India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఎండ ప్రభావం తీవ్రంగా కనిపించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 45°C కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం CH కొండూరు, మల్కాపూర్‌లో 45.3°C టెంపరేచర్ నమోదైంది. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వేడిగాలుల వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు.
పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రభాస్ ‘ఫౌజీ’లో హీరోయిన్ ఇమాన్విపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆమె పాక్‌కు చెందినవారని, ‘ఫౌజీ’ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ ఒక్క పాకిస్థానీ కూడా IND మూవీస్‌లో నటించకూడదంటున్నారు. అటు ఉగ్రదాడికి, ఆమెను ముడిపెట్టడం ఏంటని మరికొందరు అంటున్నారు. కరాచీకి చెందిన ఇమాన్వి కుటుంబం ప్రస్తుతం USలో నివసిస్తోంది. ఆమె తండ్రి ఇక్బాల్ పాక్ మాజీ మిలటరీ అధికారి.
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొద్దిసేపట్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి, జగిత్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అరగంటలో వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేశారు. అటు ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం పడటానికి అవకాశం ఉందని తెలిపారు. మీ ప్రాంతంలో వర్షం కురుస్తోందా?
TG: తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టేయాలంటూ CM రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేశారు. BJP మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ ఎన్నికల ప్రచారంలో రేవంత్ చెప్పారని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసు విచారణ చేపట్టొద్దని, కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని రేవంత్ కోరారు. దీనిపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.
పహల్‌గామ్‌లోని బైసరన్ లోయను ఉగ్రవాదులు నరమేధానికి ఎంచుకోవడానికి పలు కారణాలు ఉన్నాయని భద్రతా అధికారులు చెబుతున్నారు.
1. ఇక్కడి పచ్చదనం పాడవ్వకూడదని పహల్‌గామ్- బైసరన్ వరకు 5KM మోటార్ వాహనాలను అనుమతించరు.
2. కాలినడక లేదా గుర్రాల ద్వారానే చేరుకోవాలి.
3. దాడులకు పాల్పడినా ప్రతిచర్యలకు ఆలస్యం అవుతుంది.
4. లోయకున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల సులభంగా చొరబడి దాడి చేసి తప్పించుకోవడానికి వీలుంటుంది.
AP: ఒంగోలులో TDP నేత వీరయ్య చౌదరి మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని CM చంద్రబాబు అన్నారు. నిందితుల కోసం 12 బృందాలు గాలిస్తున్నట్లు, వారిని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. వీరయ్య సమర్థ నాయకుడని, పార్టీకి ఎన్నో సేవలు చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబాన్ని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటామని భరోసా కల్పించారు. నేరస్థుల గురించి తెలిస్తే 9121104784 నంబర్‌కు కాల్ చేసి తెలపాలని CM కోరారు.
J&K ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ‘జమ్మూకశ్మీర్ పహల్‌గామ్‌లో పర్యాటకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాం. ఇలాంటి ఘటనలు దేశభద్రతను దెబ్బతీస్తాయి’ అని తాలిబన్ విదేశాంగ శాఖ పేర్కొంది. అటు ఈ ఉగ్రదాడులపై బంగ్లాదేశ్ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.
కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. వారిని హత్య చేస్తామని బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. వారిద్దరి డెడ్‌బాడీలను ముక్కలుముక్కలుగా నరికి బ్యాగులో కుక్కుతానని బెదిరించారు. ఈ మెయిల్స్ సింధార్ రాజ్‌పుత్ పేరిట వచ్చినట్లు విధానసౌధ పీఎస్ పోలీసులు గుర్తించారు. పోలీసులు FIR నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.
పహల్‌గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారిలో సయ్యద్ అదిల్ హుస్సేన్ షా ఒక్కడే స్థానికుడు. గుర్రంపై పర్యాటకులను ఎక్కించుకుని పహల్‌గామ్ తీసుకెళ్తూ ఉంటాడు. అందరూ ప్రాణ భయంతో పరుగులు పెడుతుంటే.. హుస్సేన్ మాత్రం ప్రాణాలను లెక్కచేయకుండా ఎదురు తిరిగాడు. ఓ ఉగ్రవాది నుంచి రైఫిల్ లాక్కునేందుకు ప్రయత్నించగా కాల్చి చంపేశారు. తమ బిడ్డ మరణానికి దేశం ప్రతీకారం తీర్చుకోవాలని అతడి పేరెంట్స్ కోరుతున్నారు.
IPL: ఫీల్డింగ్‌లో ఈ ఏడాది అన్ని జట్ల ప్రదర్శన పేలవంగా ఉంది. ఇప్పటి వరకు 40 మ్యాచులు జరగ్గా, అన్ని జట్లు కలిపి 111 క్యాచ్‌లు వదిలేశాయి. 247 మిస్‌ఫీల్డ్స్, 172 రనౌట్స్ మిస్ చేశాయి. 2020 నుంచి తొలి 40 మ్యాచ్‌లతో పోలిస్తే ఇదే చెత్త ప్రదర్శన. MI జట్టు ఒక్కటే 83.6% క్యాచింగ్ పర్సంటేజ్‌తో కాస్త మెరుగ్గా ఉంది. గతంలో అద్భుతమైన క్యాచ్‌లు చూసిన ఫ్యాన్స్ ప్రస్తుతం పట్టిన ప్రతి క్యాచ్‌నూ అద్భుతం అంటున్నారు.
Sorry, no posts matched your criteria.