News September 28, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

APలోని మన్యం, అల్లూరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, ఉ.గో, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, YSR, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయంది. TGలోని HYD, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.

News September 28, 2024

Metaపై EU $100 మిలియన్ల భారీ జ‌రిమానా

image

ప్రైవ‌సీ బ్రీచ్ కార‌ణంగా Facebook మాతృ సంస్థ Metaపై యూరోపియన్ యూనియన్ $100 మిలియన్ల (రూ.837 కోట్లు) భారీ జ‌రిమానా విధించింది. EU యూజర్ల పాస్‌వ‌ర్డ్‌ల‌ను స‌రైన ఎన్‌క్రిప్ష‌న్ లేకుండా ప్లెయిన్ టెక్ట్స్ ఫార్మాట్‌లో స్టోర్ చేసిన‌ట్టు ద‌ర్యాప్తులో తేలింది. ఈ డేటాను ఎవ‌రైనా యాక్స్‌స్ చేయ‌గ‌లిగ‌తే యూజ‌ర్ల ప్రైవసీ ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే అని పేర్కొంది. 2019లోనే ఈ సమస్యను మెటా స్వయంగా అంగీకరించడం గమనార్హం.

News September 28, 2024

డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్

image

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను డిప్యూటీ సీఎం పదవి వరించింది. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా ఉదయనిధి ప్రస్తుతం క్రీడా, యువజనశాఖతో పాటు చెన్నై మెట్రో రైల్ ఫేజ్-2 వంటి కార్యక్రమాలు కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నారు.

News September 28, 2024

ధూమ్-4లో విలన్‌గా రణ్‌బీర్ కపూర్?

image

ధూమ్‌-4లో ర‌ణ్‌బీర్ క‌పూర్ విల‌న్ రోల్ చేస్తున్న‌ట్టు బీటౌన్‌ టాక్. YRF బ్యాన‌ర్‌పై తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. గ‌త మూడు పార్ట్స్‌లో నటించిన యాక్టర్స్ ఎవ‌రూ ధూమ్‌-4 ఉండ‌కుండా నిర్మాత ఆదిత్య చోప్రా జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్‌ని దృష్టిలో పెట్టుకొని రణ్‌బీర్‌ని విలన్ పాత్రకు ఒప్పించినట్లు తెలుస్తోంది. దీనిపై రణ్‌బీర్ కూడా ఆసక్తితో ఉన్నట్టు సమాచారం.

News September 28, 2024

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన

image

బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది.
జట్టు: సూర్య (C), అభిషేక్ శర్మ, శాంసన్, రింకూ సింగ్, హార్దిక్, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్
*అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో మూడు T20లు జరగనున్నాయి.

News September 28, 2024

కూటమి నేతలు పాపపరిహారం చేసుకోవాలి: సజ్జల

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో ఘోరమైన ఆరోపణలు చేసిన కూటమి నేతలు పాపపరిహారం చేసుకోవాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. డిక్లరేషన్ అనేది టీటీడీ, భక్తుడికి సంబంధించిన అంశమని చెప్పారు. ‘జగన్ తిరుమల వెళ్తానంటే దానిని రాజకీయం చేశారు. ఎప్పుడూ లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు? గతంలో జగన్ పలుమార్లు తిరుమల వెళ్లినా అడగలేదు. మతం వ్యక్తిగతం అని సీఎం చంద్రబాబుకు తెలియదా?’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News September 28, 2024

IPL: ఆ ఆటగాళ్లకు రూ.18 కోట్లు?

image

ఒక్కో ఫ్రాంచైజీకి రిటెన్షన్ పర్స్ కింద రూ.75 కోట్ల వరకు బీసీసీఐ అనుమతించినట్లు తెలుస్తోంది. మొట్టమొదటగా రిటెన్షన్ చేసుకునే ఆటగాడికి, నాలుగో రిటెన్షన్ ఆటగాడికి రూ.18 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. థర్డ్ రిటెన్షన్‌ రూ.11 కోట్లు, సెకండ్ అండ్ ఫిఫ్త్ రిటెన్షన్ ఆటగాడికి రూ.14 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం రూ.120 కోట్లలో మిగతా రూ.45 కోట్లతో మెగా వేలంలో ఆటగాళ్లను కొనాల్సి ఉంటుంది.

News September 28, 2024

IPL: ఫ్రాంచైజీ పర్స్ విలువ భారీగా పెంపు?

image

IPL 2025 కోసం BCCI కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీల పర్సు విలువను రూ.115 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో పర్స్ వ్యాల్యూ రూ.90 కోట్లుగా ఉండేది. నవంబర్ రెండో వారంలో 2 రోజులపాటు మెగా ఆక్షన్ జరుగుతుందని సమాచారం. మరోవైపు ఐదుగురి రిటెన్షన్‌పై మెజారిటీ ఫ్రాంచైజీలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రేపు అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

News September 28, 2024

కంపెనీ మేనేజర్ CV రిజెక్ట్.. HR టీమ్ తొలగింపు

image

3 నెలలుగా HR టీమ్ నియామకాలు చేస్తున్నా కంపెనీలోకి క్వాలిఫైడ్ అభ్యర్థులు రాకపోవడంతో ఓ మేనేజర్ విసుగు చెందారు. ఎక్కడ పొరపాటు జరుగుతుందో తెలుసుకోవడానికి తన CVని పంపగా నిమిషాల్లోనే తిరస్కరణకు గురైంది. HR సిస్టమ్‌లో లోపం వల్ల ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అవుతున్నట్లు ఆయన గుర్తించారు. దీనిపై తప్పుడు సమాచారం ఇవ్వడంతో HR టీమ్ మొత్తాన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ ఉదంతాన్ని ఆయన Redditలో షేర్ చేయగా వైరలవుతోంది.

News September 28, 2024

భోజనం చేశాక ఇలా చేస్తే..

image

భోజనం చేశాక 10 నిమిషాలు నడిస్తే జీర్ణక్రియ మెరుగవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. పేగుల్లో కదలికలు జరిగి ఆహారం త్వరగా జీర్ణమవుతుందని.. ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం లాంటి సమస్యలూ తగ్గుతాయని చెబుతున్నారు. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి రక్తంలో చక్కెర స్థాయులు తగ్గేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే తిన్న వెంటనే కాకుండా 5-10 నిమిషాల తర్వాత నడవాలని సూచిస్తున్నారు.