News October 6, 2024

డీఎస్సీ సర్టిఫికెట్ పరిశీలన పూర్తి

image

TG: రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఒక్కో ఉద్యోగానికి 1:3 చొప్పున 25,924 మందిని వెరిఫికేషన్‌కు పిలవగా 24,466 మంది హాజరయ్యారు. మరోవైపు స్పెషల్ ఎడ్యుకేషన్ కోటాలో టీచర్ పోస్టులకు కొన్ని జిల్లాలో వెరిఫికేషన్ ప్రారంభం కాలేదు. కాగా డీఎస్సీ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ఈ నెల 9న LB స్టేడియంలో నియామక పత్రాలను సీఎం రేవంత్ అందజేయనున్నారు.

News October 6, 2024

ఐదో రోజు అట్ల బతుకమ్మ

image

TG: బతుకమ్మ పండగ నిర్వహించే తొమ్మిది రోజుల్లో రోజుకో విశిష్ఠత ఉంది. ఇవాళ ఐదో రోజును అట్ల బతుకమ్మగా పిలుస్తారు. నానబెట్టిన బియ్యాన్ని మర పట్టించి ఆ పిండితో అట్లు పోసి గౌరమ్మకు నైవేద్యం సమర్పిస్తారు. ఆడవాళ్లు వీటిని ఒకరికొకరు వాయినంగా ఇచ్చుకుంటారు. ఇవాళ బతుకమ్మను ఐదు వరుసల్లో వివిధ పూలతో చేస్తారు.

News October 6, 2024

నేడు లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ

image

నేడు విజయవాడ కనక దుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమివ్వనుంది. త్రిపురత్రయంలో రెండో శక్తి స్వరూపిణి ఈ అమ్మవారు. తల్లిని కొలిస్తే కష్టాలు తొలిగి, ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. మాత అనుగ్రహం పొందేందుకు ‘ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రేనమ:’ అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించాలని పండితులు చెబుతున్నారు.

News October 6, 2024

తొలి టీ20 నెగ్గేదెవరో?

image

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు భారత్ సిద్ధమైంది. నేడు గ్వాలియర్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. సూర్య కుమార్ నాయకత్వంలోని కుర్రాళ్లు బంగ్లా జట్టుపై ఎలాంటి ప్రదర్శన చేస్తారో అని ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 14 టీ20లు జరగ్గా భారత్ 13 విజయాలు సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్ ఒక మ్యాచులో గెలుపొందింది. కాగా గ్వాలియర్‌లో 14 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరగనుండటం గమనార్హం.

News October 6, 2024

నేటి నుంచి బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లు

image

TG: నేటి నుంచి బీఎస్సీ నర్సింగ్ 2024-25 అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 14 వరకు ఆన్‌లైన్‌లో <>దరఖాస్తు<<>> చేసుకోవాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ సూచించింది. ఈఏపీసెట్-2024 క్వాలిఫై అయిన వారిని మాత్రమే అర్హులుగా పేర్కొంది. వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి, మెరిట్ జాబితాను రిలీజ్ చేస్తామని తెలిపింది.

News October 6, 2024

హరియాణాలో మాదే అధికారం: సీఎం సైనీ

image

హరియాణాలో ఎగ్జిట్ పోల్స్ ప్రతికూలంగా ఉన్నప్పటికీ తిరిగి తామే అధికారంలోకి వస్తామని సీఎం నయబ్ సింగ్ సైనీ ధీమా వ్యక్తం చేశారు. పూర్తి మెజార్టీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. తాము అన్ని రంగాల్లో పనులు చేశామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించారని పేర్కొన్నారు. హరియాణాను వారసత్వం, ప్రాంతీయతత్వం నుంచి వేరు చేసినట్లు పేర్కొన్నారు. కాగా 90 స్థానాలకు ఈ నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

News October 6, 2024

తెలుగు ప్రేక్షకులని అగౌరవిస్తున్నారు: సినీ రచయిత

image

డబ్బింగ్ సినిమాలకు తెలుగు పేర్లు పెట్టకుండా విడుదల చేసి తెలుగు ప్రేక్షకులని అగౌరవిస్తున్నారని సినీ రచయిత అబ్బూరి రవి ట్వీట్ చేశారు. ఇతర భాషా చిత్రాల గొప్పదనాన్ని, కళాత్మకతని తాను గౌరవిస్తానని తెలిపారు. తెలుగుని గౌరవించని వారి చిత్రాలను చూసేందుకు డబ్బులు ఖర్చుచేయడం గొప్పతనమని తాను అనుకోవట్లేదన్నారు. కాగా రజినీ ‘వేట్టయాన్’ మూవీ అదే పేరుతో తెలుగులో రిలీజ్ కానుండటం చర్చనీయాంశంగా మారింది.

News October 6, 2024

నూలు డిపో ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు

image

TG: సిరిసిల్ల జిల్లా వేములవాడలో నూలు డిపో ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీని ద్వారా 30వేల మరమగ్గాల కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ నిర్ణయంపై నేతన్నలు హర్షం వ్యక్తం చేశారు.

News October 6, 2024

అక్టోబర్ 6: చరిత్రలో ఈరోజు

image

1892: ఆంగ్ల కవి అల్ఫ్రెడ్ టెన్నిసన్ మరణం
1932: భారత భౌతిక శాస్త్రవేత్త గణేశన్ వెంకటరామన్ జననం
1946: బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా జననం
1963: హైదరాబాద్‌లో నెహ్రూ జూపార్క్ ప్రారంభం
1967: తెలుగు సినీ దర్శకుడు సి.పుల్లయ్య మరణం

News October 6, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

error: Content is protected !!