News March 1, 2025

దివ్యాంగులకు ఇక నుంచి UDID కార్డులు

image

TG: సదరం సర్టిఫికెట్లకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. దివ్యాంగులకు ఇక నుంచి యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిటీ కార్డు(UDID) ఇవ్వాలని నిర్ణయించింది. సదరం సర్టిఫికెట్ ఉన్న దివ్యాంగులందరికీ UDID నంబర్ జనరేట్ చేయాలని జిల్లా కలెక్టర్లను సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ కార్డులు ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. మీ సేవల్లో స్లాట్ బుక్ చేసుకుని, సదరం క్యాంపుకు వెళ్తే UDID ఇస్తారు.

News March 1, 2025

నేలపై కూర్చుని తింటున్నారా?

image

డైనింగ్ టేబుల్ కాకుండా నేల మీద కూర్చుని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘ప్లేట్‌లోని ఆహారాన్ని వంగి తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. కండరాలు, శారీరక నొప్పులు దూరమవుతాయి. భోజనం ఎంత తింటున్నామో జ్ఞప్తిలో ఉంటుంది. తద్వారా బరువును కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. నేలపై కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది’ అని పేర్కొంటున్నారు.* మీరు ఎలా తింటారు? కామెంట్ చేయండి.

News March 1, 2025

మ్యాచులు రద్దు.. టికెట్ డబ్బులు రీఫండ్: PCB

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈనెల 25, 27న రావల్పిండిలో జరగాల్సిన మ్యాచులు టాస్ పడకుండానే రద్దయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచుల కోసం టికెట్లు కొన్న ప్రేక్షకులకు పూర్తి డబ్బులను రీఫండ్ చేయనున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. డ్యామేజ్ అవని ఒరిజినల్ టికెట్లతో వచ్చి టికెట్ సెంటర్ల వద్ద డబ్బులు తీసుకోవాలని సూచించింది. బాక్సెస్, గ్యాలరీ టికెట్లు తీసుకున్న వారికి రీఫండ్ వర్తించదని పేర్కొంది.

News March 1, 2025

వారికి రేపటి నుంచి ఒంటి పూట బడులు

image

TG: నెలవంక కనిపించడంతో రేపటి నుంచి <<15622646>>రంజాన్ మాసం<<>> ప్రారంభం కానుంది. దీంతో ఉర్దూ మీడియం విద్యార్థులకు రేపటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉ.8 నుంచి మ.1.30 వరకు క్లాసులు కొనసాగుతాయని తెలిపారు. కాగా మిగతా విద్యార్థులకు మార్చి 10 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించే యోచనలో సర్కారు ఉంది. APలో ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు ఆరంభం కానున్నాయి.

News March 1, 2025

కనిపించిన నెలవంక.. రేపటి నుంచి పవిత్రమాసం

image

భారత్‌లో నెలవంక దర్శనమిచ్చింది. దీంతో రేపటి నుంచి రంజాన్ పవిత్రమాసం ప్రారంభం కానుంది. ఈ సమయంలో నెల రోజుల పాటు ముస్లింలు కఠిన ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ మాసంలో తమ సంపదలో కొంత భాగాన్ని పేదలకు దానం చేస్తారు. సౌదీ అరేబియాలో నిన్ననే చంద్రవంక దర్శనమివ్వగా నేటి నుంచి రంజాన్ మొదలైన సంగతి తెలిసిందే. కాగా రంజాన్ మాసంలో తెలంగాణలోని ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వ కార్యాలయ వేళల్లో వెసులుబాటు కల్పించింది.

News March 1, 2025

తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని లేఖ

image

AP: ఇటీవల తిరుమల కొండపై పలుమార్లు విమానాలు చక్కర్లు కొట్టిన ఘటనల నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు లేఖ రాశారు. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని కోరారు. ఆలయ పవిత్రత, ఆగమ శాస్త్ర నిబంధనల దృష్ట్యా నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

News March 1, 2025

CT: సెమీస్ చేరిన జట్లివే

image

ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్-A నుంచి ఇండియా, న్యూజిలాండ్ జట్లు, గ్రూప్-B నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరాయి. రేపు ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితంతో సెమీస్‌లో ఏ జట్లు పోటీ పడతాయనేది తేలనుంది.

News March 1, 2025

ఇది దేశంలోనే తొలిసారి: మంత్రి సత్యకుమార్

image

AP: దేశంలోనే తొలిసారిగా ఆశా వర్కర్లకు గ్రాట్యుటీని కూటమి ప్రభుత్వం అమలు చేయనుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. 30yrs సేవల్లో ఉన్న వారికి గ్రాట్యూటీ కింద ₹1.50 లక్షల వరకూ లబ్ధి చేకూరుతుందన్నారు. గరిష్ఠ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచడంతో 42,752 మంది వర్కర్లకు మేలు జరుగుతుందని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా ₹10వేల వేతనం ఇస్తున్నామని, రెండు కాన్పులకు 180 రోజుల ప్రసూతి సెలవులు ఇస్తామని పేర్కొన్నారు.

News March 1, 2025

ఇసుక సరఫరాపై సీఎం ఆదేశాలు

image

TG: ఇసుక, ఖనిజాల అక్రమ తవ్వకాలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఖనిజాభివృద్ధి శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టే పనులకు TGMDC నుంచే ఇసుక సరఫరా చేయాలన్నారు. పెద్దమొత్తంలో చేపట్టే నిర్మాణ రంగాలకు వీటి నుంచి సరఫరా చేయాలని సూచించారు. ప్రభుత్వమే సరైన ధరలకు సరఫరా చేస్తే అక్రమాలకు ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు.

News March 1, 2025

వీల్లేంట్రా బాబు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారు!

image

హోటల్‌కు వచ్చిన వారిలో కొందరు రూమ్స్‌లోని వస్తువులను దొంగిలిస్తుండటంతో దీనికి అడ్డుకట్ట వేసేందుకు సదరు యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. ముంబైలోని ఓ హోటల్ రూమ్స్‌లో ఉన్న బాత్రూమ్ స్లిప్పర్స్ కూడా దొంగతనానికి గురయ్యాయి. దీంతో ఒకే సైజులోని వేర్వేరు చెప్పులను జోడీగా ఉంచారు. ఓ వ్యక్తి దీనిని ఫొటో తీసి Xలో షేర్ చేయడంతో వైరలవుతోంది. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారేంట్రా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.