News September 1, 2024

IT ఉద్యోగులకు WFH ఇవ్వండి: పోలీసులు

image

TG: HYDలో భారీ వర్షాల నేపథ్యంలో IT&ITES కంపెనీలు సోమవారం తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని CYB-BAD ట్రాఫిక్ పోలీస్ విభాగం జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ కోరారు. ‘ఉద్యోగుల భద్రత, సంక్షేమం ఎంతో ముఖ్యం. వారికి WFH ఇవ్వడం ద్వారా ఇబ్బందికర వాతావరణంలో ప్రయాణం నుంచి ఉద్యోగులకు విముక్తి లభిస్తుంది. ట్రాఫిక్ రద్దీ తగ్గి అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా ఉంటుంది’ అని పేర్కొన్నారు.

News September 1, 2024

హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై రాకపోకలు బంద్

image

పాలేరు నది వరదలతో హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారి-65పై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో నార్కట్‌పల్లి, మిర్యాలగూడ, గుంటూరు మీదుగా వాహనాలను విజయవాడకు మళ్లిస్తున్నారు. అటు విజయవాడ బస్టాండులో హైదరాబాద్ వెళ్లే బస్సుల లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు సూర్యాపేట-ఖమ్మం మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. నకిరేకల్ నుంచి అర్వపల్లి, మరిపెడ మీదుగా మళ్లిస్తున్నారు.

News September 1, 2024

గంభీర్ ఆల్ టైమ్ భారత వన్డే జట్టు.. రోహిత్ శర్మకు నో ప్లేస్

image

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత కోచ్ తన ఆల్ టైమ్ భారత వన్డే జట్టును ప్రకటించారు. దీనికి ధోనీని సారథిగా ఎంచుకున్నారు. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు చోటివ్వలేదు.

టీమ్: వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రవిడ్, సచిన్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, ధోనీ, అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్.

News September 1, 2024

ప్రజల అవస్థలు ప్రభుత్వానికి పట్టట్లేదు: తెలంగాణ BJP

image

TG: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా తెలంగాణ బీజేపీ విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో ప్రజలు విష జ్వరాల బారిన పడి కష్టాలు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని ధ్వజమెత్తింది. ‘పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం పడకేసినా పట్టించుకునే నాథుడే లేడయా’ అని ట్వీట్ చేసింది.

News September 1, 2024

7 నెలల గర్భంతో బరిలో దిగి చరిత్ర సృష్టించింది

image

పారిస్ పారాలింపిక్స్‌లో ఆర్చర్ గ్రిన్‌హమ్(బ్రిటన్) 7 నెలల గర్భంతో బరిలోకి దిగి మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్‌లో కాంస్యం సాధించారు. దీంతో పారాలింపిక్స్‌లో గర్భంతో పాల్గొని పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా రికార్డు సృష్టించారు. టోక్యో పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ఫొబే పాటెర్‌స‌న్‌పై ఒక్క పాయింట్ తేడాతో(142-141) గెలుపొందారు. కడుపులో బిడ్డను మోస్తూ పతకం సాధించడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు.

News September 1, 2024

వేగంగా ట్రాక్ పునరుద్ధరణ పనులు

image

TG: భారీ వరదతో మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నె-కేసముద్రం స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ <<13990747>>కొట్టుకుపోయిన<<>> సంగతి తెలిసిందే. దీంతో పలు రైళ్లు రద్దు కావడంతో పాటు మరికొన్ని రైళ్లు దారి మళ్లాయి. కాగా ట్రాక్ పునరుద్ధరణ పనులను సౌత్ సెంట్రల్ రైల్వే వేగంగా చేయిస్తోంది. అధికారులు ప్రభావిత స్థలంలో క్యాంపింగ్ పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నారని SCR ట్వీట్ చేసింది.

News September 1, 2024

BIG ALERT: OnePlus ఫోన్ వాడుతున్నారా?

image

OnePlus 9, 10 మోడల్ ఫోన్లలో లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయగానే మదర్‌బోర్డ్ ప్రాబ్లమ్ వస్తోందని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఫోన్ ఒక్కసారిగా ఆగిపోయి, సిమ్ కార్డులు పని చేయట్లేదంటున్నారు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవద్దని కొందరు టెక్ నిపుణులు సలహాలిస్తున్నారు. దీన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని కంపెనీ చెబుతోంది. మరి మీకూ ఈ సమస్యలు ఎదురయ్యాయా? కామెంట్ చేయండి.

News September 1, 2024

చంద్రబాబు హైదరాబాద్ పర్యటన రద్దు

image

AP: సీఎం చంద్రబాబు హైదరాబాద్ పర్యటన రద్దు అయింది. వరదల నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్‌లో జరుగుతున్న బాలకృష్ణ సినీరంగ స్వర్ణోత్సవ వేడుకలకు హాజరు కావడం లేదని ట్వీట్ చేశారు. ‘బాలకృష్ణకు శుభాకాంక్షలు. బాలయ్య మరెన్నో ఘన విజయాలు సాధించాలని, తెలుగు చలన చిత్ర సీమలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా మరిన్ని పాత్రలు పోషించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను’ అని CBN ట్వీట్ చేశారు.

News September 1, 2024

పవన్ కళ్యాణ్ అభిమానులకు క్రేజీ న్యూస్

image

పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. రేపు పవన్ పుట్టినరోజు సందర్భంగా OG సినిమాలోని ఫస్ట్ సింగిల్, పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. సంబరాలకు రెడీ అవ్వాలని అభిమానులను ఉత్తేజపరిచింది.

News September 1, 2024

అమిత్ షాకు చంద్రబాబు ఫోన్

image

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. వరద సహాయక చర్యలపై చర్చించారు. NDRF పవర్ బోట్లు పంపాలని రిక్వెస్ట్ చేశారు. అవసరమైన సాయం చేస్తామని అమిత్ షా సీఎంకు హామీ ఇచ్చారు. 6 NDRF టీంలు, 40 పవర్ బోట్లు తక్షణమే ఏపీకి పంపుతున్నామని, రేపు ఉదయంలోపు విజయవాడకు చేరుకుంటాయని హోంశాఖ సెక్రటరీ తెలిపారు. సహాయక చర్యల కోసం 6 హెలికాఫ్టర్లు పంపుతున్నట్లు పేర్కొన్నారు.