India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను పంచుకున్నారు. భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కాగా వీరిద్దరి వివాహం 2018లో జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ అమ్మడు నటించిన ‘కల్కి’ మూవీ ఈ ఏడాది విడుదలవ్వగా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
TG: కొన్ని మీడియా ఛానెళ్లు ఏదో రాస్తున్నాయని ఖమ్మం జిల్లా మంత్రులు బాధపడొద్దని CM రేవంత్ రెడ్డి అన్నారు. ‘మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి అర్ధరాత్రి వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నారు. అది నేనూ చూశా. వాళ్లెవరో ఏదో రాశారని మీరు పట్టించుకోవాల్సిన పనిలేదు. నేను ఆశించినదాని కంటే ఎక్కువ ప్రజలకు పనిచేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’ అని ఖమ్మం ప్రెస్‌మీట్‌లో అన్నారు.
రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం ‘స్త్రీ2’. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 18 రోజుల్లోనే ఏకంగా రూ.502 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కల్కి(రూ.295 కోట్లు), ఫైటర్(రూ.215 కోట్లు), సైతాన్(రూ.151 కోట్లు) ఉన్నాయి.
తెలంగాణలోని 4 జిల్లాల్లో రేపు స్కూళ్లు, కాలేజీలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో
కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఖమ్మం జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అటు ఏపీలోని పల్నాడు, ఎన్టీఆర్, బాపట్ల, ప.గో, కృష్ణా, గుంటూరు జిల్లాలు, నెల్లూరులోని కొన్ని మండలాల్లో విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు.
TG: రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తినా మౌనంగా ఉన్న కేసీఆర్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా అవసరం లేదని భావిస్తున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు. ప్రజలకు కష్టం వచ్చినా ఆయన స్పందించరని విమర్శించారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ మంత్రులపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన ట్విటర్ ద్వారానే మాట్లాడుతారని సెటైర్లు వేశారు. విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వంతో కలిసి ప్రతిపక్షాలు పనిచేయాలని సూచించారు.
AP: వరద ఉద్ధృతితో నీట మునిగిన విజయవాడలో బాధితుల కోసం ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్లు అందుబాటులోకి తెచ్చింది. 8181960909, 0866-2424172, 0866-2575833, 18004256029 నంబర్లకు ఫోన్ చేసి తమ సమస్యలు తెలియజేయవచ్చని ప్రభుత్వం తెలిపింది. అటు వరద బాధితుల కోసం కృష్ణా జిల్లా వ్యాప్తంగా 81 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వరద ప్రాంతాల్లో కొన్నిచోట్ల డ్రోన్ ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నారు.
TG: భారీ వర్షాలు, వరదలకు పశువులు మరణిస్తే ఇచ్చే పరిహారం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాడి గేదెలు చనిపోతే ఒక్కో దానికి రూ.50వేలు, గొర్రెలు, మేకలకు రూ.5వేల చొప్పున ఇవ్వాలన్నారు. అలాగే పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి రూ.10వేల చొప్పున నష్ట పరిహారం ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. వెంటనే బాధిత కుటుంబాలకు సాయం అందించాలన్నారు.
TG: భారీ వర్షాలు, వరదలకు పలు ఘటనల్లో 16 మంది మరణించడం బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మానవ ప్రయత్నం ఎంత చేసినా ప్రకృతి విపత్తుతో భారీ నష్టం వాటిల్లినట్లు చెప్పారు. మంత్రి వర్గం, అధికారులు 48 గంటలుగా బాధిత ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షించారన్నారు. అంటురోగాలు ప్రబలే అవకాశం ఉండటంతో అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తాను కీళ్లనొప్పుల(ఆర్థరైటిస్)తో బాధపడుతున్నట్లు స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. 9 ఏళ్లకే కెరీర్‌ను ప్రారంభించిన తాను వచ్చే ఏడాదికి 35 ఏళ్లకు చేరుకుంటానని తెలిపారు. రిటైర్మెంట్ వల్ల తనపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా సైనా 2012 ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచారు.
TG: భారీ వర్షాలతో అతలాకుతలమైన ఖమ్మంలో 24 గంటల్లోగా పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని మంత్రులు ఉత్తమ్, పొంగులేటి వెల్లడించారు. ‘మున్నేరు పరీవాహక ప్రాంతంలో అతి తక్కువ సమయంలో 46 సెం.మీ వర్షం కురిసింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని నదులన్నీ ఉప్పొంగాయి. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపడతాం. ప్రభుత్వమే ఖమ్మంలో ఉంది. ప్రజలంతా ధైర్యంగా ఉండాలి’ అని భరోసా నింపారు.
Sorry, no posts matched your criteria.