India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: వరద ప్రభావిత ప్రాంతాల్లో BJP నేతలు నేటి నుంచి పర్యటించనున్నారు. MPలు, MLAలు, ముఖ్య నేతలు వరద బాధితులను పరామర్శించాలని పార్టీ నిర్ణయించింది. అధిక నష్టం వాటిల్లిన ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో తొలి విడత పర్యటించి బాధితులకు భరోసా కల్పించనున్నారు. రెండో విడతలో కోదాడ, సూర్యాపేట, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. అటు సభ్యత్వ నమోదును ఈ నెల 7 నుంచి కొనసాగించనున్నట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీలోని గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అటు తూర్పు, ఉత్తర తెలంగాణలోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు. కాగా ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.
వర్షాలు, వరదల కారణంగా మరో నాలుగు రోజుల పాటు పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఇవాళ 88 రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. ఒక రైలును దారి మళ్లించినట్లు తెలిపింది. రేపు 61, ఎల్లుండి 13, మరుసటి రోజున 3 రైళ్లు రద్దు చేసినట్లు వెల్లడించింది. మరోవైపు మహబూబాబాద్ జిల్లాలో ట్రాక్ మరమ్మతులు చివరి దశకు చేరుకున్నాయి.
TG: రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయంగా ప్రకటించిన ₹10వేలు దేనికి సరిపోతాయని వరద బాధితుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒక్కో కుటుంబం సగటున ₹2లక్షలు నష్టపోయిందని, ప్రభుత్వం ఇచ్చే సాయం ఈ నష్టాన్ని పూడుస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే సర్వే చేసి నష్టాన్ని అంచనా వేశాక సాయంపై నిర్ణయం తీసుకుంటామని CM చెప్పిన విషయం తెలిసిందే. కాగా ఆ సర్వే పూర్తయ్యేదెప్పుడో అని ప్రజలు సందేహిస్తున్నారు.
వినాయక చవితి నేపథ్యంలో విగ్రహాల అమ్మకాలతో ఆయా ప్రాంతాల్లో సందడి నెలకొంది. పలు థీమ్‌లతో తయారు చేసిన విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ముంబై వంటి నగరాల్లో వరల్డ్ కప్ థీమ్‌తో వినాయకులను రూపొందించారు. తాజాగా ‘పుష్ప-2’ మూవీలో అల్లు అర్జున్, రష్మిక తరహాలో ఉన్న విగ్రహం వైరల్‌గా మారింది. అయితే అభిమానం పేరుతో దేవుళ్ల విగ్రహాలను ఇలా తయారు చేయవద్దని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
భారీ వర్షాలకు ఏపీలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి ప్రకటనలో తెలిపారు. గుంటూరులోనూ ప్రైవేటు, ప్రభుత్వ విద్యాలయాలకు హాలిడే ఇచ్చారు. అంతకుముందు ఎన్టీఆర్ జిల్లాలోనూ సెలవు ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో సెలవుపై ఇంకా ప్రకటన రాలేదు.
పారిస్ పారాలింపిక్స్ 400మీటర్ల పరుగులో కాంస్యం సాధించిన దీప్తి జీవాంజికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. చాలా మందికి ఆమె స్ఫూర్తి అని కొనియాడారు. మరోవైపు ప్రపంచ వేదికపై కాంస్య పతకాన్ని గెలుచుకోవడం దేశానికే గర్వకారణమని మంత్రి సీతక్క ట్వీట్ చేశారు. పేద కుటుంబం నుంచి పతక విజేత వరకు ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
AP: కృష్ణమ్మ శాంతిస్తోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.81 లక్షల క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ వద్ద నీటిమట్టం 13.5 అడుగులుగా ఉంది. రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించి మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. కాగా, సోమవారం రికార్డు స్థాయిలో 11 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం రావడంతో బెజవాడ వాసులు వణికిపోయారు.
తెలంగాణలో 4 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్లు HYD నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (IPM) ల్యాబ్ నిర్ధారించింది. బాధితుల్లో ప.బెంగాల్‌కు చెందిన యువకుడు(23), టోలిచౌకికి చెందిన వృద్ధుడు(69), నిజామాబాద్(D) పిట్లంకు చెందిన వ్యక్తి(40), హైదర్ నగర్ డివిజన్‌కు చెందిన మహిళ(51) ఉన్నట్లు తెలిపింది. ఝార్ఖండ్ నుంచి HYDలోని ఓ ఆస్పత్రికి తీసుకొచ్చిన వృద్ధురాలికి కూడా వ్యాధి నిర్ధారణ అయింది.
AP: విజయవాడ వరదల్లో నష్టపోయిన బాధితులు తమకు ఏమీ మిగల్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీవీ, ఫ్రిజ్, ఫ్యాన్లు, గ్రైండర్లు.. ఇలా అన్ని వస్తువులు పాడైపోయాయని కన్నీరు పెట్టుకుంటున్నారు. చాలా వరకు EMIలోనే కొన్నామని, రూ.50వేల నుంచి రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. మళ్లీ సున్నా నుంచి జీవితం మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.