India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. భారత లైవ్ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.లక్షను తాకినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అయితే, హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.99,860గా ఉన్నట్లు తెలిపారు. రేపటి వరకు రూ.లక్ష దాటే అవకాశం ఉందని వెల్లడించారు. అటు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఔన్స్ బంగారం ధర $3404 దాటినట్లు వెల్లడించారు. దీనికి అమెరికా- చైనా టారిఫ్ యుద్ధమే కారణమంటున్నారు.
AP: పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల CM చంద్రబాబు, మాజీ CM జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘పోప్ ఫ్రాన్సిస్ తన శాంతి సందేశాలతో కోట్లాది మందిలో స్ఫూర్తిని నింపారు. రాష్ట్ర ప్రజల తరఫున ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నా’ అని CBN పోస్ట్ చేశారు. ‘పోప్ ఫ్రాన్సిస్ నిజమైన మానవతావాది, ప్రపంచ శాంతికి గొంతుక వంటి వారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను’ అని జగన్ ట్వీట్ చేశారు.
GT కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై ఆ టీమ్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. బ్యాటర్‌గానే కాదు లీడర్‌గానూ అతడికి మంచి ఫ్యూచర్ ఉందన్నారు. వరల్డ్ కప్‌కు మించిన ప్రెజర్ IPLలో ఉంటుందని, ఎంత ఒత్తిడిలోనైనా గిల్ సరైన నిర్ణయాలు తీసుకుంటాడని కొనియాడారు. టీమ్‌ను సమన్వయపరుస్తూ గిల్ ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడని వ్యాఖ్యానించారు. ఇవాళ ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKRతో GT తలపడనుంది.
పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జోర్జ్ మేరియో బెర్గోగ్లియో. 1936, డిసెంబరు 17న అర్జెంటీనాలో జన్మించారు. బ్యూనో ఎయిర్స్ నగరానికి 1992లో ఆగ్జిలరీ బిషప్‌గా, 1998లో ఆర్చ్‌బిషప్‌గా ఉన్నారు. 2001లో పోప్ జాన్ పాల్-2 ఆయన్ను కార్డినల్‌గా నియమించారు. 2013లో పోప్ బెనెడిక్ట్ పోప్ పదవి నుంచి తప్పుకున్నాక బెర్గోగ్లియోను రోమన్ కాథలిక్ చర్చ్ పోప్‌గా ఎన్నుకుంది. 1300 ఏళ్లలో తొలి ఐరోపాయేతర పోప్ ఆయనే కావడం విశేషం.
AP: గుండె సంబంధిత ఆపరేషన్ చేయించుకున్న వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ప్రస్తుతం కోలుకుంటున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. కొద్దిరోజుల క్రితం ముంబైలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు హార్ట్ సర్జరీ జరగగా అనంతరం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని సన్నిహితులు చెబుతున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం కేసులో కేంద్ర హోంశాఖకు అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 10 రోజుల్లో ఆయన పౌరసత్వంపై తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది. ఆయనకు బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉందని, దీంతో భారత్‌లో ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్. ఆయన నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు’, ‘OG’ సినిమాల విడుదలకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. HHVM వచ్చే నెల రెండు లేదా మూడో వారంలో విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈలోగా మిగిలిన చిత్రీకరణతో పాటు డబ్బింగ్ పనులు పూర్తి చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నాయి.
పోప్ ఫ్రాన్సిస్ <<16168572>>కన్నుమూయడంతో<<>> 20 రోజుల తర్వాత నూతన క్రైస్తవ మతగురువును ఎన్నుకోనున్నారు. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాథలిక్ చర్చిల సీనియర్లు(వారిని కార్డినల్స్ అని పిలుస్తారు) వాటికన్ సిటీలోని సిస్టిన్ చాపెల్ భవనానికి వెళ్తారు. ఎన్నిక సమయంలో వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. ఫోన్, రేడియో, న్యూస్‌పేపర్ల వంటివేవీ అందుబాటులో ఉంచరు.
ఎవరు పోప్ కావాలనుకుంటున్నారో కార్డినల్స్ పేపర్లో రాసి బ్యాలెట్‌లో వేస్తారు. స్పష్టమైన మెజార్టీ రాకపోతే వాటిని కాల్చడం ద్వారా వచ్చే నల్లటి పొగ చిమ్నీ ద్వారా బయటికి వెలువడుతుంది. ఇది ఎంపిక ప్రక్రియ పూర్తికాలేదనేందుకు సంకేతం. మళ్లీ ఓటింగ్ జరుగుతుంది. 2/3 మెజార్టీ వచ్చినవారు పోప్‌గా ఎన్నికవుతారు. ఓ కెమికల్ కలిపి, ఆ బ్యాలెట్ పత్రాలను కాల్చేస్తారు. అలా వెలువడే తెల్లటి పొగ కొత్త పోప్ ఎన్నికకు చిహ్నం.
మన దగ్గర ఉండే పెట్రోల్ బంకుల్లో మహా అంటే 10 వరకు ఫిల్లింగ్ స్పాట్స్ ఉంటాయి. కానీ, ఒకేసారి 120 కార్లకు పెట్రోల్ ఫిల్ చేయగలిగే సామర్థ్యంతో బంక్ ఉందనే విషయం మీకు తెలుసా? అమెరికా టెక్సాస్‌లోని ఆస్టిన్‌కు సమీపంలో ‘Buc-ee’s’ అనే బంక్ ఉంది. ఇది 75,000 చదరపు అడుగులకు పైగా విస్తరించి ఉండగా ఇందులో ఫుడ్ & షాపింగ్ కోసం స్టాల్స్ ఏర్పాటు చేశారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పర్యాటక ప్రాంతంగా మారిపోయింది.
Sorry, no posts matched your criteria.