India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారీ వర్షాలకు వరద ముంచెత్తడంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎవరికి ఫోన్ చేయాలో, తాము ప్రమాదంలో ఉన్నామని ఎలా తెలియజేయాలో తెలియక చాలా మంది భయబ్రాంతులకు గురయ్యారు. కానీ వారందరి పరిస్థితిని అధికారులకు సోషల్ మీడియా తెలియజేసింది. బాధితులు సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో NDRF, స్థానికులు ఎంతో మందిని కాపాడగలిగారు. దీంతోపాటు వారికి ఫోన్ చేసి పరిస్థితులను తెలుసుకుంటూ ఆహారాన్ని అందించారు.
ఆరోగ్య బీమాపై జీఎస్టీ ఎత్తేస్తే ప్రభుత్వానికి ఏటా రూ.3500 కోట్ల వరకు నష్టమని ఓ అధికారి తెలిపారు. సెప్టెంబర్ 9న కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంటే ఆదాయానికి కోత పడుతుందన్నారు. ప్రస్తుతం అన్ని రకాల బీమా ప్రీమియంపై 18% జీఎస్టీ వసూలు చేస్తున్నారు. దీంతో కనీసం జీవిత, ఆరోగ్య బీమాపై పన్ను ఎత్తేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం FM నిర్మలకు ఈ విషయమై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాశారు.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రవాహం మాత్రం కొనసాగుతోంది. ముఖ్యంగా ఏపీలో కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, తెలంగాణలో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. దీంతో ఆయా జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు ప్రకటించాలని పేరెంట్స్ కోరుతున్నారు. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరిచి ఉంటుందో తెలియదని, పిల్లలు ప్రమాదానికి గురికాకుండా సెలవు ఇవ్వడం మంచిదంటున్నారు. మీరేమంటారు?
TG: CM రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తం కావాలన్నారు. కలెక్టరేట్లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలన్నారు. అత్యవసర సేవల కోసం పోలీస్ బెటాలియన్లకు NDRF తరహా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు పరిహారం పెంచాలని, జాతీయ విపత్తుగా పరిగణించి తక్షణ సాయానికై కేంద్రానికి లేఖ రాయాలన్నారు.
ఒంటరిగా బైక్‌పై లెహ్‌కు వెళ్లిన ఓ యువకుడు ఆక్సిజన్ అందక మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నోయిడాలో పనిచేస్తున్న చిన్మయ్ శర్మ (27) ఆగస్టు 22న పర్యటనకు బయల్దేరారు. ఆరోగ్యం బాగాలేదని, తలనొప్పి వేధిస్తోందని 27న తల్లిదండ్రులకు చెప్పారు. ఊపిరి ఆడటం లేదని ఆ మరుసటి రోజు ఫోన్ చేశారు. హోటల్ మేనేజర్ ఆస్పత్రిలో చేర్పించినా ఫలితం లేకపోయింది. గురువారం తల్లిదండ్రులు రావడానికి ముందే ఆయన మరణించారు.
హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.270 తగ్గి రూ.72,770కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల పసిడి రూ.250 తగ్గి రూ.66,700కు చేరింది. అటు కేజీ వెండి ధర రూ.1000 తగ్గి రూ.91వేలు పలుకుతోంది.
AP: విజయవాడలో ప్రకాశం బ్యారేజీ రిటైనింగ్ వాల్ (రక్షణ గోడ)పై వైసీపీ, టీడీపీ విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. జగన్ కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే కృష్ణలంక వాసుల ప్రాణాలు నిలిచాయని వైసీపీ ట్వీట్ చేసింది. 2014లో రూ.164 కోట్లతో చంద్రబాబు ప్రభుత్వం 2.1 కి.మీ. రక్షణ గోడ నిర్మించిందని టీడీపీ కౌంటర్ ఇచ్చింది.
TG: రాష్ట్రవ్యాప్తంగా మరో 4 రోజులు వర్షాలు కొనసాగుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉదయం 8.30 గంటల వరకు నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు 40-50Kmph వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. పూర్తి జిల్లాల జాబితా కోసం పైన ఫొటోను చూడండి.
TG: వరద మృతుల కుటుంబాలకు పరిహారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వరద వల్ల మృతి చెందిన కుటుంబాలకు ఇప్పటివరకు రూ.4 లక్షల పరిహారం ఇస్తుండగా దాన్ని రూ.5 లక్షలకు పెంచారు. మరోవైపు ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల వరద పరిస్థితిని సీఎం సమీక్షిస్తున్నారు.
మమతా బెనర్జీ నేతృత్వంలోని TMC 3 ఛానళ్లను బాయ్‌కాట్ చేసింది. బెంగాల్ వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని TV9, ABP ఆనంద, రిపబ్లిక్ ఛానళ్లకు అధికార ప్రతినిధులను పంపొద్దని నిర్ణయించుకుంది. ఆయా ఛానళ్ల ప్రమోటర్లపై దర్యాప్తులు, ఈడీ కేసులు, ఢిల్లీ జమీందార్లను సంతోషపెట్టాల్సిన అవసరాన్ని గుర్తించామంది. ABP ఆనంద చర్చలో TMC ఎంపీ కాకోలి ఘోష్, BJP ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ గొడవ పెట్టుకోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
Sorry, no posts matched your criteria.