India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: విజయవాడ వరద బాధితులకు ఇవాళ ఉదయం నుంచి నిత్యావసర ప్యాకేజీ కిట్లు పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఎండీయూ వాహనాల ద్వారా ఇళ్ల వద్దనే <<14032631>>సరుకులు<<>> అందిస్తామని, ఒక్క రోజులోనే ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కిట్‌లో 25 కేజీల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, పంచదార, లీటర్ పామాయిల్, 2 కిలోల చొప్పున ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఉంటాయి.
AP: రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో విస్తారంగా వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖ, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, అనకాపల్లి, అంబేడ్కర్, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.
AP: విజయవాడలోని వరద బాధితుల ఆకలిని తీర్చేందుకు రాష్ట్రంలోని పలు ఆలయాలు ముందుకొచ్చాయి. ఇప్పటి వరకు ఇంద్రకీలాద్రి 2 లక్షల ఆహార ప్యాకెట్లు, 2.5 లక్షల వాటర్ బాటిళ్లు అందించింది. సింహాచలం 90వేల ఫుడ్ ప్యాకెట్స్, 50 వేల నీళ్ల బాటిళ్లు, ద్వారకా తిరుమల 31వేల ప్యాకెట్ల ఆహారం, 35వేల వాటర్ బాటిళ్లు సరఫరా చేశాయి. అలాగే అన్నవరం, అరసవల్లి, మోపిదేవి ఆలయాలు కూడా ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకున్నాయి.
కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) మెంటార్‌గా శ్రీలంక మాజీ క్రికెటర్ సంగక్కర నియామకం కానున్నట్లు క్రీడావర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా ఉన్నారు. ఆ జట్టు ద్రవిడ్‌ను కోచ్‌గా తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో KKR యాజమాన్యం సంగక్కరతో చర్చలు జరిపినట్లు సమాచారం. గత సీజన్‌లో KKR మెంటార్‌గా ఉన్న గంభీర్ ప్రస్తుతం IND హెడ్ కోచ్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
AP: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ నేత రుద్రరాజు సత్యనారాయణ రాజు(98) కన్నుమూశారు. ఈయన 1952 నుంచి 1965 వరకు యలమంచిలి మండలం చించినాడ సర్పంచ్‌గా పనిచేశారు. 1967లో ఎమ్మెల్యేగా గెలిచారు. తుది శ్వాస విడిచే వరకు సీపీఎంలోనే ఉండి ప్రజలకు సేవ చేశారు. ఆయన స్వగ్రామం చించినాడలో ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా ఈనెల 6, 7, 8, 9 తేదీల్లో విజయవాడ మీదుగా నడిచే 44 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రద్దయిన రైళ్ల వివరాలను విజయవాడ డీఆర్ఎం Xలో <
TG: మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారంలో ఈనెల 17న విచారణకు హాజరు కావాలని భూపాలపల్లి జిల్లా కోర్టు మాజీ సీఎం KCRకు సమన్లు జారీ చేసింది. ఆయనతో పాటు ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కూ సమన్లు జారీ అయ్యాయి. బ్యారేజీ కుంగిపోవడంతో రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని, దీనిపై విచారణ చేయాలని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో KCRతో పాటు పలువురికి కోర్టు గతంలో నోటీసులిచ్చింది. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు.
హిందూధర్మంలో ప్రతి పండుగకు ఓ అర్థం ఉంటుంది. ప్రతి వేడుకా పర్యావరణ హితంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. గణేశ చతుర్ధికి వాడే పూజాపత్రాలన్నీ ప్రకృతిసిద్ధమైనవే. మరి పార్వతీపుత్రుడి విగ్రహాల్ని మాత్రం ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసినవి ఎందుకు వాడాలి? నిమజ్జనం అనంతరం నీటిలో సులువుగా కలిసిపోయేలా, ప్రకృతికి ఏమాత్రం హాని కలిగించని రీతిలో ఉండే మట్టి గణనాథుల్నే పూజకు వినియోగిద్దాం. ఆ గణపయ్య కృపకు పాత్రులవుదాం.
తిరుమల లడ్డూ విషయంలో TTD ఇటీవల పలు మార్పులు చేసింది. దీంతో కొందరు భక్తుల్లో అయోమయం నెలకొంది. దర్శనం చేసుకున్న వారు టోకెన్ చూపిస్తే 2 లడ్డూలు ఇస్తారు. ఇంకా కావాలంటే ఒక్కో లడ్డూకి రూ.50 చొప్పున చెల్లించి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. దర్శనం చేసుకోని వారికి లడ్డూ కావాలంటే కచ్చితంగా ఆధార్ చూపించాలి. కార్డుపై 2 లడ్డూలే ఇస్తారు. దర్శనం చేసుకోకుండా ఆధార్ కార్డు లేకుండా ఉంటే లడ్డూలు ఇవ్వరు.
భారత్‌లో 20కోట్లకు పైగా ప్రజలకు ఎటువంటి శారీరక శ్రమ లేదని ‘State of Sports and Physical Activity in India’ అనే అధ్యయనం తేల్చిచెప్పింది. 10శాతంమంది మాత్రమే క్రీడలు ఆడుతున్నారని పేర్కొంది. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలను 20కోట్లకు పైగా ప్రజలు అందుకోవడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే 2047 నాటికి దేశ ఆరోగ్య వ్యవస్థలపై ఏటా రూ.55 ట్రిలియన్ భారం పడే ప్రమాదం ఉంది’ అని ఆందోళన వ్యక్తం చేసింది.
Sorry, no posts matched your criteria.