News September 1, 2024

గుడ్లవల్లేరు ఘటనపై వైసీపీ అసత్య ప్రచారాలు: లోకేశ్

image

AP: <<13972426>>గుడ్లవల్లేరు<<>> ఘటనపై విచారణ కొనసాగుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కానీ దీనిపై YCP అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ‘విద్యార్థులకు సంబంధించిన భోజనం వ్యవహారంలో ఎలాంటి రాజీపడం. ఇందులో భాగంగానే నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌పై వేటు వేశాం. ట్రిపుల్ ఐటీ మెస్ కాంట్రాక్టర్లందరూ YCPకి చెందినవారే. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేవారిపై చర్యలు తప్పవు’ అని ఆయన హెచ్చరించారు.

News September 1, 2024

ప్లీన‌రీపై బీఆర్ఎస్ అధిష్ఠానం దృష్టి

image

పార్టీ ప్లీన‌రీ నిర్వ‌హ‌ణ‌పై BRS నాయ‌క‌త్వం దృష్టిసారించిన‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అంత‌కంటే ముందే ప్లీన‌రీ నిర్వ‌హించాల‌నే యోచ‌న‌లో మాజీ సీఎం కేసీఆర్ ఉన్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో డీలా ప‌డిన క్యాడ‌ర్‌లో ఉత్సాహం నింపేలా HYD బ‌య‌ట ప్లీనరీ నిర్వ‌హించాల‌నే యోచ‌న‌లో BRS ఉన్న‌ట్టు స‌మాచారం.

News September 1, 2024

హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు

image

జ‌బ‌ల్‌పూర్ నుంచి హైద‌రాబాద్ వ‌స్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అత్య‌వ‌స‌రంగా నాగ్‌పూర్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. విమానం గాల్లో ఉండ‌గా బాత్రూంలోని క‌మోడ్ సీటుపై ‘9 గంట‌ల‌కు బ్లాస్ట్’ అంటూ చేతిరాత‌తో రాసిన పేప‌ర్‌ను సిబ్బంది గుర్తించారు. దీంతో ATCకి స‌మాచారం ఇవ్వ‌గా 9.20కి నాగ్‌పూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. 69 మంది ప్రయాణికులను కిందికి దించి వారి లగేజీ తనిఖీ చేస్తున్నారు.

News September 1, 2024

ప్రజలు బయటికి రావొద్దు: సీఎం

image

TG: రాష్ట్రంలో అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వాలని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వరద బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

News September 1, 2024

తెలుగు రాష్ట్రాల్లో భారీగా రైళ్ల రద్దు, మళ్లింపు

image

TG: మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ <<13990198>>ధ్వంసం <<>>కావడంతో ఏపీ, తెలంగాణలో ఇవాళ, రేపు ప్రయాణించే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. దాదాపు 70కి పైగా రైళ్లను అధికారులు దారి మళ్లించి నడుపుతున్నారు. రద్దయిన, దారి మళ్లిన రైళ్ల వివరాలను పైన ఫొటోల్లో చూడవచ్చు. అటు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌కు రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపడుతున్నారు. పూర్తయ్యేందుకు మరికొన్ని గంటలు పట్టే అవకాశం ఉంది.

News September 1, 2024

ఆ విషయంలో విపక్షాలది రాజకీయం: ఫడ్నవీస్

image

ఛ‌త్ర‌ప‌తి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘ‌ట‌న‌పై నిర‌స‌న పేరుతో విప‌క్ష మ‌హావికాస్ అఘాడీ రాజ‌కీయం చేస్తున్నాయ‌ని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ విమ‌ర్శించారు. ది డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకంలో శివాజీని నెహ్రూ అవ‌మానించారని, దీనికి కాంగ్రెస్ క్ష‌మాప‌ణ‌లు చెబుతుందా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. మధ్యప్రదేశ్‌లో గత క‌మ‌ల‌నాథ్ స‌ర్కార్ బుల్డోజ‌ర్ల‌తో శివాజీ విగ్ర‌హాన్ని కూల్చిందని దుయ్య‌బ‌ట్టారు.

News September 1, 2024

వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం: వెలంపల్లి

image

AP: విజయవాడలో కొండచరియలు విరిగిపడి ఆరుగురు మరణిస్తే ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని YCP నేత వెలంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ‘రెండు రోజులుగా విజయవాడలోని పలు కాలనీలు, ఇళ్లు నీటమునిగాయి. బాధితులకు కనీసం భోజనం కూడా అందించటం లేదు. ఎవరినీ పునరావాస కేంద్రాలకు తరలించడం లేదు. అధికారులు కూడా స్పందించడం లేదు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News September 1, 2024

దీపికా పదుకొణె తల్లి కాబోయేది ఆరోజే?

image

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె డెలివరీ డేట్ ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఈనెల 28న ఆమె తన మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సమాచారం. ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఆమె ప్రసవించనున్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె దంపతులకు 2018, నవంబర్‌లో వివాహమైన సంగతి తెలిసిందే.

News September 1, 2024

హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు

image

హైదరాబాద్‌, విజయవాడలో 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.6,695గా, 8 గ్రాముల ధర రూ. 53,560గా ఉంది. అలాగే తులం బంగారం రూ.66,950గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.73,040గా ఉంది. నిన్నటితో పోల్చితే ఈ రోజు 10 గ్రాముల 24, 22 క్యారెట్ల బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మరోవైపు హైదరాబాద్‌లో గ్రాము వెండి ధర రూ. 92గా ఉంది. 8 గ్రాములు రూ.736 కాగా, 10 గ్రాముల ధర రూ. 920గా ఉంది.

News September 1, 2024

3వేలకు పైగా ఉద్యోగాలు.. వచ్చే నెలలో నోటిఫికేషన్?

image

TG: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్‌లో విద్యుత్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖాళీల వివరాలు సేకరిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం రాష్ట్రంలోని 4 విద్యుత్ సంస్థల్లో 3వేలకు పైగా ఖాళీలున్నాయి. వీటి సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. ఖాళీ పోస్టుల సంఖ్య ఖరారైతే వచ్చే నెలలో జాబ్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సుంది.