News September 6, 2024

ఉప్పొంగుతున్న గోదావరి.. హెచ్చరికలు జారీ

image

AP: కృష్ణా నదిలో వరద తగ్గుతుండగా ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉప్పొంగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం 12.2 అడుగుల వద్ద నీటి మట్టం ఉండగా, 10.39 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

News September 6, 2024

ఇంగ్లండ్ టీ20 జట్టు కెప్టెన్‌గా ఫిల్ సాల్ట్

image

AUSతో జరగనున్న 3 T20ల సిరీస్‌కు ENG కెప్టెన్‌గా ఫిల్ సాల్ట్ నియమితులయ్యారు. జోస్ బట్లర్ గాయం వల్ల దూరమవడంతో సాల్ట్‌కు అవకాశం దక్కింది. ఇతను 31 T20ల్లో 165.11 స్ట్రైక్ రేటుతో 885 రన్స్ చేశారు. ఈ నెల 11, 13, 15 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
టీమ్: ఫిల్ సాల్ట్(C), ఆర్చర్, జాకబ్, బ్రైడన్, జోర్డాన్, సామ్ కరన్, హల్, జాక్స్, లివింగ్‌స్టోన్, సాకిబ్, మౌస్లీ, ఓవర్‌టన్, రషీద్, టోప్లీ, జాన్ టర్నర్

News September 6, 2024

FIRST TIME: బెల్లంతో 75 అడుగుల గణనాథుడు

image

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులు మట్టి వినాయకులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. కొన్నిచోట్ల వివిధ వస్తువులతో తయారుచేసిన గణనాథులను సైతం ప్రతిష్ఠిస్తుంటారు. విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతంలో మాత్రం ఇండియాలోనే తొలిసారి బెల్లంతో 75 అడుగుల ఎత్తులో భారీ గణపయ్యను రూపొందిస్తున్నారు. రాజస్థాన్ నుంచి స్పెషల్‌గా 20 టన్నుల బెల్లాన్ని తీసుకొచ్చారు. దీనికి రూ.50లక్షల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది.

News September 6, 2024

మేం గీత దాటితే.. అమెరికాకు రష్యా డేంజర్ సిగ్నల్

image

ఉక్రెయిన్ వివాదంపై లక్ష్మణ రేఖను దాటొద్దని అమెరికాను రష్యా హెచ్చరించింది. వారికి ఆయుధాలు పంపిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని సంకేతాలిచ్చింది. ‘ఆయుధాల సరఫరాతో US సొంత గీత దాటింది. మేం గీత దాటితే ఎలా ఉంటుందో వాళ్లు అర్థం చేసుకోవాలి. అదెక్కడుందో వారికి బాగా తెలుసు. రష్యాతో పరస్పర సంయమనం కోల్పోతే వారికే ప్రమాదం. ఇప్పటికీ అక్కడ కాస్త తెలివైనోళ్లు ఉన్నారనుకుంటా’ అని రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు.

News September 6, 2024

విద్యుత్ బిల్లుల వసూలు వాయిదా: సీఎం చంద్రబాబు

image

AP: వరద బాధిత ప్రాంతాల్లో సెప్టెంబర్ నెల విద్యుత్ బిల్లుల వసూలు వాయిదా వేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ‘ప్రతి ఇంటికీ ఎలక్ట్రిషియన్, ప్లంబర్, మెకానిక్ అవసరం కాబట్టి వారు ఇష్టానుసారం వసూలు చేయకుండా చూస్తాం. ఒక ధర నిర్ణయిస్తాం. అవసరమైతే రాయితీ ఇస్తాం. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటే మనుషుల్ని పంపిస్తాం’ అని తెలిపారు.

News September 6, 2024

వైసీపీకి ప.గో జడ్పీ ఛైర్‌పర్సన్ రాజీనామా

image

AP: ఉమ్మడి పశ్చిమగోదావరి జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త ప్రసాదరావు వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు వైసీపీ చీఫ్ జగన్‌కు లేఖ పంపారు. జిల్లా అభివృద్ధి కోసం తాము జనసేనలో చేరనున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఏలూరు జిల్లాలో మాజీ మంత్రి ఆళ్ల నాని, మేయర్ నూర్జహాన్ దంపతులు, 19 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడిన విషయం తెలిసిందే.

News September 6, 2024

7వేల ఇళ్లు నేలమట్టం.. బాధితులకు ఇందిరమ్మ గృహాలు

image

TG: భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 7వేల ఇళ్లు కూలిపోయాయని ప్రభుత్వానికి కలెక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. కొన్ని పూర్తిగా, కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో బాధితులకు ఇందిరమ్మ గృహాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూలిన ఇళ్లలో ఎక్కువగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోనే ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కింద స్థలం ఉంటే ₹5లక్షలు, లేని వారికి స్థలం+₹5లక్షలు ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది.

News September 6, 2024

బుడమేరును బాగు చేయాల్సిందే..!

image

విజయవాడను నిండాముంచిన బుడమేరు వాగును బాగు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఆక్రమణలు తొలగించి వాగును విస్తరించడం, ప్రకాశం బ్యారేజీకి వెళ్లే డైవర్షన్ ఛానల్ కెపాసిటీని పెంచడం లాంటి ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే కొల్లేరు మంచినీటి సరస్సు పరీవాహక ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఆక్రమణలు పెరిగాయి. బుడమేరు నీరు దాంట్లోకి వెళ్లకపోవడం కూడా విజయవాడ వరదలకు ఓ కారణంగా చెబుతున్నారు నిపుణులు.

News September 6, 2024

ఉదయాన్నే కాఫీ తాగుతున్నారా?

image

కొందరికి ఉదయం లేవగానే కాఫీ కావాల్సిందే. అయితే, సరైన సమయంలో కాఫీ తాగితే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఉదయాన్నే కాకుండా కాస్త లేటుగా 9.30 నుంచి 11.30 గంటల లోపు కాఫీ తాగడం ఉత్తమమని సూచించారు. అధికంగా ఉండే కార్టిసాల్‌ స్థాయులు నియంత్రణలో ఉంటాయన్నారు. శరీరంలోని సహజ హార్మోన్‌లు మరింత స్థిరంగా ఉండేందుకు దోహదపడతాయన్నారు.

News September 6, 2024

ఇవాళ NTR జిల్లాలో స్కూళ్లకు సెలవు

image

AP: వర్షాలు తగ్గినా లోతట్టు ప్రాంతాల్లో వరద ముప్పు దృష్ట్యా ఎన్టీఆర్ జిల్లాలో స్కూళ్లకు కలెక్టర్ ఇవాళ కూడా సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సెలవు ఇవ్వాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని చాలా స్కూళ్లను పునరావాస కేంద్రాలుగా మార్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగతా అన్ని జిల్లాల్లో యథాతథంగా స్కూళ్లు, విద్యాసంస్థలు కొనసాగనున్నాయి.