News February 25, 2025

రోహిత్‌ను డిన్నర్ పార్టీ అడుగుతా: అక్షర్

image

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రోహిత్ క్యాచ్ డ్రాప్ చేసి అక్షర్ హ్యాట్రిక్ మిస్ చేశారు. దీంతో డిన్నర్‌కు <<15528906>>తీసుకెళ్తానంటూ<<>> హిట్ మ్యాన్ ఇచ్చిన ఆఫర్‌పై ఆల్‌రౌండర్ స్పందించారు. ‘టీమ్ ఇప్పటికే సెమీస్‌కు క్వాలిఫై అయ్యింది. పైగా కివీస్‌తో తర్వాతి మ్యాచ్‌కు ఆరు రోజుల సమయం ఉంది. రోహిత్‌ను డిన్నర్ పార్టీ అడగడానికి ఛాన్స్ వచ్చింది’ అని పేర్కొన్నారు.

News February 25, 2025

ఆ స్కూళ్లలో తెలుగు తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు

image

TG: సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ బోధించే స్కూళ్లలో తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. సింగిడి(స్టాండర్డ్ తెలుగు) స్థానంలో సులభతర తెలుగు వాచకం ‘వెన్నెల’ను 9, 10వ తరగతుల్లో బోధించాలని స్పష్టం చేసింది. 1-10 క్లాసుల వరకు తెలుగు బోధన, పరీక్షలు నిర్వహించాలని ఆయా బోర్డులను ఆదేశించింది. గత ప్రభుత్వం తెలుగును పూర్తిస్థాయిలో అమలు చేయలేదని పేర్కొంది.

News February 25, 2025

పట్టాలెక్కనున్న రవితేజ ‘డబుల్ ధమాకా’?

image

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ‘ధమాకా’ 2022లో విడుదలై రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘డబుల్ ధమాకా’ తెరకెక్కనున్నట్లు సమాచారం. దర్శకుడు త్రినాథరావు ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేశారని, మాస్ మహారాజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని వార్తలు వస్తున్నాయి.

News February 25, 2025

త్రిమూర్తులు ఉన్న క్షేత్రం త్రయంబకేశ్వరం

image

ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహారాష్ట్ర నాసిక్ <<15541576>>త్రయంబకేశ్వరం <<>>10వది. గౌతమ మహర్షి తపస్సుకు మెచ్చిన శివుడు, ఆదిపరాశక్తితో పాటు బ్రహ్మ, విష్ణు సమేతంగా ప్రత్యక్షమవుతారు. గంగ ప్రవహించేలా చేయమని ముని కోరటంతో తన జటాజూటాన్ని విసరగా అది బ్రహ్మగిరి పర్వతంపై పడి ప్రవాహంగా వచ్చిందనేది స్థలపురాణం. ఆదిపరాశక్తి, త్రిమూర్తులు స్వయంభువుగా వెలియడంతో జ్యోతిర్లింగంగా మారింది. త్రిమూర్తులు ఒకేచోట లింగం రూపంలో ఉంటారు.

News February 25, 2025

ఎమ్మెల్యేల కోసం అసెంబ్లీలో రిక్లైనర్లు.. కారణమిదే!

image

కర్ణాటక అసెంబ్లీ లాబీలో MLAలు రెస్ట్ తీసుకునేందుకు రిక్లైనర్లను ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ ఖాదర్ వెల్లడించారు. లంచ్ తర్వాత రెస్ట్ కోసం MLAలు సభకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటి ఏర్పాటు వల్ల వారికి కాస్త విశ్రాంతి దొరికి ఫ్రెష్‌గా ఉంటారని, హాజరు కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. MAR 3-21 వరకు సమావేశాలు జరగనుండగా, 15 రిక్లైనర్లను అద్దెకు తీసుకుంటామని స్పీకర్ పేర్కొన్నారు.

News February 25, 2025

అవి కేరళ చరిత్రలోనే అత్యంత క్రూరమైన హత్యలు: పోలీసులు

image

కేరళ తిరువనంతపురంలో యువకుడు అఫాన్(23) ఐదుగురు కుటుంబీకులను చంపిన <<15571171>>ఘటనలో<<>> దారుణ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘బాబాయ్ లతీఫ్ తలపై 20సార్లు సుత్తితో బాదాడు. ప్రియురాలు ఫర్జానా, పిన్ని సుజాత, తల్లి, తమ్ముడిని ఇలాగే హతమార్చాడు. వారి ముఖాలు గుర్తుపట్టలేని విధంగా మారాయి. 3ఇళ్లలో భయానక దృశ్యాలు కనిపించాయి. కేరళ చరిత్రలోనే ఈ హత్యలు అత్యంత క్రూరమైనవి’ అని పోలీసులు తెలిపారు.

News February 25, 2025

నీటి వినియోగం తగ్గించాలని APకి KRMB ఆదేశం

image

హైదరాబాద్‌లో నిన్న జరిగిన సమావేశంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీశైలం నుంచి నీటి వినియోగం తక్షణమే తగ్గించాలని, కేవలం తాగునీరే తీసుకోవాలని ఏపీని ఆదేశించింది. సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ తీసుకునే నీరు 7వేల క్యూసెక్కులకు తగ్గించాలని స్పష్టం చేసింది. అటు రేపు మరోసారి KRMB సమావేశం జరగనుండగా, ఇరు రాష్ట్రాలకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

News February 25, 2025

డయాబెటిస్ పేషెంట్స్ ఈ టిప్స్ ట్రై చేయండి

image

భోజనం తర్వాత షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండాలంటే నిపుణులు కొన్ని టిప్స్ సూచించారు.1.గ్లాస్ వేడి నీటిలో టేబుల్‌ స్పూన్ ఆపిల్ వెనిగర్‌ను వేసుకొని తాగండి. 2 చియా గింజలను నీటిలో నానబెట్టి తాగండి. 3. దోసకాయ ముక్కల్నినిమ్మరసంతో కలిపి తినండి 4.ఆకుకూరల సలాడ్ తీసుకోండి. 5. కొన్ని వాల్‌నట్స్, బాదం తినండి . 6 గ్లాసు నీటిలో దాల్చిన చెక్క నానబెట్టి తాగండి. వీటిని ఫాలో అయ్యి మీ డయాబెటిస్‌ కంట్రోల్ ఉంచుకోండి.

News February 25, 2025

ఏపీ అసెంబ్లీ వాయిదా

image

ఏపీ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై సుదీర్ఘంగా మాట్లాడారు. అనంతరం ఈ తీర్మానానికి ఆమోదం లభించినట్లు ప్రకటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆ తర్వాత ఫిబ్రవరి 28కి సభను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

News February 25, 2025

జీమెయిల్ లాగిన్‌కు త్వరలో క్యూఆర్ కోడ్ విధానం?

image

జీమెయిల్ లాగిన్‌కు సంబంధించి SMS కోడ్ స్థానంలో క్యూఆర్ కోడ్‌లను తీసుకురావాలని గూగుల్ యోచిస్తున్నట్లు సమాచారం. మెయిల్ సెక్యూరిటీ కోసం ప్రస్తుతం SMS బేస్డ్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను గూగుల్ అమలు చేస్తోంది. దీనితో పోలిస్తే క్యూఆర్ కోడ్ విధానం మరింత భద్రతనిస్తుందని సంస్థ భావిస్తోంది. ఈ కోడ్‌లను స్కాన్ చేయడానికి స్మార్ట్ ఫోన్లలోని కెమెరా యాప్‌‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.