News August 31, 2024

విషాదం.. రెండు నెలల్లో 150 మంది మృతి

image

హిమచల్ ప్రదేశ్‌లో వర్షానికి సంబంధించిన ఘటనల్లో జూన్ 27 నుంచి ఇప్పటివరకు 150 మరణించినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో రూ.1,265 కోట్ల నష్టం వాటినట్లు వెల్లడించారు. అనేక చోట్ల ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయని తెలిపింది. మరోవైపు ఇంకా రాష్ట్రానికి వర్షం ముప్పు పొంచి ఉంది. ఇవాళ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, సెప్టెంబర్ 2 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

News August 31, 2024

నేడు పులివెందులకు జగన్

image

AP: నేటి నుంచి పులివెందులలో మాజీ సీఎం జగన్ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి ఉదయం 11 గంటలకు ఆయన కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన పార్టీ నేత చంద్రారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. మూడు రోజులు నియోజకవర్గ నేతలకు అందుబాటులో ఉండనున్నారు. వచ్చే నెల 4న విదేశాలకు వెళ్తారని సమాచారం.

News August 31, 2024

TG, ఏపీకి ఏఐసీసీ కార్యదర్శుల నియామకం

image

దేశంలోని 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఏఐసీసీ కార్యదర్శులను నియమిస్తూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణకు విష్ణునాథ్, విశ్వనాథన్‌ను, ఏపీకి గణేశ్ కుమార్ యాదవ్‌ను నియమించారు. మాజీ ఎమ్మెల్యే సంపత్‌ను ఛత్తీస్‌గఢ్ ఏఐసీసీ కార్యదర్శిగా నియమించారు. వెంటనే వీరి నియామకం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News August 31, 2024

రిలయన్స్ గ్రూప్ ఎన్ని రంగాల్లో వ్యాపారం చేస్తుందో తెలుసా?

image

*టెలికాం
*ఆయిల్&గ్యాస్
*మీడియా&ఎంటర్ టైన్‌మెంట్
*ఫుడ్ ప్రాసెసింగ్
*టెక్స్‌టైల్
*పవర్
*ఫైనాన్స్-హౌసింగ్
*ఫార్మా రిటైల్
*వాలెట్స్, పేమెంట్స్
*ఆన్‌లైన్ ఎడ్యుకేషన్
*డిజిటల్ కామర్స్, రిటైల్ చైన్, సూపర్ మార్కెట్, జువెలరీ, ఫర్నీచర్, ఫుట్‌వేర్.
>> ముకేశ్ అంబానీ ఆస్తి రూ.10,14,700 కోట్లు

News August 31, 2024

థియేటర్లలోకి ట్రంప్ వివాదస్పద బయోపిక్!

image

డొనాల్డ్ ట్రంప్ బయోపిక్‌గా తెరకెక్కిన వివాదస్పద చిత్రం ‘ది అప్రెంటిస్’ థియేటర్లలోకి రానున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. యూఎస్‌లో పోలింగ్‌కు నెలరోజుల ముందు ఈ బయోపిక్ అక్కడి థియేటర్లలో విడుదల కానుందని నివేదికలు పేర్కొన్నారు. ఓ ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ దీనిని రిలీజ్ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాను గతంలో ట్రంప్ వ్యతిరేకించారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని ఆరోపించారు.

News August 31, 2024

ఎక్కువ మొక్కలు నాటితే అవార్డులు: సీఎం

image

AP: ఇకపై ఎక్కువ మొక్కలు నాటిన వారికి ఆగస్టు 15, జనవరి 26న అవార్డులు ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. మంగళగిరిలో వన మహోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది నుంచే ఇది అమల్లోకి వస్తుందన్నారు. తనకు ఎంతో ఇష్టమైన కార్యక్రమం వన మహోత్సవమని చెప్పారు. మరోవైపు భూగర్భ జలాలు పెరగాలంటే ఇంకుడు గుంతలు తవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

News August 31, 2024

వయాకాం 18, వాల్ట్ డిస్నీ విలీనానికి NCLT ఆమోదం

image

వయాకాం 18, వాల్ట్ డిస్నీ అనుబంధ స్టార్ ఇండియా సంస్థల విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. ఈ విలీనంతో ఏర్పడే సంస్థ రూ.70 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థగా నిల‌వ‌నుంది. ఈ ఒప్పందంలో రిలయన్స్, దాని అనుబంధ సంస్థలు 63.16 శాతం, వాల్ట్ డిస్నీ 36.84 శాతం వాటా క‌లిగి ఉంటాయి. రెండు సంస్థ‌ల వెంచ‌ర్ ప‌రిధిలో 120 టీవీ ఛాన‌ళ్లు, 2 ఓటీటీలు న‌డ‌వ‌నున్నాయి.

News August 31, 2024

ఆగస్టు 31: చరిత్రలో ఈ రోజు

image

1864: హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు జననం
1925: కవి, గేయ రచయిత ఆరుద్ర జననం
1932: కథా రచయిత రావిపల్లి నారాయణరావు జననం
1934: తెలుగు సినీ రచయిత రాజశ్రీ జననం
1969: మాజీ భారత క్రికెటర్ జవగళ్ శ్రీనాథ్ జననం
2014: సినీ దర్శకుడు బాపు మరణం
2020: భారతదేశ 13వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం

News August 31, 2024

వరల్డ్ U20 అథ్లెటిక్స్‌లో భారత్‌కు కాంస్యం

image

వరల్డ్ అండర్ 20 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌లో భారత్ ఖాతాలో కాంస్యం చేరింది. 10వేల మీటర్ల రేస్ వాక్ పోటీల్లో భారత అథ్లెట్ ఆర్తి బ్రాంజ్ గెలుచుకున్నారు. 44.39.39 నిమిషాల్లోనే వాక్‌ను పూర్తి చేశారు. గతంలో తన పేరు మీదే ఉన్న జాతీయ రికార్డు 47:21.04ను బద్దలు కొట్టారు. ఈ ఎడిషన్‌లో భారత్‌కిదే తొలి మెడల్.

News August 31, 2024

హైదరాబాద్‌లో అత్యంత సంపన్నుడు ఈయనే

image

TG: హైదరాబాద్‌లో మొత్తం 104 మంది అత్యంత సంపన్నులు ఉన్నట్లు ‘హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2024’ వెల్లడించింది. దివీస్ ల్యాబోరేటరీ ఫౌండర్ మురళి దివి రూ.76,100 కోట్లతో టాప్‌లో నిలిచారు. ఆ తర్వాత మేఘా కంపెనీకి చెందిన పి.పిచ్చిరెడ్డి రూ.54,800 కోట్లు, పీవీ కృష్ణారెడ్డి రూ.52,700 కోట్లు, హెటిరో ఫౌండర్ పార్థసారథి రెడ్డి రూ.29,900, అపర్ణ సంస్థ ఎండీ సుబ్రమణ్యం రెడ్డి రూ.22,100 కోట్లతో టాప్-5లో ఉన్నారు.