News September 2, 2024

మిస్ యూ నాన్న: YS జగన్

image

AP: దివంగత సీఎం, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా జగన్ ఆయనకు నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మతో కలిసి ప్రార్థనలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మిస్ యూ నాన్న అని రాసుకొచ్చారు.

News September 2, 2024

హసీనాను అప్పగిస్తారో లేదో భారత్ ఇష్టం: బంగ్లా

image

మాజీ ప్రధాని షేక్ హసీనాను తీసుకొచ్చి న్యాయస్థానంలో నిలబెట్టేందుకు అన్ని అవకాశాలను వాడుకుంటామని బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్ అన్నారు. ఆమెను అప్పగించాలా లేదా అన్నది భారత్ ఇష్టమని పేర్కొన్నారు. ‘మా న్యాయవ్యవస్థ కోరుకుంటే హసీనాను తప్పకుండా వెనక్కి రప్పిస్తాం. న్యాయ ప్రక్రియకు సంబంధించి భారత్‌తో బంగ్లాకు ఒప్పందం ఉంది. దీనిపై వదంతులు వ్యాప్తి చేయకపోవడమే మంచిది’ అని ఆయన వెల్లడించారు.

News September 2, 2024

హైడ్రా.. సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ సపోర్ట్!

image

TG: హైడ్రా కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి పల్లంరాజు సోదరుడికి చెందిన ORO స్పోర్ట్స్ కాంప్లెక్స్ హిమాయత్ సాగర్ FTLలో ఉందని హైడ్రా కూల్చేసింది. దీనిపై రాహుల్ గాంధీ వద్ద పల్లంరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే రాహుల్ మాత్రం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.

News September 2, 2024

పవన్ కళ్యాణ్‌కు అమిత్ షా విషెస్

image

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ అంకితభావంతో కూడిన సేవ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఎంతగానో తోడ్పడుతుంది. ప్రజలకు సేవ చేస్తూనే మీరు మంచి ఆరోగ్యంతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.

News September 2, 2024

నాన్నా.. ఈ అస్తిత్వం మీరే: NTR, కళ్యాణ్ రామ్

image

దివంగత నందమూరి హరికృష్ణ 68వ జయంతి సందర్భంగా కుమారులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆయనకు నివాళులర్పించారు. ‘ఈ అస్తిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే’ అని ట్వీట్ చేశారు.

News September 2, 2024

సీఎం పర్యవేక్షణతో సహాయక చర్యలు వేగవంతం: టీడీపీ

image

AP: వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు పవర్ బోట్స్ చేరుకున్నాయని, వాటితోనే ముంపు ప్రాంతాల్లో ఆహార పంపిణీ జరుగుతున్నట్లు TDP వెల్లడించింది. ‘CM చంద్రబాబు నిరంతర పర్యవేక్షణతో సహాయక చర్యలు వేగం పుంజుకున్నాయి. ఇళ్ల నుంచి బాధితులను అధికారులు బయటకు తీసుకొస్తున్నారు. పాలు, నీళ్లను అందిస్తున్నారు. ప్రైవేట్ హోటళ్లు, దుర్గగుడి, అక్షయ పాత్ర ద్వారా ప్రభుత్వం ఆహారాన్ని సమకూర్చింది’ అని ట్వీట్ చేసింది.

News September 2, 2024

వానలొచ్చాయి.. తగ్గిన విద్యుత్ డిమాండ్

image

దేశవ్యాప్తంగా ఆగస్టులో విద్యుత్ వినియోగం తగ్గింది. నిరుడుతో పోలిస్తే 144.2 బిలియన్ యూనిట్లకు పడిపోయింది. వానలు, వరదలతో వాతావరణం చల్లబడటమే ఇందుకు కారణం. ఇక జులైతో పోలిస్తే 4.2% మేర తగ్గింది. ఉక్కపోత, ఉష్ణోగ్రతల వల్ల జూన్‌లో మాత్రం 152.4 బిలియన్ యూనిట్లు వాడేశారు. ఆగస్టుతో పోలిస్తే ఇది 5.7% అధికం. డిమాండ్ లేకపోవడంతో IEXలో రోజువారీ యూనిట్ సగటు ధర 35.5% తగ్గి రూ.4.33 వద్ద ఉన్నట్టు తెలిసింది.

News September 2, 2024

FLASH: శ్రీశైలం ప్రాజెక్టు గేట్లలో సాంకేతిక సమస్య

image

AP: శ్రీశైలం గేట్లు ఎత్తుతుండగా సాంకేతిక సమస్య ఎదురైంది. 2, 3 గేట్ల ప్యానల్‌లో బ్రేక్ కాయిల్ కాలిపోయింది. వరద ఉద్ధృతితో గేట్లను మరింత పైకి ఎత్తుతుండగా ఈ ఘటన జరిగింది. వాటిని పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు.

News September 2, 2024

వామ్మో.. వీళ్లిద్దరూ లేకపోతే?

image

TG: వరద ఉద్ధృతికి పలు చోట్ల రైల్వే ట్రాకులు కొట్టుకుపోయాయి. MHBD జిల్లా తాళ్లపూసపల్లి సమీపంలో ట్రాక్ కొట్టుకుపోయింది. ట్రాక్‌మన్ జగదీశ్ ప్రమాదాన్ని ముందే పసిగట్టి రా.12గంటల సమయంలోనే పైఅధికారులకు సమాచారం ఇచ్చారు. అటు ఇంటికన్నె వద్ద వరద ప్రభావంతో ట్రాక్ గాల్లో తేలింది. ట్రాక్‌మన్ మోహన్ సమయానికి సమాచారం ఇచ్చారు. దీంతో రైళ్లను నిలిపివేసి ప్రమాదాలను నివారించారు. లేకపోతే వందల మరణాలు సంభవించేవేమో!

News September 2, 2024

భారీ వరదలు.. సీఎం కీలక ఆదేశాలు

image

AP: వరద బాధితులను కాపాడే ప్రయత్నాలు ఎక్కడా ఆగకూడదని CM చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడ కలెక్టరేట్‌లో ఆయన వరద పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. ‘ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ప్రజలకు హామీ ఇచ్చా. దాన్ని నిలబెట్టుకునే దిశగా యంత్రాంగం పనిచేయాలి. బాధితుల కోసం కళ్యాణ మండపాలు, పునరావాస కేంద్రాలు సిద్ధం చేయాలి. మినరల్ వాటర్, ఆహారం అందించాలి. వృద్ధులు, రోగులు ఇబ్బంది పడకుండా చూడాలి’ అని ఆదేశించారు.