసిన వినాయకుడికి డిప్యూటీ సీఎం పూజలు చేశారు. కాగా పంచాయతీల అభివృద్ధికి మరో రూ.4 కోట్లను ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.

News September 7, 2024

‘స్త్రీ2’ పోస్టర్ కాపీ చేయలేదు: దర్శకుడు

image

‘స్త్రీ2’ పోస్టర్‌‌ను హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ నుంచి కాపీ కొట్టారన్న విమర్శలపై మూవీ డైరెక్టర్ అమర్ కౌశిక్ స్పందించారు. తాను అసలు ఆ సిరీస్ చూడనే లేదని వివరించారు. ‘నిజంగా చెబుతున్నా. నేను ఆ పోస్టర్స్ చూడలేదు. మా మూవీ పోస్టర్‌ను మా డిజైనర్ తయారుచేశారు. ఇది కాకతాళీయంగానే జరిగింది’ అని పేర్కొన్నారు. కాగా విడుదలైనప్పటి నుంచి స్త్రీ2 కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

News September 7, 2024

ఈ ఆరింటి వల్ల త్వరగా వృద్ధాప్య ఛాయలు

image

6 రకాల విషయాల వల్ల మనిషిలో వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపించే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత అమెరికన్ వైద్యుడు సౌరభ్ సేథీ ప్రకారం.. ‘మద్యపానం, ధూమపానం, సూర్యుడి యూవీ కిరణాలకు గురికావడం, తరచూ డీహైడ్రేషన్‌కు లోనవ్వడం, ప్రాసెస్ చేసిన ఫుడ్, చక్కెర పదార్థాల్ని తినడం, తరచూ ఒత్తిడికి లోనవ్వడం’ వంటివి వృద్ధాప్యాన్ని త్వరగా తీసుకొస్తాయి.

News September 7, 2024

బుడమేరు గండ్ల పూడ్చివేత పూర్తయ్యింది: నిమ్మల

image

AP: బుడమేరు గండ్ల పూడ్చివేత పూర్తయ్యిందని, దిగువకు వరద ప్రవాహం తగ్గిందని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. CM చంద్రబాబు 24గంటలు కలెక్టరేట్‌లోనే ఉండి పనులు పర్యవేక్షించారని చెప్పారు. వర్షం పడితే మళ్లీ సమస్య రాకుండా కట్ట ఎత్తు పెంచుతామన్నారు. ఆ పనులు కూడా వెంటనే చేపడుతున్నామన్నారు. విజయవాడలో ఉన్న నీరు కూడా క్రమంగా తగ్గుతోందని తెలిపారు. అవసరమైతే మోటార్లు పెట్టి నీటిని తోడిపోస్తామన్నారు.

News September 7, 2024

OTTలోకి హిట్ మూవీ

image

సైలెంట్‌గా వచ్చి మంచి హిట్ సాధించిన ‘ఆయ్’ ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 12న రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుంది. నార్నే నితిన్ హీరోగా ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ రవితేజ ‘మిస్టర్ బచ్చన్’, రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’, విక్రమ్ ‘తంగలాన్’ వంటి సినిమాలను తట్టుకొని హిట్ కొట్టింది.

News September 7, 2024

మమ్ముట్టి బర్త్‌డే.. స్పెషల్ ఫొటో షేర్ చేసిన మోహన్‌లాల్

image

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పుట్టిన రోజు సందర్భంగా అగ్రహీరో మోహన్‌లాల్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్ డే డియర్ ఇచ్చక్కా’ అంటూ ఓ స్పెషల్ ఫొటోను Xలో పంచుకున్నారు. ‘హ్యాపీ బర్త్ డే డియర్ ఇచ్చక్కా’ అని రాసుకొచ్చారు. మమ్ముట్టిని మోహన్‌లాల్ ప్రేమగా ‘ఇచ్చక్కా’(పెద్దన్న) అని పిలుస్తుంటారు. కాగా తమ అభిమాన హీరోలిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో ఉండటంతో సోషల్ మీడియాలో ఈ ఫొటోను వైరల్ చేస్తున్నారు.

News September 7, 2024

కశ్మీర్‌లో ఉగ్రవాదుల్ని అడ్డుకునేందుకు ప్రజలకు శిక్షణ

image

ఉగ్రవాదుల్ని ఎదుర్కొనేందుకు గాను జమ్మూకశ్మీర్‌లో ప్రజలకు భారత సైన్యం శిక్షణ ప్రారంభించింది. కశ్మీర్ పోలీసులతో కలిసి విలేజ్ డిఫెన్స్ గార్డ్స్(VDG)లను సిద్ధం చేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం 600మంది వరకు శిక్షణ పొందుతున్నారని, ఆటోమేటిక్ రైఫిల్స్ వాడకం, డ్రిల్స్, చిన్నపాటి మెళకువలు వారికి నేర్పిస్తున్నామని పేర్కొంది. ఒక్కో VDG విభాగానికి 3రోజుల శిక్షణ అందిస్తున్నట్లు స్పష్టం చేసింది.

error: Content is protected !!