News September 3, 2024

రాష్ట్రంలో 193 పునరావాస కేంద్రాలు

image

AP: వరద బాధితుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 193 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో 42,707 మందికి షెల్టర్ కల్పించనుంది. అలాగే 194 మెడికల్ క్యాంపుల ద్వారా ఆరోగ్య సేవలు అందించనుంది. కాగా వరదల ధాటికి రాష్ట్రంలోని రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. 2,851 కి.మీ ఆర్అండ్‌బీ, 221 కి.మీ పంచాయతీరాజ్, 308 కి.మీ మున్సిపల్ రోడ్లు ధ్వంసమయ్యాయి.

News September 3, 2024

ఆరు సీట్లు ఆఫ‌ర్ చేసిన కాంగ్రెస్‌!

image

హ‌రియాణా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆప్‌తో పొత్తుకు సిద్ధ‌ప‌డిన కాంగ్రెస్ ఆ పార్టీకి 6 సీట్లు ఆఫ‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది. పొత్తు విష‌య‌మై రాహుల్ గాంధీ సుముఖంగా ఉండ‌డంతో ఈ విష‌య‌మై కాంగ్రెస్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్‌తో ఆప్ ఎంపీ రాఘవ్ చ‌డ్డా స‌మాలోచ‌న‌లు జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా 90 అసెంబ్లీ సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ 10 సీట్లు కోరగా, కాంగ్రెస్ 6 సీట్లు ఆఫ‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

News September 3, 2024

తుంగభద్ర ప్రాజెక్టు దిగువ ప్రజలకు వరద హెచ్చరికలు

image

కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు దిగువ ప్రజలకు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. ఎగువ నుంచి భారీగా నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. రేపు ఉదయం డ్యామ్ నుంచి 50 వేల క్కూసెక్కులకు పైగా నీటిని కిందికి రిలీజ్ చేస్తామన్నారు. దీంతో పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు.

News September 3, 2024

వరద బాధితులకు విరాళం ఇవ్వొచ్చు: ప్రభుత్వం

image

AP: భారీ వర్షాలతో విజయవాడ నగరం అతలాకుతలం కాగా, వరద బాధితులకు విరాళాలు ఇచ్చే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సీఎం సహాయనిధికి ఆన్‌లైన్‌లో విరాళాలు పంపవచ్చని పేర్కొంది. వెలగపూడి SBI బ్రాంచ్ 38588079208, యూనియన్ బ్యాంక్ 110310100029039 నంబర్‌లకు ఆన్‌లైన్‌లో సాయం చేయవచ్చని పేర్కొంది.

News September 3, 2024

తెలుగు రాష్ట్రాలకు మహేశ్ బాబు రూ.కోటి విరాళం

image

తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు సూపర్‌స్టార్ మహేశ్ బాబు రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించారు. ఇరు రాష్ట్రాలకు చెరొక రూ.50 లక్షల సాయం చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు హీరోయిన్ అనన్య నాగళ్ల రెండు రాష్ట్రాలకు కలిపి రూ.5 లక్షల సాయం అందించారు.

News September 3, 2024

ఆన్‌లైన్‌లో డెబిట్ కార్డు వివరాలు.. పండగ చేసుకున్న నెటిజన్లు

image

‘బోల్డ్ కేర్’ కో ఫౌండర్ రాహుల్ కృష్ణన్ నెటిజన్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తన డెబిట్ కార్డు వివరాలు ఎక్స్‌లో పోస్ట్ చేసి రూ.వెయ్యిలోపు ఏమైనా కొనుగోలు చేయొచ్చని ప్రకటించారు. దీంతో ఆ కార్డు వివరాలతో నెటిజన్లు కొనుగోళ్లు చేశారు. ఇందుకు సంబంధించిన ఓటీపీలను కూడా ఆయన ఎక్స్‌లోనే షేర్ చేశారు. 200 మందికిపైగా ఈ కార్డును ఉపయోగించారు. ఎక్కువగా స్విగ్గీ, జొమాటో, అమెజాన్, బ్లింకిట్‌ నుంచి ఆర్డర్లు తీసుకున్నారు.

News September 3, 2024

వరద బాధితులకు పవన్ రూ.కోటి విరాళం

image

AP: వరద బాధితులకు dy.CM పవన్ కళ్యాణ్ రూ.కోటి విరాళం ప్రకటించారు. వరద తీవ్రత, సహాయక చర్యలపై ఆయన రాష్ట్ర విపత్తుల కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ‘గత ప్రభుత్వం ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించింది. అందుకే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆర్మీ సహకారంతో బాధితులకు సాయం అందిస్తున్నాం. బుడమేరు నిర్వహణ సక్రమంగా లేక వరద పోటెత్తింది. మరికొంత వరద వచ్చుంటే పెను ప్రమాదం జరిగి ఉండేది’ అని ఆయన పేర్కొన్నారు.

News September 3, 2024

‘అపరాజిత’ బిల్లు గురించి తెలుసా?

image

అత్యాచారాలు, లైంగిక నేరాలకు వ్యతిరేకంగా చట్టాలను పటిష్ఠం చేసేందుకు బెంగాల్ ప్రభుత్వం ‘అపరాజిత’ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లును బెంగాల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. హ‌త్యాచార బాధితురాలి జ్ఞాప‌కార్థం బిల్లును అంకిత‌మిస్తూ ఇదొక చరిత్రాత్మ‌క బిల్లుగా CM మ‌మ‌త‌ అభివ‌ర్ణించారు. హత్యాచార ఘటనల్లో 21 రోజుల్లో మరణ శిక్షలు అమలు చేసేలా ఇప్పటికే ఉన్న కేంద్ర చట్టాలను పటిష్ఠ పరిచినట్లు తెలిపారు.

News September 3, 2024

తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. యూజర్లకు ఎయిర్‌టెల్ ఆఫర్

image

తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో వినియోగదారులకు టెలికం సంస్థ ఎయిర్‌టెల్ ఆఫర్ ప్రకటించింది. ఇంకా రీఛార్జ్ చేసుకోని ప్రీపెయిడ్ యూజర్లకు అదనంగా 4 రోజులపాటు కాలింగ్ సదుపాయం కల్పించింది. అదే సమయంలో రోజుకు 1.5GB ఉచిత డేటాను అందిస్తోంది. పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు బిల్లు చెల్లింపు గడువు వారం పాటు పెంచింది. ఇళ్లలో వైఫై కనెక్షన్లకు 4 రోజుల అదనపు వాలిడిటీ ఇచ్చింది.

News September 3, 2024

BREAKING: భారీగా తహశీల్దార్ల బదిలీ

image

TG: రాష్ట్రంలో 76 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీ జోన్1లో 37 మంది, మల్టీజోన్ 2లో 39 మందిని ట్రాన్స్‌ఫర్ చేసింది.