India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో ఇటీవల 300 మందికి జుట్టు రాలిపోయి చూస్తుండగానే బట్టతల వచ్చింది. దీంతో ప్రముఖ వైద్యుడు హిమ్మత్ రావ్ బవాస్కర్ రీసెర్చ్ చేసి, రొట్టెల తయారీకి వాడుతున్న గోధుమపిండిలో సిలీనియం అధికస్థాయిలో ఉండటమే బట్టతలకు కారణమని తేల్చారు. పంజాబ్, హరియాణాల నుంచి వచ్చిన పిండి బుల్ధానాలో రేషన్ షాపుల ద్వారా పంపిణీ అయింది. ఆ రాష్ట్రాల్లోని పర్వత శ్రేణుల్లో సిలీనియం అధికంగా ఉంటుంది.

CTలో ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చిన అఫ్గాన్ జట్టు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జొనాథన్ ట్రాట్ కావడం గమనార్హం. 2022లో ఆయన అఫ్గాన్ హెడ్ కోచ్‌గా వచ్చారు. ఆయన నేతృత్వంలోని జట్టు 2023 వన్డే WCలో PAK, ENGకు షాక్ ఇచ్చి, SL, నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. తర్వాత BANపై తొలిసారి వన్డే సిరీస్‌ను, PAKపై T20 సిరీస్‌ను గెలుచుకుంది. ఇప్పుడు CTలోనూ ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైంది. తెల్లవారుజామున 2.25 గంటలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. కాగా మంగళవారం కోల్‌కతా, ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలోని బంగాళాఖాతంలో, బుధవారం ఇండోనేషియాలోని సులవేసి ప్రావిన్స్‌లో భూకంపం వచ్చింది.

CTలో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించిన అఫ్గాన్ టీమ్‌పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ జట్టు ఎదుగుతున్న తీరు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వారు అనుకోకుండా గెలిచారని ఇకపై ఎవరూ భావించొద్దన్నారు. అఫ్గాన్ కుర్రాళ్లు గెలుపులను అలవాటుగా మార్చుకున్నారని తెలిపారు. ఈ మ్యాచ్‌లో భారీ సెంచరీ చేసిన జద్రాన్, 5 వికెట్లు తీసిన ఒమర్‌జాయ్‌ని ప్రత్యేకంగా అభినందించారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గాన్ చేతిలో ఓడిన ఇంగ్లండ్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం తన కెప్టెన్సీపై జోస్ బట్లర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఇప్పుడు ఎలాంటి ఎమోషనల్ స్టేట్‌మెంట్ ఇవ్వదలుచుకోలేదు. కానీ మిగతా జట్టు సభ్యుల కోసం నేను అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. దీంతో త్వరలో బట్లర్ వన్డే కెప్టెన్సీకి రాజీనామా చేయనున్నాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సా.4 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. TGలో ఉమ్మడి MDK-NZB-ADB-KNR గ్రాడ్యుయేట్, టీచర్, ఉమ్మడి WGL-KMM-NLGలో టీచర్ MLC స్థానాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అటు APలో ఉమ్మడి గుంటూరు-కృష్ణా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జునుడి కళ్యాణం కనుల పండువగా సాగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, వేలాదిగా తరలివచ్చిన భక్తుల శివనామ స్మరణ, మంగళవాయిద్యాల మధ్య ఆ మల్లికార్జునుడు బ్రమరాంభ అమ్మవారి మెడలో మూడుముళ్లు వేశారు. అనంతరం పండితులు స్వామి, అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలు పోశారు. ఈ వేడుకను చూసి భక్తులు తరించారు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సీజన్‌లో ఇప్పటివరకు 11 సెంచరీలు నమోదయ్యాయి. ఒక సీజన్‌లో అన్ని జట్లు కలిపి చేసిన అత్యధిక సెంచరీలు ఇవే. గతంలో 2002, 2017లో 10 శతకాలు నమోదయ్యాయి. ఈ రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. 2006లో 7, 2000, 2009లో 6, 1998, 2004లో 4, 2013లో 3 శతకాలు నమోదయ్యాయి. కాగా ఇవాళ జరిగిన ఇంగ్లండ్-అఫ్గానిస్థాన్ మ్యాచులో 2 సెంచరీలు వచ్చాయి. జో రూట్, ఇబ్రహీం జద్రాన్ శతకాలు బాదారు.

* 1931- స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ అజాద్ మరణం(ఫొటోలో)
* 1956- లోక్‌సభ తొలి స్పీకర్ జి.వి.మావలాంకర్ మరణం
* 1972- సినీ నటుడు శివాజీ రాజా పుట్టినరోజు
* 2002- సబర్మతి ఎక్స్‌ప్రెస్ దహనం, 59 మంది VHP కరసేవకులు మృతి

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
Sorry, no posts matched your criteria.