News February 21, 2025

24 నుంచి ఆధార్ స్పెషల్ శిబిరాలు

image

AP: ఈ నెల 24-28 వరకు అన్ని జిల్లాల్లో ఆధార్ నమోదుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యదర్శి శివప్రసాద్ సూచించారు. ఆరేళ్లలోపు చిన్నారుల పేర్లతో కొత్తగా ఆధార్ నమోదు, పాత వాటిలో మార్పులకు ఏర్పాట్లు చేయాలన్నారు. కాగా రాష్ట్రంలో ఆరేళ్లలోపు 8.53L మంది, ఆ పైబడిన వారికి సంబంధించి 42.10L మంది ఆధార్ అప్డేట్ నమోదు పెండింగ్‌లో ఉందన్నారు.

News February 21, 2025

OTTలోకి వచ్చేసిన ‘డాకు మహారాజ్’

image

బాబీ డైరెక్షన్‌లో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘డాకు మహారాజ్’ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.170 కోట్ల కలెక్షన్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. తమన్ మ్యూజిక్ అందించగా, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రల్లో నటించారు.

News February 21, 2025

శివరాత్రి జాతరకు ఘనంగా ఏర్పాట్లు

image

TG: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం శివరాత్రి వేడుకకు ముస్తాబవుతోంది. ఈ నెల 25,26,27 తేదీలలో జాతర నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం గుడి చెరువు మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ప్రధాన ఆలయం వరకూ ఉచిత బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. 2వేల మంది పోలీసులతో బందోబస్తు చేపట్టనున్నారు.

News February 21, 2025

మా దేశంలో ఉండొద్దు.. బీబీసీకి అజెర్‌బైజాన్‌ ఆదేశాలు

image

తమ దేశంలోని కార్యాలయాలు మూసేసి వెళ్లిపోవాలని వార్తాసంస్థ బీబీసీని అజెర్‌బైజాన్ ఆదేశించింది. తమ చట్టప్రకారం కార్యాలయం నడిపే హక్కు ఆ సంస్థకు లేదని తేల్చిచెప్పింది. దీంతో తమ కార్యాలయం మూసేయక తప్పలేదని, మీడియా స్వేచ్ఛను అజెర్‌బైజాన్ తుంగలో తొక్కిందని బీబీసీ ఓ ప్రకటనలో ఆరోపించింది. బీబీసీ ఆ దేశంలో 1994 నుంచి పనిచేస్తోంది. మరోవైపు.. BBC ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తోందని అజెర్‌బైజాన్ మండిపడింది.

News February 21, 2025

టెన్త్ అర్హతతో 32,438 ఉద్యోగాలు.. గడువు పొడిగింపు

image

రైల్వేలో 32,438 గ్రూప్-డీ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియాల్సి ఉండగా RRB మరో వారం రోజులు పొడిగించింది. మార్చి 1 వరకు అప్లై చేసుకోవచ్చు. 4-13 వరకు కరెక్షన్ విండో ఓపెన్‌లో ఉంటుంది. టెన్త్/ITI పాసై, 18-36 ఏళ్ల వయసున్న వారు అర్హులు. CBT, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in/

News February 21, 2025

24 గంటలూ షాపులు తెరవచ్చు.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

image

TG: రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్రంలో మార్చి 2 నుంచి 31 వరకు షాపులను 24 గంటలూ తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. సిబ్బంది రోజుకు 8 గంటలు లేదా వారానికి 48 గంటలకు మించి పనిచేస్తే యాజమాన్యం రెట్టింపు వేతనం చెల్లించాలని స్పష్టం చేశారు. సెలవుల్లో పనిచేస్తే ప్రత్యామ్నాయ లీవ్ ఇవ్వాలన్నారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు.

News February 21, 2025

IPL.. ఆ జట్టు ఓనర్ మార్పు

image

ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం మారనుంది. అందులో అత్యధిక షేర్ కొనడానికి టొరంట్ గ్రూప్ సిద్ధమైంది. 67శాతం వాటా కొనుగోలుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. ప్రస్తుతం ఆ జట్టుకు సీవీసీ క్యాపిటల్ పార్ట్‌నర్స్ యజమానిగా ఉంది. అయితే వాటా కొనుగోలు కోసం ఎంత మొత్తం వెచ్చిస్తున్న విషయం టొరెంట్ గ్రూప్ బయటపెట్టలేదు. 2021లో సీవీసీ క్యాపిటల్ GTని రూ.5600 కోట్లకు సొంతం చేసుకుంది.

News February 21, 2025

హైడ్రాను రద్దు చేస్తాం: హైకోర్టు

image

TG: చట్టప్రకారం కూల్చివేతలు చేపట్టాలని ఎన్నిసార్లు చెప్పినా ఉల్లంఘిస్తున్నారని హైడ్రాపై హైకోర్టు సీరియస్ అయ్యింది. జీవో నం.99కు విరుద్ధంగా వెళ్తే దానిని రద్దు చేసి హైడ్రాను మూసివేస్తామని హెచ్చరించింది. సంగారెడ్డి పటాన్‌చెరులో అక్రమంగా షెడ్ కూల్చివేశారని దాఖలైన పిటిషన్‌ పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఆధారాలు లేకుండా చర్యలు తీసుకోవద్దని తెలిపింది. తదుపరి విచారణ మార్చి5కి వాయిదా పడింది.

News February 21, 2025

రేపు JNTU, క్యాంపస్‌లకు హాలిడే

image

TG: JNTU విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఇకపై ప్రతి 4వ శనివారం సెలవు ఇస్తూ VC కిషన్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. దీని ప్రకారం రేపు JNTU యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజీలకు సెలవు ఉండనుంది. 2008కి ముందు ఇదే తరహా ఆదేశాలు ఉండగా, ఆ తర్వాత రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ సెలవు ఆదేశాలు రావడంతో ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు హర్షం చేస్తున్నారు. 16 ఏళ్ల తర్వాత రేపు తొలిసారి 4వ శనివారం సెలవు తీసుకోబోతున్నారు.

News February 21, 2025

తిరుపతిలో రాష్ట్రంలోనే అతిపెద్ద రన్‌వే

image

AP: రేణిగుంట ఎయిర్‌పోర్టులో ఇంటర్నేషనల్ విమానాలు ల్యాండ్ అయ్యేలా అతిపెద్ద రన్‌వే అందుబాటులోకి వచ్చింది. గతంలో ఉన్న 2285 మీటర్ల రన్‌వేను 3810 మీటర్లకు విస్తరించారు. దీంతో విశాఖ, విజయవాడ కన్నా అతిపెద్ద రన్‌వే ఏర్పడింది. అలాగే విమానాలు టర్న్ తీసుకునే ప్రాంతాన్ని 700mts నుంచి 1500mtsకు పెంచారు. రన్‌వేపై లైటింగ్ ఏర్పాటు పనుల కారణంగా ఇవాళ మ.2.30 నుంచి రేపు ఉ.5 గంటల వరకు విమాన సర్వీసులను రద్దు చేశారు.