India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తాను విడాకులు తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధాలని నటుడు ఆది పినిశెట్టి అన్నారు. తాము సంతోషంగా జీవిస్తుంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తమ స్వార్థం కోసం విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హీరోయిన్ నిక్కీ గల్రానీని 2022లో ఆది ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన నటించిన ‘శబ్దం’ ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో చిత్రబృందం పాల్గొంది.

కాంగో దేశాన్ని ఓ వింత వ్యాధి 5 వారాలుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావంతో ప్రజలు చచ్చిపోతున్నారు. ఈ లక్షణాలు ఎబోలా, డెంగ్యూ, మార్‌బర్గ్, యెల్లో ఫీవర్‌ను పోలివుండటంతో WHO సైతం ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని రోజుల క్రితం బొలొకొ గ్రామంలో గబ్బిలాలను తిన్న ముగ్గురు పిల్లలు 48 గంటల్లోపే చనిపోవడంతో ఔట్‌బ్రేక్ మొదలైంది. 419 మందికి సోకింది. 53 మందిని చంపేసింది.

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ అంటే తనకు ప్రాణమని తాను బతికేదే ఆటకోసమని అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫిలో ఇండియా సెమీస్ చేరటంపై రోహిత్ సంతోషం వ్యక్తం చేశారు. కోహ్లీ అంటే తనకెంతో ఇష్టమని.. ఇండియా విజయం కోసం అతను దేనికైనా సిద్ధంగా ఉంటాడని తెలిపారు. ప్రస్తుతం కప్పు గెలవటం పైనే తన పూర్తి ఫోకస్ ఉందని హిట్‌మ్యాన్ వివరించారు.

జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే TNతో పాటు దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్న ఆ రాష్ట్ర CM స్టాలిన్ వ్యాఖ్యలను KTR సమర్థించారు. దేశానికి అవసరమైనప్పుడు ఈ రాష్ట్రాలే కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయని చెప్పారు. దేశాభివృద్ధిలో వీటి కృషిని గుర్తించకపోతే ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుందన్నారు. దేశానికి ఆర్థిక తోడ్పాటు అందించే రాష్ట్రాల ఆధారంగా పునర్విభజన జరగాలని డిమాండ్ చేశారు.

వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామని సినీ నటుడు, టీవీకే చీఫ్ దళపతి విజయ్ ధీమా వ్యక్తం చేశారు. మహాబలిపురంలో టీవీకే పార్టీ మహానాడులో ఆయన మాట్లాడారు. 2026 ఎన్నికల్లో చరిత్ర తిరగరాస్తామని చెప్పారు. పెత్తందార్లు, భూస్వాములు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచి సామాన్యులకు రాజ్యాధికారం కల్పిస్తామన్నారు. త్వరలోనే పార్టీలోకి కీలక నేతల చేరికలు ఉంటాయని తెలిపారు.

TG: సిరిసిల్లలో విషాదం చోటుచేసుకుంది. ధర్మారానికి చెందిన రాకేశ్(19) HYDలో చదువుకుంటున్నాడు. 3 రోజుల క్రితం తల్లిదండ్రులకు కాల్ చేసి తనకు చదువు అంటే ఇష్టం లేదని చెప్పాడు. ఇంటికి రమ్మనగా బయలుదేరాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రాగా పోలీసులకు ఫిర్యాదు చేయగా కాచిగూడలో సూసైడ్ చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ‘అమ్మానాన్న క్షమించండి.. యముడు పిలుస్తున్నాడు.. నేను వెళ్తున్నా.. బై.. బై..’ అని లేఖలో పేర్కొన్నాడు.

అన్ని రకాల యుద్ధాలు చేయగల ఆధునిక, బలమైన ఆర్మీని నిర్మించాల్సి ఉందని నార్త్ కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అన్నారు. మిలిటరీ అకాడమీ, పొలిటికల్ కాలేజీని సందర్శించాక మాట్లాడారు. ‘ఐడియాలజీ లేని ఆయుధాలు జస్ట్ ఇనుప రాడ్లతో సమానం. ఇప్పుడు అధునాతన వ్యవస్థలు అవసరం. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు మారిపోయాయి. చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఇంపీరియలిస్టులు దూకుడుగా యుద్ధాలకు పిలుపునిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

మహా శివరాత్రి సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెటర్ లిట్టన్ దాస్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. బంగ్లాదేశ్ హిందూ ఫ్యామిలీకి చెందిన ఆయన ఓ ఆలయంలో ఉన్న శివ లింగాలకు స్వయంగా అభిషేకం చేసిన ఫొటోలు షేర్ చేశారు. ఇటీవల బంగ్లాలో హిందువులపై జరిగిన దాడుల్లో ఆందోళనకారులు లిట్టన్ ఇంటిని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆలయానికి వెళ్లి పూజలు చేసి ట్వీట్ చేయడంపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి.

ఎత్తైన పర్వతం ఎవరెస్ట్‌ను సైతం అధిరోహిస్తున్నప్పటికీ అంతకంటే తక్కువ ఎత్తులో ఉన్న కైలాస పర్వతంపైకి ఎవ్వరూ వెళ్లలేకపోతున్నారు. ఈ రహస్యం ఇప్పటికీ వీడని మిస్టరీగా మారిపోయింది. ఇతర పర్వతాల మాదిరిగా కాకుండా అక్కడ 12 గంటలుంటే బయట 2 వారాలు గడిపినట్లేనని, వెంట్రుకలు, గోర్లు వేగంగా పెరుగుతాయని పర్వతారోహకులు చెబుతున్నారు. కాగా కైలాసనాథుడు తన భార్య పార్వతి, వాహనం నందితో కలిసి శాశ్వత ధ్యానంలో ఉంటారని ప్రతీతి.

TG: శివరాత్రి పర్వదినాన వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను రేవంత్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఎన్నికల కోడ్ అమలులో లేని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసి రైతుల ఖాతాల్లో రూ.6 వేల చొప్పున నగదు జమచేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 83,420 మందికి రూ.50.65 కోట్లు చెల్లించింది. మొదటి విడతలో 18,180 మందికి డబ్బులు జమ చేయగా ఆ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది.
Sorry, no posts matched your criteria.