India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రధాని నరేంద్రమోదీ త్వరలో రష్యాకు వెళ్తారని తెలిసింది. మే9న మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా వస్తారని అక్కడి మీడియా అంచనా వేసింది. గ్రేట్ పేట్రియాటిక్ వార్ 80వ వార్షికోత్సవం సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్ ఆయన్ను ఆహ్వానించారని పేర్కొంది. కొన్ని రోజుల క్రితమే అమెరికా ప్రెసిడెంట్‌ను మోదీ కలిశారు. ఇప్పుడు పుతిన్‌ను కలవనున్నారన్న వార్త ప్రాధాన్యం సంతరించుకుంది.

TDC/TCS డిఫాల్టర్లపై ఉక్కుపాదం మోపేందుకు ఆదాయపన్ను శాఖ సిద్ధమైనట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా 40,000 ట్యాక్స్ పేయర్లకు నోటీసులు పంపించాలని భావిస్తున్నట్టు సమాచారం. FY22-23, FY23-24లో TDC/TCS కత్తిరించని సంస్థలు, వ్యక్తులను గుర్తించింది. కొన్ని నెలలుగా వీరిపై నిఘా ఉంచింది. త్వరలోనే వీరికి నోటీసులు పంపించి భారీగా జరిమానాలు విధించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ ఇండియాలో మోస్ట్ పవర్‌ఫుల్ పర్సన్. ఆయనకు సోషల్ మీడియాలోనూ కోట్లాది మంది ఫాలోవర్లున్నారు. ఇన్‌స్టాలో 92.3 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 50 మిలియన్లు, Xలో 105.5 మిలియన్ల ఫాలోవర్లు ఆయన సొంతం. అలాంటి అకౌంట్స్ ఒక్కరోజు మీ సొంతమైతే ఏం చేస్తారు? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న కొంతమంది స్ఫూర్తిదాయకమైన మహిళలకు ఈ ఖాతాలు అందించనున్నారు. వారి అనుభవాలను ఇందులో పంచుకుంటారు.

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘ఆదిత్య 369’ మళ్లీ థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. 1991లో విడుదలైన ఈ చిత్రం రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ సమ్మర్‌లో ఈ మూవీని రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటన చేశారు. కాగా, ‘ఆదిత్య 369’కు సీక్వెల్ తీయనున్నట్లు ఇప్పటికే బాలయ్య ప్రకటించారు.

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్‌కు చెందిన 21మంది ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఫెడరల్ ఉద్యోగుల తొలగింపులో తాము భాగస్వామ్యం కాలేమని తెలిపారు. డోజ్‌లో రాజకీయ ఉద్దేశ్యాలున్న వారే అధికంగా ఉన్నారని వారికి ఉద్యోగం చేయడానికి కావాల్సిన నైపుణ్యాలు లేవని ఆరోపించారు. ఈ రాజీనామాలతో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్న మస్క్, ట్రంప్ ద్వయానికి షాక్ తగిలిందని అంతా భావిస్తున్నారు.

మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్(49) పెళ్లిపై మనసులోని మాటను బయటపెట్టారు. తనకు పెళ్లి చేసుకోవాలని ఉందన్నారు. అయితే అది ఈజీగా జరిగే ప్రక్రియ కాదన్నారు. అది రొమాంటిక్‌గా, 2 హృదయాల కలయిక వల్ల జరుగుతుందని చెప్పారు. అలా అనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటానని తెలిపారు. నటుడు రొహ్మన్ షాల్‌తో సుస్మిత 3ఏళ్లు డేటింగ్ చేసి 2021లో విడిపోయారు. ఆ తర్వాత లలిత్ మోదీతో లవ్‌లో ఉన్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.

TG: ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ ముగిసింది. దాదాపు గంట పాటు ఈ సమావేశం సాగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు అనుమతి తదితర అంశాలపై ఆయన చర్చించినట్లు సమాచారం. SLBC సహాయక చర్యలను ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది.

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుత రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను లుధియానా వెస్ట్ అసెంబ్లీ నుంచి బరిలోకి దించారు. దీంతో ఎంపీ స్థానం ఖాళీ కావడంతో కేజ్రీవాల్ దాన్ని భర్తీ చేయొచ్చని వార్తలు వస్తున్నాయి.

1.సోమనాథ్ (గుజరాత్) , 2.మల్లికార్జున (శ్రీశైలం), 3.మహాకాళ ( మధ్యప్రదేశ్) ,4. ఓంకారేశ్వర (మధ్యప్రదేశ్), 5.వైద్యనాథ్ (ఝార్ఖండ్), 6.భీమశంకర (మహారాష్ట్ర), 7. రామేశ్వరం (తమిళనాడు), 8.నాగేశ్వర (గుజరాత్),9. విశ్వేశ్వర (ఉత్తరప్రదేశ్), 10.త్రయంబకేశ్వర్ (మహారాష్ట్ర),11. కేదార్‌నాథ్ (ఉత్తరాఖండ్) 12. ఘృష్ణేశ్వరం (మహారాష్ట్ర)

బాలీవుడ్ నటుడు గోవింద విడాకులు తీసుకోబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన సన్నిహితులు స్పందించారు. భార్య సునీతతో గోవిందకు అభిప్రాయభేదాలు ఉన్నాయని, అయితే అవి విడాకులు తీసుకునేంత పెద్దవి కాదని ఆయన మేనేజర్ చెప్పారు. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. విడాకుల వార్తలన్నీ అవాస్తవమని గోవింద మేనకోడలు ఆర్తిసింగ్ స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం మానుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.