India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో వరదల్లో నలుగురు, విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలవగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. MHBD జిల్లాలో కారు కొట్టుకుపోయి డా.అశ్విని, వెంకటాపురంలో చేపల వేటకు వెళ్లిన నర్సయ్య, WGL జిల్లా గిర్నిబావి వాగులో చిక్కుకొని వజ్రమ్మ, MLG జిల్లా కాల్వపల్లి వాగులో పడి మల్లికార్జున్, HNK జిల్లా పరకాలలో విద్యుత్ షాక్‌తో యాదగిరి మృతి చెందారు.
AP: విజయవాడ, గుంటూరులో 37 సెంటీమీటర్ల వర్షం కురవడం అసాధారణమని, అందువల్లే ముంపు ప్రాంతాలు పెరిగాయని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే తమ తక్షణ కర్తవ్యమని తెలిపారు. రెండు హెలికాప్టర్లు, భారీగా బోట్లు సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.
AP: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై విచారణ కొనసాగుతోందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఢిల్లీ సాంకేతిక నిపుణుల సాయం తీసుకుంటున్నామన్నారు. ‘ఆడపిల్లల రక్షణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అనుమానం ఉన్నవారి ఫోన్లు, కంప్యూటర్లు తనిఖీ చేస్తాం. ఈ ఘటనపై ఆధారాలుంటే పోలీసులకు ఇవ్వాలి’ అని సూచించారు. రాష్ట్రమంతా ఏదో జరిగిపోతోందని విపక్షం దుష్ప్రచారం చేయడం దారుణమని మండిపడ్డారు.
AP: రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లకు రేపు సెలవు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదల్లో 9 మంది చనిపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికే చాలా వరకు వర్షాలు తగ్గాయని, కానీ వరద ముప్పు ఉందని చెప్పారు. ఎల్లుండి లోగా వర్షాలు తగ్గుతాయని పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అసాధారణ వర్షపాతం నమోదైందని, 37 సెం.మీ వరకు వర్షం కురిసిందని సీఎం తెలిపారు.
TG: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు 9 NDRF బృందాలు పంపించారు. ఖమ్మంలో వరద నీటిలో 119 మంది చిక్కుకుపోయారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్‌లో వివరించారు. దీంతో చెన్నై, వైజాగ్, అస్సాం నుంచి మూడేసి బృందాల చొప్పున పంపించారు.
AP: రాష్ట్రంలో రికార్డుస్థాయి వర్షాలు కురుస్తున్నాయని, నేషనల్ హైవేలు కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పారు. వరద బాధితులకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున పంచదార, ఆయిల్, ఉల్లి, బంగాళదుంపలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారులకు అదనంగా 25 కేజీల బియ్యం ఇవ్వాలని సూచించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్, షాహీన్ షా అఫ్రీది కొట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి గొడవను ఆపేందుకు ప్రయత్నించిన మహ్మద్ రిజ్వాన్‌కు కూడా దెబ్బలు తగిలినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరగకముందు గ్రౌండ్‌లో అఫ్రీదిపై మసూద్ చేయి వేయగా దానిని అతడు కోపంగా తీసేశాడు. కాగా రెండో టెస్టుకు అఫ్రీది జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ED, CBI మాత్రమే కాకుండా ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా BJP కోసం పని చేయడం ప్రారంభించిందని కాంగ్రెస్ విమర్శించింది. ఒక రాజకీయ పార్టీ డిమాండ్‌పై ఎన్నికల సంఘం ఏకంగా అసెంబ్లీ ఎన్నికల తేదీనే మార్చడం దురదృష్టకరమని ఎంపీ మాణిక్యం ఠాగూర్ అన్నారు. హరియాణాలో BJPని ఓటమి భయం వెంటాడుతోందని విమర్శించారు. ఈ ఆలస్యం పార్టీ ఎన్నికల సన్నాహకాలపై ప్రభావం చూపబోదని AICC ఇన్‌ఛార్జ్ దీపక్ అన్నారు.
TG: సంచలనంగా మారిన ‘హైడ్రా’కు జనసేన నేత, నటుడు నాగబాబు మద్దతు పలికారు. ‘వర్షాలకు తూములు తెగిపోయి, చెరువులు, నాళాలు ఉప్పొంగిపోయి అపార్ట్‌మెంట్లలోకి కూడా నీళ్లు రావడం మనం చూస్తున్నాం. దీనికి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. వీటికి ముఖ్య కారణం చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడమే. దీనికి నివారణగా సీఎం రేవంత్ ధైర్యంగా హైడ్రా కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీనికి అందరూ సపోర్ట్ చేయాలి’ అని ట్వీట్ చేశారు.
కోలీవుడ్‌లో పవర్ సెంటర్ అంటూ ఏం లేదని నటుడు మమ్ముట్టి అన్నారు. జస్టిస్ హేమ కమిటీ నివేదికపై ఆర్టిస్టుల సంఘం స్పందించే వరకు తాను ఎదురుచూసినట్టు పేర్కొన్నారు. కమిటీ చేసిన సలహాలు, పరిష్కారాలను స్వాగతించిన మమ్ముట్టి పరిశ్రమలో సంస్కరణలు తేవడానికి అన్ని సంఘాలు ఏకం కావాలని కోరారు. పోలీసుల విచారణను ప్రతి ఒక్కరూ అనుమతించాలని, శిక్షలను కోర్టు నిర్ణయించనివ్వాలని అన్నారు.
Sorry, no posts matched your criteria.