News August 31, 2024

సెప్టెంబర్‌లో బ్రూనై, సింగపూర్‌కు మోదీ

image

సెప్టెంబర్ తొలివారంలో ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై, సింగపూర్‌లో పర్యటిస్తారు. 3, 4 తేదీల్లో బ్రూనైలో, 4, 5 తేదీల్లో సింగపూర్‌లో పర్యటిస్తారని విదేశీ వ్యవహారాలశాఖ తెలిపింది. ద్వైపాక్షిక పర్యటన కోసం బ్రూనై వెళ్లడం మోదీకిదే తొలిసారి. IND, బ్రూనై మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 40 ఏళ్లవుతున్న సందర్భంగా PM అక్కడ పర్యటిస్తారు. మరోవైపు ప్రపంచ సమస్యలపై సింగపూర్ PM లారెన్స్ వాంగ్‌తో మోదీ చర్చించనున్నారు.

News August 31, 2024

భారీ వర్షాలు.. 2 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

AP: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ఇవాళ సెలవు ప్రకటించారు. ఈమేరకు జిల్లాల విద్యాశాఖ అధికారులు ప్రకటన విడుదల చేేశారు. వర్షాల నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా రాష్ట్రంలో నేడు అతిభారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.

News August 31, 2024

దేశంలో భారీగా పెరిగిన నీటి నిల్వలు

image

దేశంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు భారీగా పెరిగినట్లు కేంద్ర జల సంఘం (CWC) తెలిపింది. గతేడాదితో పోల్చితే ఇది 126 శాతం అధికమని పేర్కొంది. దేశవ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటిమట్టం 144.333 బిలియన్ క్యూబిక్ మీటర్ల వద్ద ఉందని తెలిపింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో నీటి నిల్వలు గణనీయంగా పెరిగినట్లు వెల్లడించింది. ఈ రాష్ట్రాల్లో మొత్తం 44.771 బీసీఎంల నిల్వ ఉన్నట్లు పేర్కొంది.

News August 31, 2024

ఏపీ, తెలంగాణలో అతి భారీ వర్షాలు

image

నేటి నుంచి మూడు రోజుల పాటు TGలోని ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో పాటు ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డిలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు ఏపీలో నేడు ఉత్తర కోస్తా జిల్లాల్లో అతి భారీ, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

News August 31, 2024

మూడు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని

image

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఇవి తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్-నాగర్ కోయిల్, మధురై-బెంగళూరు, యూపీలోని మీరట్-లక్నో మధ్య నడవనున్నాయి. ఇందులో రెండు రైళ్లు దక్షిణ రైల్వే జోన్‌లోనివి కావడం విశేషం.

News August 31, 2024

విజృంభిస్తున్న వైరల్ ఫీవర్లు

image

APలో వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. 10రోజుల్లో సమారు 5లక్షల మంది బాధితులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించారు. అనధికార లెక్కల ప్రకారం ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉండనుంది. గతేడాది కంటే ఈసారి బాధితుల సంఖ్య 20-30% ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ప్రతి ఇంట్లో ఒక రోగి ఉన్నారు. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ కేసులు బాగా పెరుగుతుండటంతో జ్వరాన్ని నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు.

News August 31, 2024

జెన్‌కో ఉద్యోగాల ఫలితాలు విడుదల

image

TG: జెన్‌కో ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గత నెల 14న 339 అసిస్టెంట్ ఇంజినీరు, 60 కెమిస్ట్ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాలను <>వెబ్‌సైట్‌లో<<>> అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

News August 31, 2024

రాష్ట్రంలో రేపటి నుంచి పశుగణన

image

TG: రాష్ట్రంలో 21వ జాతీయ పశుగణన రేపటి నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈ ప్రక్రియకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పశువులు, గొర్రెలు, మేకల వివరాలను ఆన్ లైన్ చేయనున్నారు. చివరిసారిగా 2019లో జరిగిన లెక్కింపులో 3.26 కోట్ల జీవాలు నమోదయ్యాయి. వీటితో పాటు పౌల్ట్రీలో 7.99 కోట్లు ఉన్నట్లు తేలింది.

News August 31, 2024

ప్రైవేట్ కాలేజీల్లో బీఈడీ కోర్సుకు ఫీజు ఖరారు

image

AP: రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల్లో బీఈడీ కోర్సులకు ఫీజును రూ.9వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫార్సులతో ఫీజును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023-26 వరకు ఈ ఫీజులే అమల్లో ఉంటాయని తెలిపింది. మరోవైపు రెండో విడత కౌన్సెలింగ్‌తో కలిపి డిగ్రీలో 49.24శాతం సీట్లు భర్తీ అయ్యాయి.

News August 31, 2024

అర్ధరాత్రి నుంచి వర్షం

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా వాన పడుతోంది. రాత్రి 2 గంటలకు మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. HYD చుట్టుపక్కల జిల్లాలైన మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలతో పాటు ఏపీలోని కర్నూలు, నంద్యాల తదితర జిల్లాల్లో పలుచోట్ల వాన పడుతూనే ఉంది. మరి మీ ప్రాంతంలో వర్షం కురుస్తోందా?