News September 4, 2024

NK: వరద బాధితుల్ని కాపాడని అధికారులకు ఉరిశిక్ష!

image

ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్‌ఉన్ 20-30 మంది అధికారులకు ఉరిశిక్ష విధించారని ద.కొరియా మీడియా వెల్లడించింది. చైనా సమీపంలోని చాంగాంగ్ ప్రావిన్స్‌ వరదల్లో ప్రజలు చనిపోకుండా వారు కాపాడలేకపోవడమే ఇందుకు కారణం. జులైలో సంభవించిన ఈ విపత్తులో 1000+ మంది చనిపోయారు. వందల సంఖ్యలో ఇళ్లు, 7410 ఎకరాల వ్యవసాయభూమి, రోడ్లు, కట్టడాలు నీట మునిగాయని సమాచారం.

News September 4, 2024

VIRAL: గుండెల్ని పిండేసే ఫొటో

image

AP: విజయవాడలో ఒక్కసారిగా ముంచెత్తిన వరదలతో నెలలు నిండిన గర్భిణులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోకి వరద చేరడంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. ఓ గర్భిణి వరద ప్రవాహంలోనే కష్టంగా నడుస్తున్న ఓ ఫొటో గుండెల్ని పిండేస్తోంది. అయితే, ప్రభుత్వం ప్రత్యేకంగా ఇళ్లలో చిక్కుకున్న గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు, 10 రోజుల్లో డెలివరీ అయ్యే 154 మందిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

News September 4, 2024

విద్యుత్ మీటర్లు లేని వారికి శుభవార్త

image

TG: కొత్తగా ఇళ్లు నిర్మించుకొని విద్యుత్ మీటర్ బిగించుకోని వారికి ప్రభుత్వం రూ.825కే మీటర్లు ఏర్పాటు చేయనుంది. Sep 15 వరకు సిబ్బంది గ్రామాల్లో తిరిగి మీటర్లు లేని పేదలను గుర్తిస్తారు. సాధారణంగా మీటర్ల కోసం మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. కానీ ప్రస్తుతం సిబ్బందికి డబ్బులిస్తే నేరుగా రశీదు తీసుకునే వెసులుబాటు ఉంది. వారు గృహజ్యోతి కోసం ఈ నెల 17న మొదలయ్యే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలి.

News September 4, 2024

వారాంతంలోగా వరద నష్టం వివరాలివ్వాలి: CS

image

TG: భారీ వర్షాలు, వరదలతో సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బృందాలను క్షేత్రస్థాయిలోకి వెంటనే పంపించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాల మేరకు ప్రతీ జిల్లాలో విపత్తు నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులు, పరికరాల వివరాలు వెంటనే సమర్పించాలన్నారు.

News September 4, 2024

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. రీజన్ ఏంటంటే?

image

బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, మదుపరులు లాభాల స్వీకరణకు దిగడమే ఇందుకు కారణాలు. 25,089 వద్ద మొదలైన NSE నిఫ్టీ 184 పాయింట్ల నష్టంతో 25,095 వద్ద చలిస్తోంది. BSE సెన్సెక్స్ 511 పాయింట్లు పతనమై 82,026 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 5:45గా ఉంది. ఏషియన్ పెయింట్స్, BPCL, HUL, హీరోమోటో, గ్రాసిమ్ టాప్ గెయినర్స్.

News September 4, 2024

బెజవాడలోనూ ‘హైడ్రా’ తరహా వ్యవస్థ రావాల్సిందేనా?

image

AP: బుడమేరు వాగును ఆక్రమించి ఇళ్లు కట్టడంతోనే బెజవాడ నీటమునిగినట్లు తెలుస్తోంది. కొందరు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు బుడమేరును ఆక్రమించి వెంచర్లు వేశారు. తక్కువ ధరకు దొరుకుతున్నాయని మధ్యతరగతి ప్రజలు అక్కడ ప్లాట్లు కొని ఇళ్లు కట్టుకున్నారు. క్రమక్రమంగా అవి పెద్దపెద్ద కాలనీలుగా విస్తరించాయి. దీంతో ఇక్కడా హైడ్రా తరహా వ్యవస్థ రావాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News September 4, 2024

ఎంత మంది నష్టపోయారంటే?

image

TG: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 67వేల మంది నష్టపోయినట్లు సమాచారం. మొత్తం 117 గ్రామాల్లో ఈ నష్టం వాటిల్లింది. బాధితుల్లో ఖమ్మం జిల్లాలోనే 49వేల మంది ఉన్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం 44 ఇళ్లు పూర్తిగా మరో 600 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 51 వంతెనలు, 249 కల్వర్టులు, 166 చెరువులు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. 13,342 జీవాలు మృతి చెందాయి.

News September 4, 2024

తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ విరాళం

image

తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి రూ.కోటి విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు చెరో రూ.50 లక్షల చొప్పున ఇస్తున్నానని తెలిపారు. వరదలతో రెండు రాష్ట్రాల్లో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు తనను కలిచివేస్తున్నాయని ట్వీట్ చేశారు. పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమన్నారు. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు రాసుకొచ్చారు.

News September 4, 2024

మరో రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

image

AP: భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని మరిన్ని జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఎన్టీఆర్, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాలో స్కూళ్లకు హాలీడే ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు TGలోని ఖమ్మం జిల్లాలోనూ ఇవాళ హాలిడే ఇచ్చారు. మరిన్ని జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News September 4, 2024

విరాళం ప్రకటనపై కొందరు ఉద్యోగుల ఆగ్రహం

image

TG: వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ <<14008928>>ఉద్యోగ<<>> సంఘాల జేఏసీలు ఒక రోజు బేసిక్ పేను విరాళంగా ఇవ్వడంపై కొందరు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను సంప్రదించకుండా, తమ అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా ఎందుకు ప్రకటన చేశారని ప్రశ్నిస్తున్నారు. తమకు రావాల్సిన 5 డీఏలు, 4 సరెండర్ లీవుల బిల్లులు, పీఆర్సీ గురించి ప్రభుత్వాన్ని ఎందుకు అడగట్లేదని నిలదీస్తున్నారు.