India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చిలగడదుంప లేనిదే శివరాత్రి గడవదు. ఈ రోజు ప్రతి ఇంట్లో ఈ దుంప కనిపిస్తుంది. ఉపవాసం ఉన్నవారు వీటిని ఉడకబెట్టుకొని తింటారు. ఇందులో ఫైబర్, పొటాషియం, ఐరన్, స్టార్చ్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తింటే కంటిచూపు మెరుగవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కడుపు నిండుగా ఉన్న ఫీల్ కలుగుతుంది. దీనివల్ల బరువు తగ్గే అవకాశం ఉంది. శివరాత్రి నాడే కాకుండా ప్రతిరోజు తీసుకుంటే ఎంతో మేలని వైద్యులు చెబుతారు.

TG: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవ కేంద్రాల ద్వారా 1.50 లక్షల అప్లికేషన్లు వచ్చాయని సివిల్ సప్లయ్స్ అధికారులు తెలిపారు. GHMC పరిధిలోనే లక్ష దాటాయన్నారు. కులగణన సర్వే, గతంలో వచ్చిన అప్లికేషన్లు అన్నీ కలిపి ఈ సంఖ్య 10 లక్షలకు చేరినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల మార్పుల కోసం 20 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని సమాచారం. మార్చి 1న లక్ష కొత్త కార్డులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

TG: కులగణన రీసర్వేకు ప్రభుత్వం అవకాశం కల్పించినా చాలా కుటుంబాలు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండోసారి సర్వేలో 3,56,323 కుటుంబాల వివరాలు సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకు 8,422 కుటుంబాలే ఎంట్రీ చేయించుకున్నాయి. రీసర్వేకు ఎల్లుండితో గడువు ముగియనుంది. సర్వేలో పాల్గొనాలనుకునేవారు ఉ.9 గంటల నుంచి సా.5 గంటల వరకు 040 21111111 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి. MPDO ఆఫీసుల్లోనూ వివరాలు ఇవ్వొచ్చు.

పరమశివుడికి ఇష్టమైన మహా శివరాత్రి రోజున భక్తులు అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణ చేస్తారు. అయితే ఇవాళ అనారోగ్యం, నీరసంతో ఉన్నవారు, డయోబెటిస్ వ్యాధిగ్రస్థులు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, చిన్న పిల్లలు చేయకపోవడమే ఉత్తమమని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి వారు మహాశివరాత్రి రోజున శివనామ స్మరణ, ప్రవచనాలు వింటూ ఉండొచ్చని సూచిస్తున్నారు.

TG: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 24 జిల్లాల్లో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు మంజూరు చేసింది. పోలింగ్ ఉండటంతో ఈ నెల 27న, కౌంటింగ్ జరిగే మార్చి 3న సెలవులు వర్తించనున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. కాగా ఉమ్మడి మెదక్-కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీతో పాటు నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల్లో టీచర్ MLC ఎన్నికలు జరగనున్నాయి.

CT-2025లో ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. గెలిస్తేనే సెమీస్ అవకాశాలు ఉండటంతో ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ సాగనుంది. గ్రూపు-Bలోని ఆసీస్, సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌లలో గెలవగా, నిన్నటి మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయి 3 పాయింట్లతో సమంగా ఉన్నాయి. మరోవైపు ఇంగ్లండ్, అఫ్గాన్ ఓటమితో లీగ్ ప్రారంభించాయి. దీంతో నేడు గెలిచిన జట్టు 2PTSతో సెమీస్ రేసులో నిలుస్తుంది. ఓడితే ఇంటిబాట పట్టాలి.

దేశంలో ఐటీ, దాని అనుబంధ రంగాల్లో 54 లక్షల మంది పని చేస్తుండగా 80% మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. మరో 71% మందిని ఊబకాయం సమస్య వేధిస్తోంది. 34% మంది షుగర్, బీపీ తదితర సమస్యల బారిన పడే ప్రమాదంలో ఉన్నారని HYD సెంట్రల్ వర్సిటీ స్కాలర్లు, ఓ ప్రైవేట్ ఆస్పత్రి చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఒత్తిడి, పనివేళలు, ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం, నిద్రలేమి పై అనారోగ్య సమస్యలకు కారణాలుగా గుర్తించారు.

ఇండోనేషియాలోని సులవేసి ప్రావిన్స్‌లో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉ.6.55 గంటలకు 6.1 తీవ్రతతో భూమి కంపించింది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని జకర్తా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 2018లో సులవేసిలో భారీ భూకంపంతో 2,200 మంది, 2021 జనవరిలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు నిన్న కోల్‌కతా, ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలోని బంగాళాఖాతంలో భూకంపం వచ్చింది.

2024-25 సీజన్ రంజీ ట్రోఫీ ఫైనల్ నేటి నుంచి ప్రారంభం కానుంది. క్వార్టర్స్‌లో ఒకటి, సెమీస్‌లో 2 రన్స్ ఫస్ట్ ING లీడ్‌తో అనూహ్యంగా తొలిసారి ఫైనల్ చేరిన కేరళ, 2సార్లు టైటిల్ విన్నర్ విదర్భ జట్లు తుదిపోరులో తలపడనున్నాయి. అక్షయ్ వాడ్కర్(C), కరుణ్ నాయర్, మాలేవర్‌లతో విదర్భ బ్యాటింగ్ బలంగా ఉంది. అటు, సచిన్ బేబీ నేతృత్వంలోని కేరళ బ్యాటర్లు నిజార్, అజహరుద్దీన్, బౌలర్ జలజ్ సక్సేనాలపై ఆశలు పెట్టుకుంది.

AP: అహ్మదాబాద్ మాదిరి అమరావతిలోనూ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. దీనికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) అంగీకారం తెలిపిందని చెప్పారు. ఇటీవల భారత్-పాక్ మ్యాచ్ కోసం తాను దుబాయ్ వెళ్లానని, ఆ సమయంలో మన జట్టుకు సపోర్ట్ చేయడంతో పాటు స్టేడియం నిర్మాణం, సీటింగ్ తదితరాలను పరిశీలించి జైషాతో మాట్లాడానన్నారు. దీనిపై కూడా YCP వాళ్లు తనను ట్రోల్ చేశారని వివరించారు.
Sorry, no posts matched your criteria.