India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత ఆహారంలో సరిపడినంత ఐరన్, అయోడిన్, ఫొలేట్, కాల్షియం ఉండటం లేదని ఆహార నిపుణులు పేర్కొంటున్నారు. వీటి లోపం కారణంగా గర్భిణులు, ఐదేళ్ల లోపు చిన్నారులపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు మానసిక, శారీరక ఎదుగుదలలో లోపాలతో పాటు పలు రకాలైన అనారోగ్యాల బారిన పడుతున్నారని వివరిస్తున్నారు. భారత్‌లో 50శాతానికి పైగా పిల్లలకు సరైన పోషకాలు అందడంలేదని వారు పేర్కొన్నారు.
AP: ఆకివీడుకు చెందిన వృద్ధురాలు కృష్ణవేణి(75) పవన్‌కు కష్టాలు చెప్పుకోవాలని విజయవాడకు వచ్చింది. పంచాయతీరాజ్ కమిషనరేట్ గేటు బయట కూర్చుంది. బయటకొస్తూ ఆమెను చూసిన ఆయన భోజనం చేయలేదని గ్రహించారు. కారులో ఎక్కించుకుని ఆహారం పెట్టించాక సమస్యలు విన్నారు. భర్త లేడని, పెన్షన్ చాలడం లేదని, కొడుకు పరిస్థితి బాగాలేదని, ఇల్లు కట్టించాలనడంతో పవన్ చలించారు. అధికారులకు చెప్పి ఇంటి నిర్మాణానికి నిధులు ఇప్పించారు.
అగ్నివీర్ అంశం హరియాణా ఎన్నికలను మలుపు తిప్పనుంది. అత్యధికంగా సైనిక నియామకాలు జరిగే రాష్ట్రాల్లో హరియాణా ఒకటి. దీంతో ఇక్కడ NDAకి వ్యతిరేకంగా ఇప్పటికే ఉద్యమాలు జరిగాయి. అధికారంలోకి వస్తే అగ్నివీర్ రద్దు చేస్తామని ఇండియా కూటమి హామీ ఇచ్చింది. తాజాగా అగ్నివీర్‌లో మార్పులకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ రకంగా అగ్నివీర్ అంశం అధికార, విపక్షాలకు కీలకంగా మారింది.
TG: BRS సోషల్ మీడియా ఇన్‌ఛార్జి కొణతం దిలీప్ అరెస్ట్‌పై KTR స్పందించారు. ‘రేవంత్ రెడ్డి.. ఏ తెలంగాణా బిడ్డనైనా చట్టవిరుద్ధంగా అరెస్టు చేసి భయపెట్టవచ్చని మీరు అనుకుంటే మీ అంత మూర్ఖుడు ఉండరు. మీ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకే దిలీప్‌ను అరెస్టు చేశారు. మీరు ఎంత ప్రయత్నించినా, మేము మీ అకృత్యాలను, వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామని నేను మీకు హామీ ఇస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
మధ్యప్రదేశ్ సత్నా జిల్లాలోని నాగౌడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఓ డాక్టర్ రాసిన మందు చీటీ ఇప్పుడు వైరల్ అవుతోంది. అక్కడి డాక్టర్ అమిత్ సోనీ ఓ రోగికి రాసిన ప్రిస్క్రిప్షన్‌ని ఆస్పత్రిలోని ఔషద కేంద్రంలోగానీ, ప్రైవేటు మెడికల్ షాపులోగానీ ఎవరూ అర్థం తీసుకోలేకపోతున్నారు. ఈ చేతిరాత అర్థంకాక అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఈ చీటీ వైరల్ అవ్వడంతో ఆ వైద్యుడికి జిల్లా వైధ్యాధికారి నోటీసులు జారీ చేశారు.
39,481 ఉద్యోగాల భర్తీకి SSC <<14031050>>నోటిఫికేషన్<<>> ఇవ్వగా అత్యధికంగా BSFలో 15,654(పురుషులు-13,306, మహిళలు 2348), CRPFలో 11541(పురుషులు 11,299, మహిళలు 242), CISFలో 7,145(6430, 715), ITBPలో 3,017, ARలో 1,248, మిగతావి SSB, SSF, NCBలో ఉన్నాయి. NCBకి ఎంపికైన వారికి పే లెవల్-1(రూ.18000-56900), మిగతా వారికి లెవల్-3(రూ.21,700-69,100) జీతాలుంటాయి. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <
వయసు 40 దాటితే శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ నేపథ్యంలో పలు జాగ్రత్తల్ని తీసుకోవాలని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు. అవి.. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. బరువులు ఎత్తడం కంటే జాగింగ్ వంటి కార్డియో మేలు. తగినంత నిద్రపోవాలి. ధూమ, మద్యపానాలకు దూరం కావాలి. పోషకాహారం తీసుకోవాలి. నూనె వంటలకు, తీపికి వీలైనంత దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతత ఉండేలా ధ్యానం, యోగా వంటివాటిపై దృష్టి సారించాలి.
లింగ అంతరాన్ని తగ్గించడంలో దేశ ఆర్థిక రంగం కీలకమని RBI గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించడం, వారి వ్యాపారాలకు అనుకూలమైన పథకాలను రూపొందించడం దీనికి దోహదపడతాయన్నారు. నిజమైన అభివృద్ధి చెందిన భారతదేశం పౌరుల సామాజిక, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఆర్థిక సేవలు, ఆర్థిక అక్షరాస్యత కల్పించాలన్నారు. FIBAC 2024 వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు.
పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. మెన్స్ క్లబ్ త్రో F51 విభాగంలో ధరంబీర్ బంగారు పతకం, ప్రణవ్ సూర్మా సిల్వర్ సాధించారు. దీంతో మొత్తం 25 పతకాలతో భారత్ 14వ స్థానంలో నిలిచింది. అందులో 5 గోల్డ్, 9 సిల్వర్, 11 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. మొత్తం 146 పతకాలతో చైనా టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది.
ఆర్థిక వనరుల కొరతతో పంజాబ్ ప్రభుత్వం రిటైల్ ఇంధన ధరలను పెంచింది. అలాగే 7 కిలోవాట్ల లోడ్ ఉన్న గృహ వినియోగదారులకు సబ్సిడీతో కూడిన విద్యుత్ పథకాన్ని కూడా ఉపసంహరించుకుంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయించింది. లీటరు పెట్రోల్‌పై 61 పైసలు, డీజిల్‌పై 92 పైసల పెంపు ద్వారా ఏడాదికి రూ.1,500-1,700 కోట్ల వరకు అదనంగా ఆదాయం సమకూర్చుకోనుంది.
Sorry, no posts matched your criteria.