India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చైనాపై విధించిన టారిఫ్స్‌ను తగ్గిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతమున్న 57% టారిఫ్స్‌ను 47 శాతానికి పరిమితం చేస్తానని చెప్పారు. <<18146348>>జిన్‌పింగ్‌తో భేటీ <<>>సూపర్ సక్సెస్ అయిందని తెలిపారు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ను ఎగుమతి చేయడానికి, అమెరికన్ సోయాబీన్స్‌ను కొనడానికి చైనా అంగీకరించిందని చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తాను చైనా వెళ్తానని, జిన్‌పింగ్ అమెరికాకు వస్తారని చెప్పారు.

తాను సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోనని హీరో రవితేజ అన్నారు. చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను, సినిమాల్లో జయాపజయాలను పట్టించుకోనని స్పష్టం చేశారు. వందశాతం కష్టపడి పనిచేస్తే ఫలితం వస్తుందని నమ్ముతానని తెలిపారు. ‘మాస్ జాతర’ చిత్రీకరణ సమయంలో తనకు గాయాలు కావడంతో చిత్రీకరణ వాయిదా పడినట్లు వెల్లడించారు. ఈ మూవీ రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఇరాన్‌లోని చాబహార్ పోర్టు విషయంలో భారత్‌కు అమెరికా ఊరటనిచ్చింది. వచ్చే ఏడాది ప్రారంభం వరకు ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చింది. గతంలో ఇచ్చిన మినహాయింపు గడువు ముగిసిన నేపథ్యంలో తాజాగా పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మధ్య ఆసియా దేశాలు, అఫ్గాన్‌తో వాణిజ్యం కోసం చాబహార్ పోర్టును భారత్ అభివృద్ధి చేస్తోంది. 10 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యతలు చూసుకునేలా ఇరాన్‌తో గత ఏడాది <<13242332>>ఒప్పందం <<>>చేసుకుంది.

TG: తెలంగాణ జాగృతి ఫౌండర్ కవిత తన భర్త అనిల్‌తో కలిసి BRS నేత హరీశ్ రావు ఇంటికి వెళ్లారు. రెండు రోజుల క్రితం హరీశ్ తండ్రి సత్యనారాయణ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. ముందుగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గతంలో కాళేశ్వరం అక్రమాల్లో హరీశ్ రావుపై కవిత సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా పరిణామం చర్చనీయాంశంగా మారింది.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు గంటల తరబడి డెస్క్‌పై సరైన భంగిమలో కూర్చోకపోతే తీవ్ర సమస్యలొస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల 25 ఏళ్ల టెకీకి టైపింగ్, కప్ పట్టుకున్నప్పుడు మోచేతి నొప్పి రావడంతో ‘టెన్నిస్ ఎల్బో’గా నిర్ధారించారు. సాధారణంగా ఆటగాళ్లకు వచ్చే ఈ నొప్పికి కారణం డెస్క్ వద్ద ఎక్కువ గంటలు పనిచేయడం & ఒత్తిడేనని తేలింది. సరైన చికిత్స, భంగిమ మార్పుల ద్వారా కోలుకోవచ్చని వైద్యులు సూచించారు.

AP: నవంబర్ 7న జరగాల్సిన క్యాబినెట్ భేటీ 10వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు CS కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మంత్రివర్గ సమావేశం నిర్వహణకు సంబంధించిన మార్పులను గమనించాలని అన్ని శాఖల అధికారులకు సూచనలు చేసింది. జిల్లాల పునర్విభజన, విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సు గురించి ఈ భేటీలో కీలకంగా చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కొనసాగుతున్న మొంథా తుఫాన్ కారణంగా భేటీ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

గాయం నుంచి కోలుకున్న భారత క్రికెటర్ రిషభ్ పంత్ దక్షిణాఫ్రికా-Aతో అనధికారిక టెస్టు మ్యాచులో బరిలో దిగారు. ఈ క్రమంలో ఆయన ధరించిన జెర్సీ అందరి దృష్టిని ఆకర్షించింది. కోహ్లీ జెర్సీ నంబర్ 18ని ధరించడమే దానికి కారణం. పంత్ జెర్సీ నం-17 కావడం గమనార్హం. అయితే పొరపాటున ఇలా జరిగిందా? లేదా కావాలనే ధరించారా? అనే విషయమై అభిమానుల్లో చర్చ నెలకొంది. కాగా కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

దట్టమైన పొగమంచు, వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కళ్లు, గొంతు నొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. CPCB ప్రకారం వాయు నాణ్యత 409కి పడిపోయింది. చలికాలం ఆరంభమవుతున్న తరుణంలో కాలుష్యం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గాలి వేగం తగ్గడమే దీనికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కాలుష్య నియంత్రణ కోసం డీజిల్ వాహనాల రాకపోకలపై ప్రభుత్వం నిషేధం విధించింది.

వర్షాల వల్ల వాతావరణంలో తేమ అధికంగా ఉంటుంది. దీని వల్ల చేపలకు చర్మ వ్యాధులు, పొట్ట ఉబ్బు వ్యాధి, శిలీంధ్రాల వల్ల కలిగే వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ఈ సమస్యల నివారణకు చేపలకు సమతుల్య ఆహారం ఇవ్వాలి. ఆహారం వేసే ముందు వర్షం పడుతుందా లేదా అని పరిశీలించాలి. తడి మేతను వేయకూడదు. పొడి మేతను వేయాలి. ఒకేసారి ఎక్కువ మేత కాకుండా తొలి 2,3 రోజులు తక్కువ మోతాదులో వేయాలి. ప్రతిరోజూ చేపల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి.

స్థిరమైన అభివృద్ధి, ప్రజారోగ్యం, అగ్రికల్చర్ తదితర విషయాల్లో అణుశక్తి కీలక పాత్ర పోషిస్తోందని BJP MP పురందీశ్వరి చెప్పారు. UN సర్వసభ్య సమావేశంలో ఆమె ప్రసంగించారు. ‘అణు విజ్ఞానం, సాంకేతికతను శాంతియుతంగా, భద్రంగా వినియోగించుకోవడంలో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ బాగా పనిచేస్తోంది. శాంతియుత అణుశక్తికి IND అండగా ఉంటుంది. అణు విద్యుత్ పరిశోధనల్లో దేశం అసాధారణ పురోగతి సాధించింది’ అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.