India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహేశ్ బాబు-నమ్రత దంపతుల కుమారుడు గౌతమ్ 18వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ సూపర్ స్టార్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘హ్యాపీ 18 సన్. ఎన్నో కొత్త విషయాలు అన్వేషించు. ఎంజాయ్ చెయ్. నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నా. ఓ తండ్రిగా ఇవాళ ఎంతో గర్వంగా, ఆనందంగా ఉన్నా’ అని రాసుకొచ్చారు.
‘ఎమర్జెన్సీ’ చిత్రంపై నెలకొన్న వివాదం కేవలం సిక్కులకు సంబంధించినది మాత్రమే కాదని, దేశ సామరస్యానికి సంబంధించినదని శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ పేర్కొంది. కేవలం కంగనా రనౌత్ ఉన్నందున సినిమాను వ్యతిరేకించే ఉద్దేశం తమకు లేదని, ఈ వివాదం తమ వాదనపై ఆధారపడిందని కమిటీ GS గురుచరణ్ తెలిపారు. చిత్రంలో వాస్తవాలను తప్పుగా చూపించారంటూ సిక్కు వర్గాలు తప్పుబడుతున్నాయి.
‘జోహో’ కో ఫౌండర్ రాధా వెంబు రూ.47,500 కోట్లతో దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. జోహో కార్ప్.. క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్, టెక్, ఇంటర్నెట్ వెబ్ సంబంధిత సాధనాలను ఉత్పత్తి చేస్తుంది. రాధా వెంబు IIT మద్రాస్‌లో చదివారు. 1996లో సోదరుడితో కలిసి దీనిని స్థాపించారు. ఇందులో ఆమెకు 50% వాటా ఉంది. జోహోతో పాటు జానకి హైటెక్ ఆగ్రో లిమిటెడ్, హైలాండ్ వ్యాలీ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలకు ఈమె డైరెక్టర్.
తెలంగాణలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో వెంటనే కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని CS శాంతికుమారి సూచించారు. ‘స్కూళ్లకు సెలవులు ఇచ్చే విషయంలో జిల్లాల్లో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలి. డ్యామ్‌లు, చెరువులు, కుంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వర్షం పరిస్థితిని ఎప్పటికప్పుడు మాకు చేరవేయాలి’ అని ఆదేశించారు.
రష్యాలోని కమ్‌చట్కా ద్వీపంలో 22 మందితో ప్రయాణిస్తున్న రష్యన్ Mi8 హెలికాప్టర్ అదృశ్యమైంది. ఇందులో 19 ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. యాత్రికులు వచ్కాజెట్స్ అగ్నిపర్వతం సందర్శనలో ఉండగా ఘటన జరిగింది. ఈ విషయాన్ని ఫెడరల్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ ధ్రువీకరించింది. హెలికాప్టర్‌తో సంబంధాలు కట్ అయిన ప్రాంతంలో వర్షం, మంచు కురుస్తున్నట్టు తెలిపింది. గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి.
మనిషి రోగనిరోధక వ్యవస్థలోని నేచురల్ కిల్లర్ సెల్స్ క్యాన్సర్‌కు ఉపకరించే XPO1 అనే ప్రోటీన్‌ను గుర్తించి దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. కిల్లర్ సెల్స్ ఈ ప్రోటీన్‌ను తమ అధీనంలోకి తీసుకొని మరిన్ని కిల్లర్ సెల్స్‌ను ఏర్పాటు చేసుకొని దాడి చేస్తున్నట్టు వెల్లడించారు. తద్వారా నూతన చికిత్సా విధానాలపై సౌతాంప్టన్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఆశాభావంగా ఉన్నారు.
AP: గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెదకాకాని మండలం ఉప్పలపాడు- గోళ్లమూడి మధ్య వరద ఉద్ధృతికి కాలువలో కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న టీచర్ రాఘవేంద్ర, పిల్లలు సాత్విక్, మాన్విక్ మరణించారు. కాగా విజయవాడలో కొండచరియలు విరిగిపడటంతో నలుగురు <<13984102>>దుర్మరణం<<>> పాలైన విషయం తెలిసిందే.
Ap: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య శాఖల అధికారులను అప్రమత్తం చేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి అవసరమైన సూచనలు అందించాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లోతట్టు, ముంపు, తీర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని వివరించారు.
SEP 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ‘ఓజీ’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇవాళ ఓ పోస్టర్ కూడా విడుదల కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. పవన్, సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
T20ల్లో మరో రికార్డు నమోదైంది. హాంకాంగ్‌కు చెందిన ఆయుష్ శుక్లా ఒక్క రన్ కూడా ఇవ్వకుండా 4 ఓవర్లు వేశారు. మంగోలియాతో T20లో ఉత్తమ గణాంకాలు(4-4-0-1) నమోదు చేశారు. తద్వారా ఒకే మ్యాచ్‌లో 4 మెయిడిన్లు వేసిన 3వ బౌలర్‌గా నిలిచారు. 2024 T20WCలో NZ పేసర్ ఫెర్గూసన్ PNGపై ఈ ఫీట్ సాధించారు. అంతకుముందు 2021లో కెనడా బౌలర్ సాద్ బిన్ జాఫర్ T20WC US రీజియన్ క్వాలిఫైయర్‌లో పనామాపై 4 మెయిడిన్ ఓవర్లు వేశారు.
Sorry, no posts matched your criteria.